
సాక్షి, తూర్పుగోదావరి : రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రమంతా భూముల సర్వే నిర్వహిస్తామని అన్నారు. వచ్చే ఏడాది ఉగాది వరకు రాష్ట్రంలో ఇళ్లు కట్టడాలు చేపట్టి 25 లక్షల మందికి సొంత ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో వెనుకబడి వున్న డ్వాక్రా సంఘాలను పునరుద్దరించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రైతులకు ఇస్తున్న క్రాప్ లోన్స్ 20% పెంచేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించినట్లే నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బిసీ లకు 50% స్థానం కల్పించే అంశంపై ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment