వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్, చిత్రంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్
అజెండాను అమలు చేసి చూపించిన సీఎం జగన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సరిగ్గా సగం సీట్లు
ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
దేశ చరిత్రలోనే సీఎం జగన్ సరికొత్త రికార్డు.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం
ఇప్పుడు అదే రీతిలో శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో మొత్తంగా సగం స్థానాలు ఆ వర్గాలకే
గత ఎన్నికల్లో 89 స్థానాలు.. ఇప్పుడు 100 స్థానాలు కేటాయింపు
ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేసిన దాఖలాలు లేవంటోన్న రాజకీయ పరిశీలకులు
ఎన్నికల్లో సామాజిక విప్లవానికి నాంది.. ఇప్పుడు సామాజిక మహా విప్లవం ఆవిష్కరణ
అసెంబ్లీ సీట్లలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 48 కేటాయింపు.. ఇందులో మైనార్టీలకు 7 స్థానాలు
మహిళలకు 19 స్థానాల్లో అవకాశం
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 135 స్థానాల్లో బీసీలకు కేవలం 25 సీట్లే
మరోసారి బీసీ వర్గాలకు ద్రోహం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
గత ఎన్నికల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, మైనార్టీలకు 5.. బీసీలకు 41 శాసనసభ స్థానాల్లో అవకాశం
ఈ ఎన్నికల్లో మహిళలకు 4, మైనార్టీలకు 2 స్థానాలు అదనంగా కేటాయింపు
గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 7 లోక్‌సభ స్థానాల్లో అవకాశం
ఈ దఫా ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11 స్థానాల్లో అవకాశం
గత ఎన్నికల్లో మహిళలకు నాలుగు చోట్ల అవకాశం.. ఇప్పుడు ఐదు సీట్లు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ, 25 లోక్‌సభ మొత్తం 200 స్థానాలకుగాను సరిగ్గా సగం అంటే 100 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ సామాజిక న్యాయ పతాకాన్ని ఎగరేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. గత ఎన్నికల తరహాలోనే శనివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్.. మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ లతో ఒకేసారి 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటింపజేశారు.
సామాజిక మహా విప్లవం
► నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఆ వర్గాలను అక్కున చేర్చుకుంటూ వారి సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్.. సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకుగాను 29 స్థానాల్లో ఎస్సీ, 7 స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించారు. మొత్తం 84 శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు.
ఇందులో 7 స్థానాల్లో మైనార్టీలకు, మొత్తంగా మహిళలకు 19 స్థానాల్లో అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 స్థానాలు వెరసి ఆ వర్గాలకు 77 స్థానాలను కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు 7 స్థానాలు అధికంగా ఆ వర్గాలకు కేటాయించారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు మహిళలకు అదనంగా 4 స్థానాలు, మైనార్టీలకు అదనంగా 2 స్థానాలు కేటాయించారు.
► 25 ఎంపీ స్థానాలకుగాను 4 స్థానాల్లో ఎస్సీ, ఒక స్థానంలో ఎస్టీ, 11 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అంటే.. మొత్తం 16 లోక్‌సభ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు ఏడు వెరసి 12 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు ఆ వర్గాలకు అదనంగా 4 స్థానాలు కేటాయించారు. గత ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థినులుగా 4 చోట్ల మహిళలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 5 స్థానాలను కేటాయించారు.
చంద్రబాబు, పవన్ సామాజిక ద్రోహం
సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడి జనసేనతో జట్టుకట్టారు. అయినా ఘోర పరాజయం తప్పదని గ్రహించి.. అవినీతి కేసుల నుంచి బయటపడొచ్చనే వ్యూహంతో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి వార్టితో పొత్తు పెట్టుకుని జనసేనకు 21, బీజేపీకి పది శాసనసభ స్థానాలు కేటాయించారు. 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా లెక్క తేల్చారు.
ఈ కూటమి ఇప్పటిదాకా 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో బీసీలు కేవలం 25 (టీడీపీ 24, జనసేన 1) మంది, మైనార్టీలు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. ఆ మూడు పార్టీలు ఖరారు చేయాల్సిన స్థానాలు ఇంకా 40 మాత్రమే మిగిలాయి. వాటిలో ఒకట్రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు, పవన్ మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచి, ఆ వర్గాలకు ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది.
చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ఇచ్చిన తరహాలోనే..
మంత్రివర్గం కూర్పుతోనే సామాజిక న్యాయానికి నాంది పలికిన సీఎం జగన్.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు పెద్దపీట వేసి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. నా నా అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు పదవులు, పనులు ఇచ్చారు. ఇప్పుడు 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలు కలిపి 200 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 శాతం కేటాయించి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు.
అన్ని వర్గాలకు ఊతం.. అందుకే గెలుపు ఖాయం
గత 58 నెలలుగా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో అన్ని వర్గాల పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లను సీఎం జగన్ జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్లు.. వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చడం ద్వారా అన్ని వర్గాల పేదల అభివృద్ధికి ఊతమిచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. అందులో 2.13 లక్షల ఉద్యోగులను గత 58 నెలల్లోనే నియమించారు. గత 58 నెలల పాలనలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కని్పస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ వినమ్రంగా కోరుతూ సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ సమర భేరి మోగించారు.
ఇందులో భాగంగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి విజయవంతమయ్యాయి. టీడీపీ–జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లా్లప్ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మారిటైజ్ వంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో జగన్ ఎగరేసిన సామాజిక న్యాయ పతాకం రెపరెపలాడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment