రానున్న ఎన్నికల్లో డబ్బు గుమ్మరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు దించారంటూ పవన్ కల్యాణే చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పాలన ఏపీలోనే చూస్తున్నామని తెలిపారు.