
హైదరాబాద్: అమెరికన్ విశ్వవిద్యాలయం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ (ఎస్‌ఎల్‌యూ) తమ అంతర్జాతీయ విద్యార్థులు స్థానికంగా ఉద్యోగావకాశాలను దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా వారు ఉద్యోగానుభవం పొందేందుకు ఉపయోగపడే లెవెల్‌అప్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఎల్‌యూ అసోసియేట్ ప్రొవోస్ట్ ఎరిక్ ఆర్మ్‌బ్రెక్ట్ తెలిపారు.
అంతర్జాతీయ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో అనుభవాన్ని గడించేందుకు, జాబ్ మార్కెట్లో కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎక్సెలరేట్ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment