Job skills
-
అమెరికాలో ఉద్యోగావకాశాలు.. ఎస్ఎల్యూ నుంచి లెవెల్అప్ ప్రోగ్రాం
హైదరాబాద్: అమెరికన్ విశ్వవిద్యాలయం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ (ఎస్ఎల్యూ) తమ అంతర్జాతీయ విద్యార్థులు స్థానికంగా ఉద్యోగావకాశాలను దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా వారు ఉద్యోగానుభవం పొందేందుకు ఉపయోగపడే లెవెల్అప్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎల్యూ అసోసియేట్ ప్రొవోస్ట్ ఎరిక్ ఆర్మ్బ్రెక్ట్ తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో అనుభవాన్ని గడించేందుకు, జాబ్ మార్కెట్లో కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎక్సెలరేట్ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొన్నారు. -
టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా!
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారి తొలగింపు కథనాలు, కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో లింక్డ్ఇన్ వంటి సామాజిక వేదికలు నిండిపోయాయి. కొంతమంది ఇప్పటికే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోగా మరికొందరు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ, మంచి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మంచి నైపుణ్యాలు కావాలి. ఇంటర్వ్యూల్లో చూసేది ఇదే.. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ టాప్ సీక్రెట్ చెప్పారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో రిక్రూటర్లు అభ్యర్థులలో ఆశించే టాప్ స్కిల్ ఏంటో ఆమె బయటపెట్టారంటూ సీఎన్‌బీసీ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఓ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అభ్యర్థుల్లో రిక్రూటర్లు చూసే అత్యుత్తమ నైపుణ్యం స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్). ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! క్లైర్.. గూగుల్‌లో తన పదేళ్ల సుదీర్ఘ అనుభవంలో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు స్వీయ-అవగాహన ఎంత మేరకు కలిగి ఉన్నారో చేసేవారు. దాని ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. వారంలో 40 గంటలు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ఆమె వెచ్చించేవారు. ఈ సమయంలో తాను అభ్యర్థులలో అన్నింటికంటే ముందు చూసే ఒక నైపుణ్యం స్వీయ-అవగాహన అని ఆమె పేర్కొన్నారు. పని అనుభవం, ఇతర నైపుణ్యాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటిని నిదానంగా తెలుసుకోవచ్చన్నారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! క్లైర్ మాటల ప్రకారం.. ఇలా స్వీయ అవగాహన కలిగి ఉన్న వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపుతారు. చేయాల్సిన పని గురించి నిజాయితీగా ఉంటారు. సహోద్యోగులు, ఉన్నతోద్యోగులతో మెరుగైన సంబంధం కలిగి ఉంటారు. స్వీయ-అవగాహన అనేది ఒక 'అరుదైన' లక్షణం. ఓ పరిశోధన ప్రకారం.. 95 శాతం మంది అభ్యర్థులు తమకు స్వీయ-అవగాహన ఉందని భావిస్తారు. కానీ వాస్తవానికి 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. -
ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ సింపుల్ ట్రిక్స్ మర్చిపోకండి
చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరి కల. అందుకోసం ముందు ఇంటర్వ్యూను ఛేదించాల్సి ఉంటుంది. చాలామంది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలో తెలియక అవకాశాలను కోల్పోతుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. సులభంగానే ఇంటర్వ్యూలో సక్సెస్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. సంస్థ గురించి ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి అధ్యయనం చేసి..అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దరఖాస్తు చేసిన ఉద్యోగం, నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలపైనా అవగాహన కలిగి ఉండాలి. మంచి వస్త్రధారణ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్త్రధారణ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే రిక్రూటర్లు అభ్యర్థిని త్వరగానే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. చదవండి: వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా! కాస్త ముందుగానే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కంటే.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లేలా చూసుకోవాలి. దాంతో అనవసరపు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి చేరుకోవడమో లేదా ఆలస్యంగా వెళ్లడమో చేస్తే గందరగోళ పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. హుందాగా వ్యవహరించాలి సంస్థలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. గేట్ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి.. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా.. సంస్థలో ఎంతో మంది ఎదురవుతారు. వీరందరితో హుందాగా ప్రవర్తించాలి. కరచాలనం, పలకరించే సందర్భాల్లో పద్ధతిగా మసలుకోవాలి. ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష, భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి. నిజాయితీ ముఖ్యం ఇంటర్వ్యూ చేసేవారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. అంతేతప్ప ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. ఏదో ఒకటి చెబితే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగానే గుర్తిస్తారు. హావభావాలు ఇంటర్వ్యూలో హావభావాలు కూడా ముఖ్యమే. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాళ్లు కదపడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వంటి చేష్టలు అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండటం, అవసరమైతే సందర్భానుసారంగా చిరునవ్వు చిందించడం అవసరం. ఇవి తీసుకెళ్లాలి ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు జాబ్ అప్లికేషన్‌తోపాటు రెజ్యూమ్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్‌లో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత చివర్లో బోర్డ్ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం మరిచిపోవద్దు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూ గట్టెక్కి.. కోరుకున్న కొలువు సొంతమవుతుంది!! -
ఫాంగ్.. అందుకో ఆఫర్!
ఫాంగ్(ఎఫ్ఏఏఎన్జీ).. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌లకు సంక్షిప్త నామం. ఇవి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు. మార్కెట్లో వృద్ధి పరంగా.. ప్రగతిపథంలో పయనిస్తున్న టాప్ కంపెనీలు! అమెరికాకు చెందిన ఈ టెక్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఫాంగ్ కంపెనీల్లో కొలువు దక్కితే..ఆకర్షణీయ వేతనాలతోపాటు ఎదిగేందుకు ఆకాశమే హద్దు అనే అభిప్రాయం!! అందుకే టాప్ ఐఐటీలు మొదలు.. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరికీ ఫాంగ్ కంపెనీల్లో నియామకాలపై ఎంతో ఆసక్తి. ఈ నేపథ్యంలో.. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌లో రిక్రూట్మెంట్ ప్రక్రియ.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. బీటెక్ పూర్తయ్యాక.. మీ డ్రీమ్ కంపెనీ ఏది అని అడిగితే.. ఎక్కువ మంది నుంచి టక్కున వచ్చే సమాధానం.. గూగుల్, ఫేస్బుక్! తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో.. ఉద్యోగార్థులకు ఆకర్షణీయ సంస్థల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, గూగుల్ నిలిచాయి. ఫాంగ్గా పేర్కొనే ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్.. ఆన్‌క్యాంపస్, ఆఫ్క్యాంపస్ విధానాల్లో నియామకాలు జరుపుతున్నాయి. ఆఫ్–క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కోసం ముందుగా తమ సంస్థల వెబ్‌సైట్స్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నాయి. ఆయా ప్రకటనల ఆధారంగా అభ్యర్థులు తమ రెజ్యుమే ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఫేస్బుక్.. ఫేస్ చేయాలంటే! ►ఫేస్బుక్ అభ్యర్థుల్లో కోర్ నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూనే.. క్రియేటివిటీకి పెద్దపీట వేస్తుంది. ఫేస్బుక్ ఎంపిక ప్రక్రియ నాలుగైదు వారాలపాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. ► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెజ్యుమే ఆధారంగా ముందుగా టెలిఫోన్ సంభాషణ జరుగుతుంది. ఇందులో అభ్యర్థుల లక్ష్యాలు, అభిరుచులు, సంస్థలో ఉద్యోగంపై ఉన్న వాస్తవ ఆసక్తిని తెలుసుకుంటారు. ఆ తర్వాత టెలిఫోనిక్ లేదా వీడియో విధానంలో మరో రెండు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిలో విజయం సాధిస్తే.. సంస్థ కార్యాలయంలో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని సూచిస్తారు. ఇక్కడ మరో మూడు లేదా నాలుగు రౌండ్లలో రిటెన్, ఓరల్ టెస్ట్‌లు ఉంటాయి. ► రిటెన్ టెస్ట్‌ల్లో కోడింగ్‌కు సంబంధించి రెండు లేదా మూడు ప్రశ్నలు ఇచ్చి.. వాటిని పరిష్కరించమని అడుగుతారు. ఇందుకు అరగంట నుంచి గంట వరకు సమయం ఇస్తారు. ఈ దశ దాటిన వారిని ఇంటర్వ్యూ రౌండ్స్ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలు టెలిఫోనిక్ లేదా వీడియో కాల్స్ రూపంలో ఉంటాయి. ఒక్కో రౌండ్ ఇంటర్వ్యూ దాదాపు 45 నిమిషాలపాటు జరుగుతుంది. ఫేస్బుక్ మూడు రకాల ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అవి.. కోడింగ్ ఇంటర్వ్యూ, డిజైన్ ఇంటర్వ్యూ, బిహేవియరల్ ఇంటర్వ్యూ. ► కోడింగ్ ఇంటర్వ్యూ కొన్ని సందర్భాల్లో రాత పరీక్ష రూపంలో ఉంటోంది. అభ్యర్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలు పరిశీలించేలా ఈ పరీక్ష నిర్వహిస్తారు. తొలి దశలో నిర్వహించే కోడింగ్ పరీక్షతో పోల్చితే ఇది కొంత క్లిష్టంగా ఉంటుంది. దాదాపు అరగంట వ్యవధిలో జరిగే ఈ కోడింగ్ ఇంటర్వ్యూలో చివరి అయిదు నుంచి పది నిమిషాలు అభ్యర్థులను మౌఖికంగా పరీక్షించేందుకు కేటాయిస్తారు. ► డిజైన్ ఇంటర్వ్యూ రౌండ్లో..సిస్టమ్ డిజైన్ లేదా నిర్దిష్టంగా ఒక ప్రొడక్ట్ డిజైన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. డిజైన్ ప్రిన్సిపుల్స్, అభ్యర్థులు అప్పటికే చేసిన డిజైన్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ► బిహేవియరల్/కల్చరల్ ఫిట్ ఇంటర్వ్యూలో.. అభ్యర్థుల దృక్పథాన్ని, లక్షణాలను పరీక్షిస్తారు. లక్ష్యాలు, ప్రొఫైల్, నేపథ్యం, విలువలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. వీటికి అభ్యర్థులు ఇచ్చే సమాధానాలతో ఇంటర్వ్యూ ప్యానెల్ సంతృప్తి చెందితే.. ఫేస్బుక్ కొలువు ఖరారైనట్లే!! అమెజాన్.. ఆఫర్లు అందుకోండిలా! ► అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఎంపిక ప్రక్రియ గరిష్టంగా మూడు వారాలపాటు కొనసాగుతుంది. అభ్యర్థులకు ఐదు నుంచి ఆరు రౌండ్లలో ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహిస్తారు. ► ముందుగా అభ్యర్థుల రెజ్యుమేను పరిశీలిస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సరితూగుతారని భావిస్తే.. ఎంపిక ప్రక్రియకు పిలుపు వస్తుంది. ► తొలుత రిటెన్/ఆన్లైన్ కోడింగ్ రౌండ్స్‌తో ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ► రిటెన్/ఆన్లైన్ కోడింగ్ రౌండ్స్‌లో..అభ్యర్థుల్లోని టెక్నికల్ స్కిల్స్, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించేలా రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా అప్టిట్యూడ్,టెక్నికల్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ► రాత పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఆన్లైన్ కోడింగ్ రౌండ్లో..ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ► రిటెన్/ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. తొలి టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల రెజ్యుమే, పూర్తిచేసిన ప్రాజెక్ట్‌ల వివరాలు తెలుసుకుంటారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తర్వాత ప్రత్యక్ష ఇంటర్వ్యూలకు(ఆన్సైట్ ఇంటర్వ్యూ) పిలుస్తారు. ► మొదటి ఇంటర్వ్యూ అభ్యర్థుల్లోని అల్గారిథమ్ నైపుణ్యాలను తెలుసుకునేలా ఉంటుంది. తర్వాత రౌండ్లోనూ ఇవే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. ► ఆ తర్వాత హెచ్ఆర్/హైరింగ్ మేనేజర్ రౌండ్స్ పేరిట ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. హైరింగ్ మేనేజర్ రౌండ్ ఇంటర్వ్యూని పూర్తిగా టెక్నికల్ రౌండ్‌గా పేర్కొనొచ్చు. ఇందులో డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, కొన్ని క్లిష్టమైన పజిల్స్పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విజయం సాధిస్తే.. చివరగా బార్ రైజర్ రౌండ్ ఉంటుంది. ► బార్ రైజర్ రౌండ్లో.. సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుగుణంగా సదరు అభ్యర్థి సరితూగుతారో లేదో పరిశీలిస్తారు. అంతిమంగా సంస్థ హెచ్ఆర్ కమిటీ.. తొలిదశ నుంచి అభ్యర్థుల ప్రతిభను అన్ని కోణాల్లో పరిశీలించి..నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఈ నివేదిక ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. యాపిల్.. ప్రిపేర్ వెల్ ► యాపిల్ ఎంపిక ప్రక్రియలో.. ముందుగా సంబంధిత ఉద్యోగ ప్రకటనను అనుసరించి వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ మొదలవుతుంది. ► స్క్రీనింగ్‌లో భాగంగా తొలుత అభ్యర్థుల ప్రొఫై ల్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఇవి ప్రధానంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సదరు ఉద్యోగానికి సరితూగుతాడా అనేది తెలుసుకోవడంతోపాటు అకడమిక్ నేపథ్యంపైనా ప్రశ్నలు ఉంటాయి. ► ఆ తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తికరంగా సమాధానాలిస్తే.. ఆ తర్వాత మూడు లేదా నాలుగు రౌండ్లలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వీటిల్లో టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్లు ఉంటాయి. ► టెక్నికల్ ఇంటర్వ్యూలు రెండు రౌండ్లలో నిర్వహిస్తారు. వీటిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విజయం సాధిస్తే.. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ► హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలో.. టెక్నికల్, పర్సనల్, అకడమిక్ ప్రొఫైల్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ► కొన్ని సందర్భాల్లో గ్రూప్ డిస్కషన్స్‌తో ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలవుతుంది. 15 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. సామాజిక సంబంధిత అంశాలపై చర్చించమని అడుగుతారు. ఆ తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అనంతరం మరోసారి టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు, రిటెన్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ► వీటన్నింటిలోనూ విజయం సాధిస్తే.. ఉద్యోగ విధులు, వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు, నిబంధనల గురించి తెలియజేసి.. అభ్యర్థుల సమ్మతిని తెలుసుకుంటారు. దాని ఆధారంగా ఆఫర్ లెటర్ పంపిస్తారు. ► కంపెనీ అవసరాలు, కోరుకునే నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని.. సమగ్ర ప్రిపరేషన్‌తో ఎంపిక ప్రక్రియకు హాజరైతే.. యాపిల్ కొలువు సొంతం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్.. కెరీర్ ఫిక్స్ ► ఓటీటీ ప్రపంచంలో పేరున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థలో కొలువు ఖరారు చేసుకోవాలంటే.. ముందుగా సంస్థ వెబ్సైట్ లేదా జాబ్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► కంపెనీ జాబ్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా వచ్చిన దరఖాస్తులను హెచ్ఆర్ ప్రతినిధులు పరిశీలించి.. తొలుత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సదరు ఉద్యోగానికి సరితూగుతారా, వారి అకడమిక్ నేపథ్యం, అన్వయ సామర్థ్యాలను పరిశీలిస్తారు. ► ఆ తర్వాత దశలో ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు టెక్నికల్ అసెస్మెంట్ టెస్ట్‌లకు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న జాబ్ రోల్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ► ఈ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా హెచ్ఆర్ ప్రతినిధులు అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,పని సంస్కృ తికి సరితూగే దృక్పథాన్ని పరిశీలించి.. సంబంధిత విభాగానికి సిఫార్సు చేస్తారు. విభాగాధిపతుల నిర్ణయం మేరకు ఆఫర్ ఖరారవుతుంది. గూగుల్‌ను... గెలవాలంటే ► అంతర్జాతీయంగా ఉద్యోగార్థుల క్రేజీ కంపెనీ గూగుల్.. అభ్యర్థుల అకడమిక్ నైపుణ్యాలతోపాటు అంకిత భావం, నేర్చుకోవాలనే తపనకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తోంది. ► గూగుల్ సంస్థలో.. దరఖాస్తు నుంచి ఆఫర్ లెటర్ వరకు దాదాపు ఆరు వారాల పాటు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ► ముందుగా సంస్థ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న వివరాల ఆధారంగా సంబంధిత ఉద్యోగానికి సరితూగుతారో, లేదో పరిశీలిస్తారు. ► ఉద్యోగానికి సరితూగుతారనుకునే అభ్యర్థులను స్టాఫింగ్ టీమ్ సభ్యులు సంప్రదించి.. ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని సూచిస్తారు. ► ఎంపిక ప్రక్రియలో భాగంగా కోడింగ్ క్విజ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌కు సంబంధించి ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూల ప్రక్రియ మొదలవుతుంది. ► ఇంటర్వ్యూలు ప్రారంభానికి ముందే ఫోన్ లేదా వీడియో ద్వారా వర్చువల్ చాటింగ్ విధానంలో హెచ్ఆర్ ప్రతినిధులు, హైరింగ్ మేనేజర్లు చిన్నపాటి చర్చ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల్లోని స్కిల్స్‌ను గుర్తించడంతోపాటు దరఖాస్తు చేసుకున్న జాబ్ రోల్‌కు సరితూగుతారా, లేదా? అని పరిశీలిస్తారు. ► కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందే చిన్నపాటి ప్రాజెక్ట్ వర్క్‌లు పూర్తి చేయమని అడుగుతారు. నిర్దిష్టంగా ఏదైనా కేస్ స్టడీని పేర్కొని.. దానికి సంబంధించి కోడింగ్ నమూనాలు రూపొందించమంటారు. ► గూగుల్‌లో ఇంటర్వ్యూలు ఒకే రోజు మూడు, నాలుగు రౌండ్లు కూడా నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలను స్ట్రక్చర్డ్, ఓపెన్ ఎండెడ్ కొశ్చన్స్‌గా పిలుస్తున్నారు. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూల్లో టెక్నికల్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఓపెన్ ఎండెడ్ కొశ్చన్స్ విధానంలో అభ్యర్థులు ఒక సమస్యను ఎలా పరిష్కరిస్తారో తెలుసుకునే విధంగా ప్రశ్నలు అడుగుతారు. వీటిలో విజయం సాధిస్తే గూగుల్ సంస్థలో కొలువు ఖరారైనట్లే!! ఫాంగ్ నియామకాలు... ముఖ్యాంశాలు ► సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ. ► అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పరిశీలించేలా ఎంపిక ప్రక్రియ. ► ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు, టెక్నికల్ టెస్ట్‌లతో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న సంస్థలు. ►ఫాంగ్ సంస్థల్లో దాదాపు ఆరు వారాల పాటు ఎంపిక ప్రక్రియ. ► క్రియేటివిటీ, లాజికల్ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్న సంస్థలు. ►టెక్నికల్ టెస్ట్‌లలో ప్రధానంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై దృష్టి. ►నాన్–టెక్నికల్ ఉద్యోగాల్లో కమ్యూనికేషన్, అప్టిట్యూడ్, సాఫ్ట్‌స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యం. -
ఉద్యోగ నైపుణ్యాలపై కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ.. కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది. ముందు వరుసలో హైదరాబాద్.. అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్గావ్, మంగళూరు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న వారి శాతం మహారాష్ట్ర 64.17 తమిళనాడు 60.97 ఉత్తరప్రదేశ్ 56.55 కర్ణాటక 51.21 ఆంధ్రప్రదేశ్ 48.18 ఢిల్లీ 42.57 తెలంగాణ 41.31 గుజరాత్ 36.68 పశ్చిమబెంగాల్ 35.72 రాజస్తాన్ 31.87 కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం) కోర్సు 2019 2020 2021 బీఈ/బీటెక్ 57.09 49 46.82 ఎంబీఏ 36.44 54 46.59 బీఏ 29.3 48 42.72 బీకాం 30.06 47 40.3 బీఎస్సీ 47.37 34 30.34 ఎంసీఏ 43.19 25 22.42 పాలిటెక్నిక్ 18.05 32 25.02 బీఫార్మసీ 36.29 45 37.24 -
అతివలు.. అదుర్స్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 స్పష్టం చేసింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై నివేదికలో అంచనా వేశాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.1 లక్షల మంది విద్యార్థులను కలిశాయి. గతంతో పోలిస్తే ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 2014 సంవత్సరం నివేదిక ప్రకారం అప్పట్లో 30.3 శాతం పురుషుల్లో ఉద్యోగ నైపుణ్యాలు ఉంటే, 42.1 శాతం మంది మహిళల్లో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య మధ్యలో తగ్గిపోయింది. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన పురుషుల సంఖ్య 47.39 శాతానికి క్రమంగా పెరుగుతూ రాగా, 2015లో నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 37.88 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత 2016, 2017 నివేదిక ప్రకారం ఆ రెండేళ్లలో పెరిగినా 2018 నివేదిక ప్రకారం 38.15 శాతానికి తగ్గిపోయింది. ఏడాది మళ్లీ పుంజుకుందని, 45.6 శాతానికి నైపుణ్యాలున్న మహిళల సంఖ్య పెరిగిందని తాజా నివేదికలో వివరించింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో రెండో స్థానం సబ్జెక్టుల్లోని పరిజ్ఞానంతో పాటు ఇతర నైపుణ్యాలనూ అధ్యయనం చేసింది. రాష్ట్రాల వారీగా విద్యార్థులు స్థితిగతులను అంచనా వేసింది. నేర్చుకునే సామర్థ్యాలు (లెర్నింగ్ ఎబిలిటీ), విషయ స్వీకరణ సామర్థ్యం (అడాప్టబిలిటీ), ఇతరులతో భావవ్యక్తీకరణ సామర్థ్యాలు (ఇంటర్ పర్సనల్ స్కిల్స్), భావోద్వేగ మేధస్సు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్), సంక్షోభ పరిష్కార సామర్థ్యం, స్థిర దృక్పథం అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో తెలంగాణ విద్యార్థులు భావోద్వేగ మేధస్సు, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లో రెండో స్థానంలో నిలవగా, లెర్నింగ్ ఎబిలిటీలో 7వ స్థానం, అడాప్టబిలిటీ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో 8వ స్థానం, సెల్ఫ్ డిటర్మినేషన్‌లో 6వ స్థానంలో నిలిచారు. పనిలో భాగస్వామ్యం పెరగాలి.. పనిలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం పనిలో పురుషుల భాగస్వామ్యం 75 శాతం, మహిళల భాగస్వామ్యం 25 శాతం ఉంది. పట్టణాల్లో 68.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 67శాతం డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ‘పెయిడ్ జాబ్స్’లేవని పేర్కొంది. -
వేతనంపై బేరమాడండి ఇలా...
జాబ్ స్కిల్స్ మీ అర్హతలకు తగిన మంచి జాబ్ ఆఫర్ చేతిలో పడిందా? దాన్ని అలాగే జాగ్రత్తగా పట్టుకోండి. పొరపాట్లు చేసి, జారవిడుచుకోవద్దు. వేతనం విషయంలో పట్టిన పట్టు మీదే ఉండి కొందరు అవకాశాన్ని చేజేతులా వదులుకుంటారు. సంస్థలో ఉద్యోగం ఖాయమని తెలియగానే అభ్యర్థులు చేసే మొట్టమొదటి పని.. వేతనం గురించి బేరసారాలు ప్రారంభించడం. తెలిసినవాళ్లు కూడా నీ జీతం ఎంత? అని ప్రశ్నిస్తుంటారు. ఎవరైనా ఎక్కువ జీతం రావాలని ఆశించడం సహజమే. అయితే, ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సంస్థ మిమ్మల్ని వదులుకొని, మరొకర్ని ఉద్యోగంలో చేర్చుకుంటుంది. కోరినంత జీతాలిచ్చే పరిస్థితి ఉండదు. అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుకోవాలి. అదే సమయంలో తమ అర్హతలు, నైపుణ్యాలకు తగిన విలువ దక్కేలా చూసుకోవాలి. మీ అసలైన విలువ ఎంత? వేతనం అడగడానికంటే ముందు దీనిపై కొంత పరిశోధన చేయాలి. మీకు కొలువు లభించిన సంస్థలో, అదే రంగంలో ఉద్యోగులకు అందుతున్న వేతనాలు, శాలరీ ట్రెండ్స్ తెలుసుకోవాలి. దీనికోసం ఆన్లైన్ శాలరీ టూల్స్ ఉపయోగించుకోవాలి. సంస్థ నుంచి ఎంత ఆశించవచ్చో ఒక అవగాహన వస్తుంది. అంతేకాకుండా మీ అసలైన విలువ ఎంతో లెక్కకట్టాలి. మీలోని అర్హతలు, అనుభవం, నైపుణ్యాలకు మార్కెట్లో దక్కే విలువ ఎంతో తెలుసుకోవాలి. టైమింగ్ ముఖ్యం ఉద్యోగం రాగానే జీతం గురించి సంస్థతో మాట్లాడొద్దు. దీనివల్ల మీపై ప్రతికూల భావన ఏర్పడే ఆస్కారం ఉంది. యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలి. ఈలోగా జాబ్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. సరైన సమయం చూసుకొని శాలరీ ప్యాకేజీ గురించి సంస్థ వద్ద ప్రస్తావించాలి. వేతనం అంటే నెలనెలా చేతిలో పడేది మాత్రమే కాదు. మొత్తం ప్యాకేజీని పరిశీలించండి. ఇందులో ఇతర రాయితీలు, ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. కొన్నిసార్లు చేతిలో పడే వేతనం కంటే అవే ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని సంస్థల్లో వేతనం తక్కువైనా సరళమైన పనివేళలు ఉంటాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటిపై అవగాహన పెంచుకున్న తర్వాతే అడగాల్సిన వేతనంపై తుది నిర్ణయానికి రావాలి. పరిధులు తెలుసుకోండి మీ అసలైన విలువ ఎంతో తెలుసుకున్న తర్వాత ఈ సంఖ్యకు కాస్త అటూఇటుగా సంస్థతో బేరమాడేందుకు ప్రయత్నించాలి. ఫలానా సంఖ్య నుంచి ఫలానా సంఖ్య వరకు జీతం ఆశిస్తున్నట్లు తెలియజేయండి. అయితే, ఈ విషయంలో పరిధుల్లోనే ఉండాలి. అసలు విలువ కంటే ఎక్కువ ఆశిస్తే సంస్థ మిమ్మల్ని వదులుకుంటుంది. మీ విలువ, మార్కెట్ స్థితిగతుల ప్రకారమే జీతం కోరడం మంచిది. విజయం.. ఇద్దరిదీ! వేతనంపై బేరసారాలు అంటే.. అభ్యర్థి, యాజమాన్యం మధ్య పోరాటం కాదు. ఇరువర్గాలకు సంతృప్తి కలిగించేలా శాలరీ ప్యాకేజీపై ఆఖరి నిర్ణయానికి రావాలి. చేస్తున్న పనికి సరైన విలువ దక్కిందన్న భావన మీకు, ఇస్తున్న జీతానికి సరైన ప్రతిఫలం లభిస్తోందన్న సంతృప్తి యాజమాన్యానికి కలగాలి. అప్పుడే ఉద్యోగి, యాజమాన్యం మధ్య బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. -
అర్హతలు ఎక్కువైనా తక్కువైనా ఇంటర్వ్యూలో జయకేతనం!
అభ్యర్థులు ఉద్యోగ ప్రకటన చూసి, ఇంటర్వ్యూకు హాజరవుతుంటారు. ఇందులో వారి అర్హతలు, అనుభవం, గుణగణాలను తెలుసుకునేందుకు రిక్రూటర్ వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధిస్తారు. వడపోత అనంతరం కొలువుకు అవసరమైన లక్షణాలున్నవారిని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్ చేతికి అందిస్తారు. ఇంటర్వ్యూకు వివిధ అర్హతలున్న అభ్యర్థులు హాజరవుతారు. జాబ్ డిమాండ్ చేస్తున్న దానికంటే ఎక్కువ అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు మౌఖిక పరీక్షలో తారసపడుతుంటారు. అలాగే తక్కువ ఉన్నవారు కూడా వస్తుంటారు. ఎక్కువ అర్హతలుంటే కొలువు ఖాయమని, తక్కువ అర్హతలుంటే రిక్రూటర్‌ను మెప్పించలేమని అనుకోవడానికి వీల్లేదు. ఓవర్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఎక్కువ కాలం ఉద్యోగంలో కొనసాగరని, ఇంతకంటే మంచి ఆఫర్ వస్తే వెళ్లిపోతారని, అండర్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఉద్యోగానికి న్యాయం చేయలేరనే రిక్రూటర్ భావిస్తారు. అయితే, రిక్రూటర్‌ను ఒప్పించగలిగితే ఎలాంటి అర్హతలున్నవారైనా ఉద్యోగం సంపాదించవచ్చు. ఎక్కువ అర్హతలుంటే చేయండిలా.. కొలువుకు కావాల్సినవాటికంటే ఎక్కువ అర్హతలు, పరిజ్ఞానం, పని అనుభవం మీలో ఉండొచ్చు. దాన్నే మీకు అనుకూలంగా మార్చుకోండి. ఉద్యోగం పట్ల మీకు అంకితభావం ఉందని ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు తెలియజేయండి. ఇలాంటి కొలువు కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని, దీనికి న్యాయం చేసేందుకు 100 శాతం కృషి చేస్తానని చెప్పండి. ఈ రంగం గురించి ముందే తెలుసు కాబట్టి ఉద్యోగంలో చేరగానే పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించి, ఫలితాలు సాధించి చూపుతానని వివరించాలి. తక్కువ అనుభవం ఉన్న వ్యక్తులైతే పని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం అవసరం. మీ విషయంలో ఈ ఇబ్బంది ఉండదు కనుక రిక్రూటర్ సంతృప్తి చెందుతారు. జాబ్ టైటిల్, వేతనం ముఖ్యం కాదని, వర్క్ ప్రొఫైల్‌పై ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం చేయండి. ఉద్యోగంలో దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధిస్తానని వివరించండి. సంస్థపై, కొలువుపై మీలో నిజంగా ఆసక్తి ఉందని, అందులో ఎక్కువ కాలం పనిచేయాలని కోరుకుంటున్నట్లు రిక్రూటర్‌కు తెలిసేలా సమాధానాలు చెప్పండి. తక్కువ అర్హతలుంటే చేయండిలా.. అండర్ క్వాలిఫైడ్ అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీలో అర్హతలు, అనుభవం లేవు కదా! మిమ్మల్ని ఉద్యోగంలో ఎందుకు చేర్చుకోవాలి? అని రిక్రూటర్ ప్రశ్నించే అవకాశం ఉంది. కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. కొలువులో చేరిన వెంటనే వేగంగా పని నేర్చుకొని, అనుభవం పెంచుకుంటానని చెప్పాలి. మీకు ఒక రంగంపై పరిజ్ఞానం లేకపోయినా మరో రంగంపై ఉండొచ్చు. ఆ విషయాన్ని రిక్రూటర్‌కు వివరించాలి. రెజ్యుమెలో పేర్కొన్నదానికంటే ఎక్కువ అనుభవమే మీలో ఉన్నట్లు వెల్లడించాలి. అర్హతలు తక్కువగా ఉన్నా అనుభవంతో ఆ లోపాన్ని అధిగమిస్తానని స్పష్టం చేయాలి. మీలోని జాబ్ స్కిల్స్‌పై ఇంటర్వ్యూ కంటే ముందే కొంత హోంవర్క్ చేయాలి. ఉద్యోగార్హతలకు వాటిని అనుసంధానించుకోవాలి. ఉద్యోగానికి మీలోని బలాలు, నైపుణ్యాలు సరిపోతాయని, అవసరమైతే మెరుగుపర్చుకుంటానని రిక్రూటర్‌కు అర్థమయ్యే లా వివరించాలి. దీనివల్ల రిక్రూటర్ దృష్టి మీలోని లోపాల నుంచి నైపుణ్యాల వైపు మళ్లుతుంది. జాబ్ దక్కడానికి అవకాశాలు రెట్టింపవుతాయి. ఇంటర్వ్యూలో ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎలా సమాధానం ఇస్తున్నారు? రిక్రూటర్‌ను ఏ మేరకు ఒప్పించగలుగుతున్నారు? అనేవే మీ విజయావకాశాలను నిర్ణయిస్తాయి. మిమ్మల్ని మీరు ఉత్తమమైన అభ్యర్థిగా నిరూపించుకోగలిగితే మౌఖిక పరీక్షలో నెగ్గినట్లే. అందుకు తగినట్లుగా ముందుగానే సిద్ధమై ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాలి. -
కొలువు సాధనకు.. మూడు లక్షణాలు
జాబ్ స్కిల్స్ ఆధునిక ప్రపంచంలో పోటీ నానాటికీ పెరిగిపోతోంది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కోర్సులో ప్రవేశించాలన్నా, నచ్చిన కొలువులో చేరాలన్నా ఇతరుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిందే. చదువు పూర్తయిన తర్వాత సంతృప్తికరమైన వేతనం లభించే ఉద్యోగంలో చేరాలనేది అందరి కల. అయితే, ఇంటర్వ్యూలో ఇతర అభ్యర్థుల కంటే మిన్నగా రిక్రూటర్‌ను మెప్పిస్తేనే ఉద్యోగం సొంతమవు తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో విజయానికి కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. రిక్రూటర్ ఆశించేదేమిటి? సంస్థ యాజమాన్యం ఎదుట అభ్యర్థి తన సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుకల్పించే వేదిక.. ఇంటర్వ్యూ. మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థి నుంచి రిక్రూటర్ ఏం కోరుకుంటు న్నారో తెలుసుకోవాలి. ఏ ప్రాతిపదికన అభ్యర్థిని అంచనా వేస్తున్నారో గుర్తించాలి. ఎలాంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలని ఆశిస్తున్నారో.. వాటిని పెంపొందించుకుంటే గెలుపు ఖాయం. సాధారణంగా మూడు లక్షణాలను రిక్రూటర్ కోరుకుంటారు. అవి ఇంటెలిజెన్స్, లీడర్షిప్, ఇంటిగ్రిటీ. తెలివితేటలు: అభ్యర్థిలో రిక్రూటర్ ప్రధానంగా ఆశించే లక్షణం.. మంచి తెలివితేటలు. దీంతోపాటు ఉద్యోగానికి అవసరమైన సమయస్ఫూర్తి, సమస్యలను పరిష్కరించే ప్రాక్టికల్ సామర్థ్యం ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు మీలో ఉన్నట్లు ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు తెలియాలంటే.. కొలువుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించాలి. రిక్రూటర్ చెప్పే సమాధానాలను కుతూహలంతో వినాలి. వారు ఏవైనా సమస్యలను ప్రస్తావిస్తే మీరు వాటికి పరిష్కార మార్గాలను సూచించాలి. సదరు ఉద్యోగంపై మీలో ఆసక్తి ఉన్నట్లు రిక్రూటర్ గుర్తిస్తారు. నాయకత్వం లీడర్షిప్ అంటే కొత్త బాధ్యతలను స్వీకరిం చేందుకు సర్వసన్నద్ధంగా ఉండడం. ఉద్యోగం లో జవాబుదారీతనంతో వ్యవహరించడం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడాన్ని, ఊహించని సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడాన్ని, సాకులు చూపకపోవడాన్ని కూడా నాయకత్వ లక్షణంగా భావిస్తారు. నిజాయతీ అభ్యర్థులు సంస్థకు విధేయులుగా ఉండడాన్ని, తమ బలాలతోపాటు బలహీనతలనూ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడాన్ని నిజాయతీగా చెప్పుకోవచ్చు. కార్యాలయంలో సహచరులను, బృంద సభ్యులను విమర్శించకపోవడం, పాత యాజమాన్యాన్ని తప్పుపట్టకపోవడం వంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలి. అందుకే ఇంటర్వ్యూలో అభ్యర్థి మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రశ్నలు వేస్తుంటారు. పాత యాజమాన్యం గురించి ప్రస్తావిస్తుంటారు. అభ్యర్థులు తగిన సమాధానం ఇవ్వాలి. -
మీ బలహీనతలేంటి?
జాబ్ స్కిల్స్ మీకున్న బలహీనతలు ఏమిటో వివరంగా చెప్పండి?... వినడానికి ఇది చాలా మామూలు ప్రశ్నగానే అనిపిస్తుంది. కానీ, దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూల్లో రిక్రూటర్లు దీన్ని తరచుగా సంధిస్తుంటారు. అభ్యర్థి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి అతడికి ఉద్యోగం ఇవ్వాలో వద్దో తేల్చేస్తుంటారు. బలహీనతలు లేని మనుషులంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కారు. ఈ నిజాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. మరి, ఇంటర్వ్యూల్లో బలహీనతల గురించి పూసగుచ్చినట్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయొచ్చా? దీనివల్ల అభ్యర్థి నిజాయతీని మెచ్చుకొని, ఉద్యోగం ఇచ్చేస్తారా? అలా ఇచ్చేయరని నిపుణులు చెబుతున్నారు. బలహీనతల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. హాని కలిగించేవి, కలిగించనవి. కాబట్టి, ఇంటర్వ్యూలో ఇలాంటి వాటిపై ప్రశ్న ఎదురైనప్పుడు చాకచక్యంగా రిక్రూటర్‌కు నచ్చే సమాధానం ఇవ్వాలని సూచిస్తున్నారు. అతిశయోక్తులను ఆశ్రయించొద్దు. మౌఖిక పరీక్షలో వీక్నెస్పై ప్రశ్న వేయగానే అభ్యర్థులు కంగారుకు లోనవుతుంటారు. వెంటనే ఏం చెప్పాలో తెలియక తికమక పడుతుంటారు. వెనుకాముందు ఆలోచించకుండా మనసులో ఉన్నది బయటపెడితే ఉద్యోగం దక్కే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగనీ అతిశయోక్తులు కూడా చెప్పొద్దు. నేను చాలా పర్ఫెక్షనిస్టుని, నాలో ఎలాంటి లోపాలు లేవు అని చెబితే మీరు అహంకారులని, గర్వం ఉందని ఇంటర్వ్యూ బోర్డు భావించే ప్రమాదం ఉంటుంది. కొందరైతే ఇతరుల వైఖరి వల్లే తాము బలహీనతలకు లోనవుతుంటామని, అందులో తమ తప్పు లేదని చెబుతుంటారు. నా బృందంలోని సభ్యులు, సహచరులు సరిగ్గా పనిచేయకపోతే నేను సహనం కోల్పోతుంటాను, అదే నా వీక్నెస్ అని సమాధానం ఇస్తుంటారు. కానీ, అది సరైంది కాదు. మీలో సహనం, ఓర్పు లేవని రిక్రూటర్ భావిస్తారు. అందరూ పరిపూర్ణులు కారు నిజానికి బలాలు, బలహీనతలు అనేవి సందర్భానుసారంగా బయటపడుతుంటాయి. ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేందుకు మీలోని నైపుణ్యాలను ఉపయోగించండి. అందరూ పరిపూర్ణులు కారనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు కూడా తెలుసు. మీలోని అసలైన లోపాన్ని వెల్లడించడానికి ఇబ్బందిగా ఉంటే.. ఉద్యోగానికి హాని కలిగించని విధంగా ఏదైనా చెప్పొచ్చు. ఉదాహరణకు.. నాకు లెక్కలంటే భయం అని చెబితే దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు.దాన్ని సులభంగా సరిచేసుకొనే అవకాశం ఉంది కాబట్టి రిక్రూటర్ ఆ సమాధానం పట్ల సంతృప్తి చెందుతారు. ఒకవేళ మీలోని అసలైన లోపాలను చెబితే.. అదే సమయంలో వాటిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించాలి. దాన్ని రిక్రూటర్ ఆమోదిస్తారు. మాటల్లో నిజాయతీ ధ్వనించాలి ఉద్యోగానికి మీరు సరిపోతే.. ఆ విషయాన్ని మరోసారి స్పష్టంగా తెలుసుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తుంది. అందుకే ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, బలాలను, బలహీనతలను తెలుసుకొనేందుకు ప్రశ్నలు వేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి. లోపాలను అధిగమిస్తూ బలాలను మెరుగుపర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేయాలి. కొందరు తమ బలాలను లోపాలుగా మార్చి చెబుతుంటారు. ఎలాగంటే.. నేను పని రాక్షసుడిని(వర్క్‌హాలిక్), పని పూర్తయ్యేదాకా విశ్రమించను అంటుంటారు. అది మంచి లక్షణమే, బలహీనత కాదు కదా! గతంలో కొన్ని తప్పులు చేశాను, వాటి నుంచి పాఠాల నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను అని చెబితే మీలో వ్యక్తిత్వం ఉందని రిక్రూటర్ భావించేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి మాట్లాడే మాటల్లో నిజాయతీ ధ్వనించాలి. అందుకు ముందుగానే సిద్ధం కావాలి. ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి ఎలా బదులివ్వాలి అనేది పునశ్చరణ చేసుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మౌఖిక పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగం చేజిక్కించుకోవడం సాధ్యమే. -
నైపుణ్యాలున్న ఇంజనీర్లు 20% కన్నా తక్కువే
న్యూఢిల్లీ: ఏటా దాదాపు ఆరు లక్షల మంది పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులవుతున్నప్పటికీ.. వీరిలో ఉద్యోగ నైపుణ్యాలున్న వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగానే ఉంటోంది. కేవలం 18.43 శాతం మంది ఇంజినీర్లే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉంటున్నారు. ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులైన ఇంజినీర్లలో 520 కాలేజీలకు చెందిన 1.20 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 91.82 శాతం మందికి ప్రోగ్రామింగ్.. అల్గోరిథమ్ నైపుణ్యాలు లేవు. 71.23 శాతం మందికి సాఫ్ట్ స్కిల్స్, 60 శాతం మందికి డొమైన్ నైపుణ్యాలు, 73.63 శాతం మందికి ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యాలు, 57.96 శాతం మందికి విశ్లేషణ సామర్థ్యాలు కొరవడ్డాయి. ఓవైపు విద్యాప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండటం మరోవైపు నైపుణ్యాలకు పరిశ్రమలో డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతుండటం వల్ల ఓ మోస్తరు స్కిల్స్ ఉన్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభించడం కష్టమైపోతోందని సర్వే పేర్కొంది. పేరున్న కాలేజీలకే కార్పొరేట్ల మొగ్గు.. కంపెనీలు మరీ ఎక్కువ శిక్షణ అవసరం లేకుండా ప్రాథమిక నైపుణ్యాలు ఉన్న వారినే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాయని, ఫలితంగా నైపుణ్యాలు లేని వారు ఉద్యోగాల రేసులో వెనుకబడి పోతుంటారని ఆస్పైరింగ్ మైండ్స్ సీఈవో హిమాంశు అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు.. అనుసరిస్తున్న నియామకాల విధానంలోనూ కొన్ని లోపాలను సర్వే ఎత్తి చూపింది. కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా పేరొందిన కాలేజీలకే వెళ్లి రిక్రూట్ చేసుకుంటూ ఉండటం వల్ల.. అంతగా పేరులేని కాలేజీల్లో చదివిన వారిలో దాదాపు 70 శాతం మందికి నైపుణ్యాలున్నా ఉద్యోగావకాశాలు దక్కించుకోలేని పరిస్థితి ఉందని సర్వే అధ్యయనంలో వెల్లడైనట్లు వివరించింది. -
‘మౌఖికం’లో మెరవండిలా...
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైన అంతిమ దశ మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) ను ఎదుర్కోవడం... ఇందులో విజయం సాధిస్తే కొలువు దక్కించుకున్నట్లే. అభ్యర్థిలోని టెక్నికల్, నాన్-టెక్నికల్ సామర్థ్యాలపై ఈ పరీక్షలో సాధారణంగా 15 నుంచి 30 నిమిషాల్లో ఒక అంచనాకు వస్తారు. కాబట్టి అభ్యర్థి అతి తక్కువ సమయంలో ఇంటర్వ్యూ బోర్డును మెప్పించాల్సి ఉంటుంది. ఉద్యోగుల ఎంపికలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలుస్తారు. ఇంటర్వ్యూ అంటే.. వ్యక్తులు పరస్పరం భావాలను పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అభ్యర్థి-సంస్థ ప్రతినిధి మధ్య జరిగే పరస్పర భావ ప్రసారాల సమాహారమే ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. మౌఖిక పరీక్ష అనేది అటు సంస్థకు, ఇటు అభ్యర్థికీ ఎంతో ముఖ్యం. ఎందుకంటే సదరు అభ్యర్థి కంపెనీ భవిష్యత్ అవసరాలకు ఏ మేరకు ఉపయోగపడతాడు అనే కోణంలో సంస్థ ఆలోచిస్తుంది. అలాగే అభ్యర్థి కూడా తన ఉద్యోగార్హతలను బట్టి సదరు సంస్థలో చేరడంపై ఇంటర్వ్యూ ద్వారానే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి ఇంటర్వ్యూ సంస్థతోపాటు అభ్యర్థికి కూడా ప్రధానమే. ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకునే ముందు రెండు లక్షణాలను ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. అవి.. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. ఇంటర్వ్యూ ఉద్దేశం ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అభ్యర్థి నుంచి కావాల్సిన సమాచారం రాబట్టడంతోపాటు సంస్థ గురించి అతడికి తెలియజేయడం. అభ్యర్థిలో సంబంధిత రంగంపై ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మౌఖిక పరీక్షల్లో తెలుసుకుంటారు. అదేసమయంలో మానవ వనరుల(హెచ్ఆర్) నిపుణులు అభ్యర్థిలోని సాఫ్ట్‌స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇంటర్వ్యూల్లో పలు రకాలున్నాయి 1. ఇండివిడ్యువల్/వన్ టు వన్ ఇంటర్వ్యూ, 2. గ్రూప్ ఇంటర్వ్యూ 3. ప్యానెల్ ఇంటర్వ్యూ, 4. టెలిఫోన్ ఇంటర్వ్యూ, 5. వీడియో కాన్ఫరెన్సింగ్, 6. ఆడిషన్స్. ఇంటర్వ్యూ విధానం ఏదైనప్పటికీ అందులో విజయం సాధించాలంటే అభ్యర్థులు కొన్ని మర్యాదలను తప్పనిసరిగా పాటించాలి. మౌఖిక పరీక్షల్లో ఇలాంటి మర్యాదలను కచ్చితంగా పరీక్షిస్తారు. అభ్యర్థిలో సరైన నడవడిక, ప్రవర్తన, మాటతీరు ఉన్నాయా? లేదా? అని చూస్తారు. మెరుగైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పటికీ ఇవి లేకపోతే ఇంటర్వ్యూలో నెగ్గడం కష్టమే. ఆకట్టుకొనే పలకరింపు ఇంటర్వ్యూ కోసం వెళ్లేముందు ఫ్రంట్ ఆఫీస్/రిసెప్షన్లో నిరీక్షించాల్సి ఉంటుంది. కంపెనీల సీసీ కెమెరాలు అభ్యర్థుల్ని గమ నిస్తుంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వెళ్లే ముందు ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి. బోర్డు సభ్యులను సమయానుకూలంగా పలకరించాలి. ఉదయమైతే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నమైతే గుడ్ ఆఫ్టర్నూన్ అని పలకరించాలి. బోర్డులో మహిళ ఉంటే ‘మేడమ్’ అని, పురుషులు ఉంటే ‘సర్’ అని మర్యాదగా పిలవాలి. చక్కటి చిరునవ్వుతో కూడిన పలకరింపు అభ్యర్థిలోని నడవడికను, మర్యాదను స్పష్టంగా తెలియజేస్తుంది. నేరుగా అవతలి వ్యక్తుల కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తులు ఇలా నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేరు. ఎలాంటి సణుగుడు లేకుండా గొంతులోంచి మాట స్వేచ్ఛగా రావాలి. మాట తడబడకూడదు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయాలి. డొంకతిరుగుడు మాటలు, సాగతీత వద్దు. శరీర భాష నోరే కాదు, శరీరం కూడా పరోక్షంగా మాట్లాడుతుంది. అభ్యర్థుల మానసిక స్థితిని ఇంటర్వ్యూ బోర్డుకు తెలియజేస్తుంది. మానవ వనరుల నిపుణులు అభ్యర్థుల శరీర భాష(బాడీ లాంగ్వేజ్)ను నిశితంగా పరిశీలిస్తారు. గదిలోకి ప్రవేశించి, బోర్డు సభ్యులను పలకరించిన తర్వాత అక్కడున్న కుర్చీని విసురుగా లాక్కొని కూర్చోవద్దు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు మిమ్మల్ని కూర్చోమనే వరకు కూర్చోవద్దు. వారు అనుమతి ఇచ్చిన తర్వాత చిరునవ్వుతో కృతజ్ఞతలు(థ్యాంక్స్ మేడమ్/సర్) చెప్పాలి. చాలా సహజంగా కుర్చీలో కూర్చోవాలి. ఒకవేళ బోర్డు సభ్యులు కరచాలనం కోసం చేయి చాస్తే మీరు కూడా మర్యాదగా వారితో కరచాలనం చేయాలి. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు చేతులూపడం, కాళ్లు ఆడించడం, పెన్సిల్/పెన్ను వేళ్ల మధ్య తిప్పడం, ఇష్టానుసారంగా తల ఊపడం, కనుబొమ్మలు ఎగరేయడం, ముక్కులో, నోటిలో వేళ్లు పెట్టుకోవడం, సైగలు చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలాంటి చేష్టల వల్ల అభ్యర్థిలో మానసిక సమతౌల్యం లేదనే విషయం తెలిసిపోతుంది. అతి విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖంలో ప్రతిఫలించే భావాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థి మనసులోని కోపం, అసహనం వంటివి ముఖంలో కనిపించకూడదు. డ్రెస్ కోడ్ రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే సామెతను గుర్తుంచుకోవాలి. వేసుకున్న బట్టలు అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. సందర్భాన్ని బట్టి డ్రెస్‌కోడ్ ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు చక్కటి ఫార్మల్ దుస్తులు ధరించి ప్రొఫెషనల్‌గా కనిపించాలి. తెల్లని/క్రీమ్ కలర్ చొక్కా, నావీ బ్లూ/ముదురు రంగు ప్యాంట్ ధరించాలి. అవి శుభ్రంగా ఉతికి, ఇిస్త్రీ చేసి ఉండాలి. అలాగే శరీరానికి సెంట్ కొట్టకపోవడమే మంచిది. ఘాటైన వాసనలు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సమయ పాలన అభ్యర్థుల సమయ పాలనను కూడా బోర్డు సభ్యులు పరీక్షిస్తారు. ఇంటర్వ్యూ సమయానికి 10 నిమిషాలముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లడానికి పట్టే సమయం, దూరాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. ఇంటర్వ్యూకు తగిన సమయానికి చేరుకొనేలా ఇంటి నుంచి బయల్దేరాలి. ఆలస్యంగా వెళితే అభ్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది. తద్వారా ఇంటర్వ్యూలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి. ఇంటర్వ్యూ గదిలో అభ్యర్థిలో ప్రొఫెషనలిజమ్ ప్రతిఫలించాలి. ఉద్యోగంపై ఉన్న ఆసక్తిని సమయానుకూలంగా బయటపెట్టాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి అభ్యర్థిలో సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఉంటే అతడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎంతో నమ్మకంగా జవాబులు చెబుతాడు. అది లేని అభ్యర్థి వితండవాదం చేయడం లేదా ఇంటర్వ్యూ బోర్డును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తుంటాడు. ఆత్మవిశ్వాసం లేని అభ్యర్థులు ఇంటర్వ్యూ బోర్డుకు సులువుగా దొరికిపోతారు. వారి వ్యక్తిత్వంలోని లోపాలు తెలిసిపోతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సమాధానం తెలియకపోతే ‘తెలియదు’ అని నిజాయతీగా ఒప్పుకోవాలి. సమాధానం.. వెంటనే చెప్పొద్దు బోర్డు సభ్యులు ఏదైనా ప్రశ్న అడిగితే.. మీకు సమాధానం తెలిసినప్పటికీ వెంటనే చెప్పకూడదు. అలా చెబితే.. చాలా సులువైన ప్రశ్న అడిగామనే భావన సభ్యుల్లో కలుగుతుంది. బాగా కష్టమైన ప్రశ్నలు అడగాలనే పట్టుదల వారిలో పెరుగుతుంది. అంతేకాకుండా అభ్య ర్థికి నింపాదిగా వినే, మాట్లాడే అలవాటు లేదనే విషయం తెలుస్తుంది. అందుకే ప్రశ్న అడగిన తర్వాత ఒకటి రెండు క్షణాలు ఆగి బోర్డు సభ్యులందరి వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. నేరుగా వారి కళ్లలోకి చూస్తుండాలి. మీరు చెప్పే సమాధానాన్ని వారు ఆసక్తిగా వింటారు. దీనివల్ల మీపై వారికి ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. అంతిమంగా ఇంటర్వ్యూలో మీ విజయావకాశాలు మెరుగవుతాయి. -
స్కిల్స్ పెంచుకుంటే కొలువు సులువే!
భారత్‌లో ప్రతిఏటా 30 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసుకొని, ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తున్నారు. వారిలో దాదాపు 25 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హతలను కలిగి ఉంటున్నారు. ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది ఐటీ, ఐటీఈఎస్ రంగాలను ఎంచుకున్నారు. మిగిలిన 75 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగ సాధనకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉంది. విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దడంలో పారిశ్రామిక రంగం పాత్ర కూడా ఎంతో కీలకం. కార్పొరేట్ కల్చర్ అవేర్నెస్, ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టుల్లో వారిని భాగస్వాములను చేయాలి. తగిన శిక్షణ ఇవ్వాలి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తాను తరగతి గదిలో నేర్చుకున్నదాన్ని పరిశ్రమలో ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టినప్పుడే సుశిక్షితుడైన మానవ వనరుగా ఎదుగుతాడు. తన భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతాడు. ఆంగ్ల భాషపై పట్టు టెక్నికల్ విద్యార్థులు ఆంగ్ల భాషపై తగినంత పట్టు సాధించలేకపోతే.. వారికి ఎంత విజ్ఞానం ఉన్నా నిరర్థకమే. కాల్‌సెంటర్లు, బీపీఓ, కేపీఓ, ఐటీఈఎస్, ఐటీ తదితర రంగాల్లో రాణించాలంటే మంచి ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిందే. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆంగ్లాన్ని మొదటి సంవత్సరం నుంచే బోధించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఆంగ్ల భాష విషయంలో ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. వారిలో ఆంగ్ల భాషా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భాష ఏదైనా చదవడం, రాయడం, మాట్లాడడం సంపూర్ణంగా వచ్చినప్పుడే దానిపై పూర్తి పట్టు సాధించినట్లు భావించాలి. ఇటీవల కొత్తగా ఏర్పడుతున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్లంలో మెలకువలు నేర్పడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజంటేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన ప్రయత్నం. అప్డేట్ నాలెడ్జ్ తప్పనిసరి ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన సిలబస్‌ను ఇంజనీరింగ్ కరిక్యులమ్‌లో తప్పనిసరిగా చేర్చాలి. లేకపోతే పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరులు లభించవు. యూనివర్సిటీల్లోని అకడమిక్ కౌన్సిల్లో ఉండే సబ్జెక్టు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు కలిసి సిలబస్‌ను నిర్ణయిస్తుంటారు. ఈ విషయంలో పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఆండ్రాయిడ్ టెక్నాలజీ, బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, డాట్నెట్ టెక్నాలజీస్, క్యాడ్ క్యామ్, ఆటోక్యాడ్, మెట్‌ల్యాబ్ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కరిక్యులమ్‌లో ఆయా అంశాలు లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా బోధించాలి. ఆయా టెక్నాలజీలను ఉపయోగించే సంస్థల నుంచి నిపుణులను పిలిపించి, వారు తమ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకొనే విధంగా ప్రత్యేక సదస్సులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులతో వివిధ రకాలైన సర్టిఫికేషన్స్ చేయించాలి. సిస్కో సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, ఎస్ఏపీ(శాప్) సర్టిఫికేషన్ వంటి వాటి ద్వారా విద్యార్థులకు అప్డేట్ నాలెడ్జ్ సొంతమవుతుంది. ఈ సర్టిఫికేషన్స్ పూర్తిచేసిన విద్యార్థులను ఆయా రంగాలకు చెందిన సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా వారికి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సీ++, కోర్జావాలో నైపుణ్యం పెంచుకుంటే జావా డెవలపర్‌గా స్థిరపడేందుకు అవకాశాలుంటాయి. టి.వి. దేవీ ప్రసాద్ హెడ్- ప్లేస్మెంట్ ఐఐఐటీ- హైదరాబాద్ -
కోడింగ్‌తోనే ఐటీ కొలువులు
కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల్లో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు, లక్షణాలు ఉండాలని కోరుకుంటాయి. తమకు ఎదురైన సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఉన్నవారి కోసం గాలిస్తుంటాయి. తాము ఆశిస్తున్న నైపుణ్యాలు ఉన్నవారికే పెద్దపీట వేస్తాయి. సంస్థలకు ఎదురయ్యే సవాళ్లు, అవసరాలేంటో తెలుసుకొని, విద్యార్థులు తదనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటే కోరుకున్న కొలువు దక్కడం ఖాయం. ఐటీ కంపెనీలు విద్యార్థుల్లో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాయో చూద్దాం.. మీ స్కిల్స్ స్థాయి తెలుసుకోండి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కోడింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నిశితంగా శోధిస్తున్నాయి. ఆయా స్కిల్స్ విషయంలో తాము ఏ స్థాయిలో ఉన్నామో విద్యార్థులు నిజాయతీగా అంచనా వేసుకోవాలి. జాబ్ ప్రొఫైల్‌ను బట్టి కంపెనీలు వివిధ స్థాయిల స్కిల్స్‌ను కోరుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం సాధించాలంటే విద్యార్థుల్లో మెరుగైన కోడింగ్ స్కిల్స్ ఉండడం ప్రస్తుతం తప్పనిసరి అంశంగా మారింది. సర్వీసెస్ కంపెనీలతో పోలిస్తే ప్రొడక్ట్ డవలప్మెంట్ కంపెనీలు ఎక్కువ వేతనాలను చెల్లిస్తాయి. కాబట్టి తమ ఉద్యోగుల్లో మంచి నైపుణ్యాలు ఉండాలని ఆశిస్తాయి. సరైన కోడింగ్ స్కిల్స్ లేనివారిని ఐటీ పరిశ్రమలో ‘లో ఎండ్ కోడింగ్ స్కిల్స్ లేదా పూర్ కోడింగ్ స్కిల్స్’ అభ్యర్థులుగా పరిగణిస్తుంటారు. అలాంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో డవలప్మెంట్, కోడింగ్ ఉద్యోగం దక్కే అవకాశాలు మృగ్యమేనని చెప్పొచ్చు. 10 శాతం మందిలోనే నైపుణ్యాలు: సాఫ్ట్వేర్ డవలప్మెంట్ సంసల్లో ప్రోగ్రామర్‌గా రాణించాలంటే మంచి కోడింగ్ స్కిల్స్ ఉండాల్సిందే. ఇలాంటి స్కిల్స్ కలిగిన అభ్యర్థుల కొరత కంపెనీలను వేధిస్తోంది. కంపెనీలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలంటే కోడింగ్‌లో నైపుణ్యం అవసరం. ప్రతిఏటా కాలేజీ క్యాంపస్‌ల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 10 శాతం మందిలో మాత్రమే ఉత్తమమైన కోడింగ్ స్కిల్స్ ఉంటున్నాయి. మిగిలినవారు కనీసం కోడ్‌ను లేదా ప్రోగ్రామ్‌ను సైతం సక్రమంగా రాయలేకపోతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించిన పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఈ విషయం తేటతెల్లమైంది. నిజానికి కోడ్‌ను, ప్రోగ్రామ్‌ను నేర్చుకోవడం కష్టమేమీ కాదు. కొంత సమయాన్ని, శ్రమను ఖర్చు చేసి పట్టుదలతో కృషి చేస్తే మంచి ప్రోగ్రామ్‌ను సృష్టించడం సులువే. నిజాయతీతో కూడిన సాధన వల్ల మంచి ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకోవచ్చు. కోడింగ్ అసైన్మెంట్లను సీరియస్‌గా తీసుకోవాలి: కాలేజీలో ఉన్నప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కోడింగ్ స్కిల్స్‌పై అంతగా దృష్టి పెట్టరు. సిలబస్‌లో భాగంగా ఉండే అసైన్మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్‌లను సక్రమంగా పూర్తిచేయాలి. విద్యార్థులు వీటిని సీరియస్‌గా తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ సాధనలో ఒక మెట్టు పైకి ఎక్కినట్లే. ఈ విషయంలో కళాశాలల యాజమాన్యాలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు కృషి చేయాలి. ప్రొడక్ట్ డవలప్మెంట్ సంస్థలు తాము నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కోడింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్‌లో తగిన నైపుణ్యాలుంటే జాబ్ మార్కెట్లో తిరుగులేదని చెప్పొచ్చు. కాలేజీల్లో నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సైతం ఇలాంటి స్కిల్స్‌ను పరీక్షిస్తున్నారు. స్కిల్స్ ఉన్నవారికే బహుళ జాతి సంస్థల్లో అందలం దక్కుతోంది. అవి లేనివారు తాము ఉన్నచోటనే ఉండిపోతున్నారు. నాణ్యమైన కోడ్‌ను రాసి, ప్రశంసనీయమైన ఉత్పత్తి ఇవ్వగలిగే ప్రోగ్రామర్ల అవసరం నానాటికీ పెరిగిపోతోంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్: సమస్యలను పరిష్కరించే తెలివితేటలు ఉన్నవారినే కంపెనీలు ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. ప్రతి 10 సంస్థల్లో 9 సంస్థలు ఈ లక్షణాలను కచ్చితంగా కోరుకుంటున్నాయి. విద్యార్థులు ఆయా లక్షణాలను అలవర్చుకోవాలి. సమస్యలకు పరిష్కారం చూపడంపై సొంత ఆలోచనలు ఉండాలి. అవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. మీ ఆలోచనను ఇతరులు సైతం అమలు చేసి, ప్రయోజనం పొందగలిగితే.. మీరు గొప్ప విజయం సాధించినట్లే. గణిత సమస్యలను, పజిళ్లను పరిష్కరించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల తార్కికంగా ఆలోచించడం అలవడుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు, అకడమిక్ ప్రాజెక్టులే కాకుండా ప్రాక్టికల్ ఇండస్ట్రీ ప్రాజెక్టులను పూర్తిచేస్తే మంచి ప్రయోజనం పొందుతారు. అభ్యర్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పరీక్షించేందుకు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఆప్టిట్యూడ్ టెస్టును నిర్వహిస్తాయి. దీని ద్వారా అభ్యర్థుల తెలివితేటలను, తార్కిక ఆలోచనా శక్తిని అంచనా వేస్తాయి. కొత్త విషయం నేర్చుకోవాలనే తపన అభ్యర్థుల్లో ఉందా? లేదా? అనేదాన్ని కూడా పరిశీలిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ డవలప్మెంట్ కంపెనీలు అన్ని నైపుణ్యాలున్న తక్కువ మందినే ఉద్యోగంలోకి తీసుకుంటాయి. కానీ, వారికి ఎక్కువ వేతనాలను చెల్లిస్తాయి. తగిన నైపుణ్యాలు ఉన్నాయని తెలిస్తే తాజా ఇంజనీరింగ్ గ్రా డ్యుయేట్లను సైతం చేర్చుకుంటా యి. అంటే అభ్యర్థుల వయస్సు, అనుభ వం కంటే వారిలో ఉన్న స్కిల్స్‌కే పెద్దపీట వేస్తుంటాయి! -
లక్ష్య సాధనకు తపనే ఊపిరి!
ఇష్టమైన కొలువును సాధించాలంటే కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. రెజ్యుమె ఘనంగా ఉంటే ఉద్యోగం ఖాయమనుకోవడం పొరపాటే. మార్కుల కంటే ముఖ్యమైన లక్షణాలు విద్యార్థుల్లో ఉండాలి. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో వీటికే పెద్దపీట వేస్తున్నాయి. మౌఖిక పరీక్షల్లో.. అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తారు. కాబట్టి అలాంటి లక్షణాలను తప్పనిసరిగా పెంపొందించుకోవాలి. అందుకు తగిన కృషి నిరంతరం చేయాలి. మనిషిలో నిజంగా తపన ఉంటే కోరుకున్నది సాధించడం కష్టమేమీ కాదు. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్: సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై పట్టు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి వాటితో కార్పొరేట్ సంస్థల్లో అప్పగించిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూలో టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు వారి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేశారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్ని ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు సమయానికి ఇచ్చిన ప్రాముఖ్యతను ప్రాధాన్యతా క్రమంలో వివరించాలి. ఇలా చెప్పినప్పుడు అభ్యర్థికి సమయపాలనపై అవగాహన ఉందని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు తెలుస్తుంది. తోటి విద్యార్థులతో కలిసి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినప్పుడు మీరు అనుసరించిన ప్రణాళికను వివరించవచ్చు. కాలపరిమితిపై విద్యార్థులు చక్కని అవగాహ నతో ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌కు సాఫ్ట్ స్కిల్స్‌తో దగ్గరి సంబంధం ఉంది. కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా అభ్యర్థుల వ్యక్తిత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, సానుకూలంగా మాట్లాడటం, ఆశావహ దృక్పథం, నమ్మకం, ఎదుటివారి కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడటం, బృందంలో మాట్లాడటం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం వంటి నైపుణ్యాలను ఇంటర్వ్యూల్లో పరిశీలిస్తారు. ఒక విద్యార్థిలో చక్కటి వ్యక్తిత్వం ఉంటేనే తదుపరి ప్రశ్నలు వేయడానికి సుముఖత చూపుతారు. వ్యక్తిత్వంలో భాగంగా అంకితభావం ప్రదర్శించడం, మృదు స్వభావం, చిరునవ్వు, అర్థం చేసుకుంటూ వినడం, చక్కని శరీర భాష, సమయస్ఫూర్తిని ప్రదర్శించడం వంటి లక్షణాల ద్వారా ఎదుటివారు ఆకర్షితులవుతారు. వ్యక్తిత్వం అనేది అభ్యర్థిలో రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు. కాబట్టి మంచి లక్షణాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలి. ఇందుకోసం తగిన కృషి అవసరం. నిత్య విద్యార్థిగా మారాలి: నేర్చుకోవాలన్న తపన మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ‘నేను నిత్య విద్యార్థిగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ అంటూ స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్యార్థి దశలో కొత్త విషయాలను నేర్చుకొనేందుకు ప్రయత్నించాలి. బలమైన తపన ఉన్నప్పుడే లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. తపనను లక్ష్యానికి ఊపిరిగా పేర్కొనవచ్చు. తాము ఎంపిక చేసుకొనే అభ్యర్థిలో కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? లేదా? అనే విషయాన్ని కార్పొరేట్ సంస్థలు చూస్తాయి. మీ లక్ష్యం ఏమిటి? నాలుగైదేళ్లలో ఏ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నారు? వంటి ప్రశ్నలను ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరిచ్చే సమాధానాల ద్వారా.. మీకున్న అంకితభావం, తపన ఇట్టే తెలిసిపోతాయి. నమ్మకాన్ని నమ్ముకోవాలి: నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమవుతుందంటారు. నమ్మకం రెండు రకాలు. తమపై తమకు నమ్మకం, ఎదుటి వ్యక్తులపై నమ్మకం. నమ్మకానికి వ్యక్తి ఆలోచనే పునాదిగా చెప్పుకోవచ్చు. తనలోని ఆలోచనలపై పట్టు కొనసాగిస్తూ, ఎదుటివారికీ అంతే పట్టుతో సమాధానం చెప్పగలగాలి. అంతేకాదు ఇతరులను నమ్మడం ద్వారా బృందంలో పనిచేసేటప్పుడు లక్ష్య సాధనకు మార్గం సుగమమవుతుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అభ్యర్థుల్లో నమ్మకాన్ని పరీక్షిస్తారు. కొన్ని సమయాల్లో చెబుతున్న సమాధానాలు తప్పే అని తెలిసినప్పటికీ మీరు ఎంత నమ్మకంగా చెబుతున్నారు అనేది పరీక్షిస్తారు. అంతేకాదు అభ్యర్థులు తమ తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసేవారు ప్రశంసిస్తారు. కలివిడితనంతో కలుగును మేలు: ప్రాజెక్ట్‌ల్లో పనిచేసేటప్పుడు కొన్నిసార్లు ఒక్కరే కాకుండా ఇతరులతో కలిసి బృందంగానూ పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాన్ని విద్యార్థులు కళాశాలలో ఉన్నప్పుడే అలవర్చుకోవాలి. ప్రాజెక్ట్‌ల్లో భాగంగా రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. బృందంలోని ఇతర సభ్యులతో స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా వ్యవహరిస్తే త్వరగా నిలదొక్కుకుంటారు. ఒక బృందంలో పని చేసినప్పుడు ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం, ప్రతిస్పందించడం వంటి లక్షణాలతో వారిని ఇట్టే ఆకట్టుకోవచ్చు. ఎదుటివారు చెప్పిన విషయాలకు సానుకూలంగా ప్రతిస్పందించడం వల్ల మీపై వారికి గౌరవం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని సంస్థ యాజ మాన్యానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. బృందంలో పని చేసేటప్పుడు కాలానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకు, మీ సంస్థకు చెడ్డపేరు రావొచ్చు. కాబట్టి బృందంలో పని చేసిన అనుభవాన్ని ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. ఇందుకోసం విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. వీటిలో మీ పాత్ర ప్రశంసనీయంగా ఉండాలి. మీరు తోటి విద్యార్థులతో కలిసి ఎంత విలక్షణంగా, సృజనాత్మకంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు అనేది ఉదాహరణలతో సహా వివరించాలి. బృందంలో పనిచేసినప్పుడు మీరు ఆచరించిన ప్రణాళిక, ఎదుర్కొన్న ఇబ్బందులు, సమయానికి ఇచ్చిన ప్రాధాన్యత వంటి వాటిని ప్రస్తావించాలి. సమూహాల్లో పనిచేసే తత్వానికి ప్రాంగణ నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇతర సభ్యులతో కలిసి పని చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయి. నాయకత్వ లక్షణాలకు మూలం సవాళ్లను ఎదు ర్కొనే ధైర్యం ఉండడం. ఒక విద్యార్థి ఏ సమయంలోనైనా సవాళ్లను ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటేనే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలు గుతాడు.