కోడింగ్‌తోనే ఐటీ కొలువులు | Kodingtone IT JOBS | Sakshi
Sakshi News home page

కోడింగ్‌తోనే ఐటీ కొలువులు

Published Sun, Feb 16 2014 11:50 PM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM

కోడింగ్‌తోనే ఐటీ కొలువులు - Sakshi

కోడింగ్‌తోనే ఐటీ కొలువులు

కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల్లో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు, లక్షణాలు ఉండాలని కోరుకుంటాయి. తమకు ఎదురైన సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఉన్నవారి కోసం గాలిస్తుంటాయి. తాము ఆశిస్తున్న నైపుణ్యాలు ఉన్నవారికే పెద్దపీట వేస్తాయి. సంస్థలకు ఎదురయ్యే సవాళ్లు, అవసరాలేంటో తెలుసుకొని, విద్యార్థులు తదనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటే కోరుకున్న కొలువు దక్కడం ఖాయం. ఐటీ కంపెనీలు విద్యార్థుల్లో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాయో చూద్దాం..
 
 మీ స్కిల్స్ స్థాయి తెలుసుకోండి:

 ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కోడింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిశితంగా శోధిస్తున్నాయి. ఆయా స్కిల్స్ విషయంలో తాము ఏ స్థాయిలో ఉన్నామో విద్యార్థులు నిజాయతీగా అంచనా వేసుకోవాలి. జాబ్ ప్రొఫైల్‌ను బట్టి కంపెనీలు వివిధ స్థాయిల స్కిల్స్‌ను కోరుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం సాధించాలంటే విద్యార్థుల్లో మెరుగైన కోడింగ్ స్కిల్స్ ఉండడం ప్రస్తుతం తప్పనిసరి అంశంగా మారింది. సర్వీసెస్ కంపెనీలతో పోలిస్తే ప్రొడక్ట్ డవలప్‌మెంట్ కంపెనీలు ఎక్కువ వేతనాలను చెల్లిస్తాయి. కాబట్టి తమ ఉద్యోగుల్లో మంచి నైపుణ్యాలు ఉండాలని ఆశిస్తాయి. సరైన కోడింగ్ స్కిల్స్ లేనివారిని ఐటీ పరిశ్రమలో ‘లో ఎండ్ కోడింగ్ స్కిల్స్ లేదా పూర్ కోడింగ్ స్కిల్స్’ అభ్యర్థులుగా పరిగణిస్తుంటారు. అలాంటి వారికి సాఫ్ట్‌వేర్ రంగంలో డవలప్‌మెంట్, కోడింగ్ ఉద్యోగం దక్కే అవకాశాలు మృగ్యమేనని చెప్పొచ్చు.
 
10 శాతం మందిలోనే నైపుణ్యాలు:

సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్ సంసల్లో ప్రోగ్రామర్‌గా రాణించాలంటే మంచి కోడింగ్ స్కిల్స్ ఉండాల్సిందే. ఇలాంటి స్కిల్స్ కలిగిన అభ్యర్థుల కొరత కంపెనీలను వేధిస్తోంది. కంపెనీలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలంటే కోడింగ్‌లో నైపుణ్యం అవసరం. ప్రతిఏటా కాలేజీ క్యాంపస్‌ల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 10 శాతం మందిలో మాత్రమే ఉత్తమమైన కోడింగ్ స్కిల్స్ ఉంటున్నాయి. మిగిలినవారు కనీసం కోడ్‌ను లేదా ప్రోగ్రామ్‌ను సైతం సక్రమంగా రాయలేకపోతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిర్వహించిన పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఈ విషయం తేటతెల్లమైంది. నిజానికి కోడ్‌ను, ప్రోగ్రామ్‌ను నేర్చుకోవడం కష్టమేమీ కాదు. కొంత సమయాన్ని, శ్రమను ఖర్చు చేసి పట్టుదలతో కృషి చేస్తే మంచి ప్రోగ్రామ్‌ను సృష్టించడం సులువే. నిజాయతీతో కూడిన సాధన వల్ల మంచి ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకోవచ్చు.
 
 కోడింగ్ అసైన్‌మెంట్లను సీరియస్‌గా తీసుకోవాలి:

 కాలేజీలో ఉన్నప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కోడింగ్ స్కిల్స్‌పై అంతగా దృష్టి పెట్టరు. సిలబస్‌లో భాగంగా ఉండే అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్‌లను సక్రమంగా పూర్తిచేయాలి. విద్యార్థులు వీటిని సీరియస్‌గా తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ సాధనలో ఒక మెట్టు పైకి ఎక్కినట్లే. ఈ విషయంలో కళాశాలల యాజమాన్యాలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు కృషి చేయాలి. ప్రొడక్ట్ డవలప్‌మెంట్ సంస్థలు తాము నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కోడింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్‌లో తగిన నైపుణ్యాలుంటే జాబ్ మార్కెట్‌లో తిరుగులేదని చెప్పొచ్చు. కాలేజీల్లో నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సైతం ఇలాంటి స్కిల్స్‌ను పరీక్షిస్తున్నారు. స్కిల్స్ ఉన్నవారికే బహుళ జాతి సంస్థల్లో అందలం దక్కుతోంది. అవి లేనివారు తాము ఉన్నచోటనే ఉండిపోతున్నారు. నాణ్యమైన కోడ్‌ను రాసి, ప్రశంసనీయమైన ఉత్పత్తి ఇవ్వగలిగే ప్రోగ్రామర్ల అవసరం నానాటికీ పెరిగిపోతోంది.
 
ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్:

సమస్యలను పరిష్కరించే తెలివితేటలు ఉన్నవారినే కంపెనీలు ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. ప్రతి 10 సంస్థల్లో 9 సంస్థలు ఈ లక్షణాలను కచ్చితంగా కోరుకుంటున్నాయి. విద్యార్థులు ఆయా లక్షణాలను అలవర్చుకోవాలి. సమస్యలకు పరిష్కారం చూపడంపై సొంత ఆలోచనలు ఉండాలి. అవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. మీ ఆలోచనను ఇతరులు సైతం అమలు చేసి, ప్రయోజనం పొందగలిగితే.. మీరు గొప్ప విజయం సాధించినట్లే. గణిత సమస్యలను, పజిళ్లను పరిష్కరించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల తార్కికంగా ఆలోచించడం అలవడుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు, అకడమిక్ ప్రాజెక్టులే కాకుండా ప్రాక్టికల్ ఇండస్ట్రీ ప్రాజెక్టులను పూర్తిచేస్తే మంచి ప్రయోజనం పొందుతారు. అభ్యర్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పరీక్షించేందుకు  కొన్ని  సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆప్టిట్యూడ్ టెస్టును నిర్వహిస్తాయి. దీని ద్వారా అభ్యర్థుల తెలివితేటలను, తార్కిక ఆలోచనా శక్తిని అంచనా వేస్తాయి. కొత్త విషయం నేర్చుకోవాలనే తపన అభ్యర్థుల్లో ఉందా? లేదా? అనేదాన్ని కూడా పరిశీలిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ డవలప్‌మెంట్ కంపెనీలు అన్ని నైపుణ్యాలున్న తక్కువ మందినే ఉద్యోగంలోకి తీసుకుంటాయి. కానీ, వారికి ఎక్కువ వేతనాలను చెల్లిస్తాయి. తగిన నైపుణ్యాలు ఉన్నాయని తెలిస్తే
 
తాజా ఇంజనీరింగ్ గ్రా డ్యుయేట్లను సైతం చేర్చుకుంటా యి. అంటే అభ్యర్థుల వయస్సు, అనుభ వం కంటే వారిలో ఉన్న స్కిల్స్‌కే పెద్దపీట వేస్తుంటాయి!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement