సాక్షి, అమరావతి : ఎన్నికల కౌంటింగ్‌కు శిక్షణ తప్పనిసరని ఆర్వోలు, ఏఆర్వోలు నియోజకవర్గస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. నిన్నటితో పోలింగ్ ప్రక్రియ ముగియటంతో పదమూడు జిల్లాల్లోని ప్రధాన కౌంటింగ్ సిబ్బందికి సచివాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని సీఈఓ గోపాలక్రిష్ణ ద్వివేదీ ప్రారంభించారు .కౌంటింగ్ ప్రక్రియ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
కౌంటింగ్ సిబ్బందికి 24గంటల ముందు మాత్రమే నియోజకవర్గాలను కేటాయించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి రౌండ్‌లో ఏజెంట్‌లకు చూపించి సంతకాలు తీసుకోవాలన్నారు. పరిశీలకులు తప్ప కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్‌లు అనుమతించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై వస్తున్న ఫిర్యాదులు 99శాతం నిజం కాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment