జయ, మమత, రాజేలకు కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించడం కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణా కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని చెప్పారు.
దళిత, గిరిజ వధువులకు రూ.51 వేలు ఆర్థిక సాయం చేసే కల్యాణలక్ష్మీ పథకం దసరా నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు మహిళా ముఖ్యమంత్రులు, కేంద్ర మహిళా మంత్రులను ఆహ్వానించామని చెప్పారు. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్టు తెలిపారు.