సాక్షి, అమరావతి : శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తక్షణమే ఆ పదవికి రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు. విచక్షణాధికారం పేరుతో అసహ్యంగా వ్యవహరిచారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్ మళ్లీ సభను నిర్వహించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలనన నిర్ణయంపూ ఓటింగ్ జరగకపోతే అది చెల్లదని, టీడీపీ నాయకులు సంకలు గుద్దు కోవడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు తెలియమని, చట్ట సభలను దారుణంగా అవమానించారని దుయ్యబట్టారు.(‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’)
మండలి నిబంధనలను చైర్మన్ ఉల్లఘించారు
శాసన మండలి చైర్మన్ క్షమించరాని నేరం చేశారని చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సభను రాజ్యాంగానికి అనుగుణంగా నడపడం చేతకనప్పుడు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేకశారు. విచక్షణాధికారాన్ని సభలో డోలాయమనం ఉన్నప్పుడు వాడాలని, అంతే కాని ఇలా నిబంధనలను అతిక్రమించడానికి విచక్షణను వాడకూడదని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, మండలి నిబంధనలను మండలి చైర్మన్ ఉల్లఘించారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఆస్కారమే లేదని, టీడీపీ కార్యకర్తలా చైర్మన్ చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీని ప్రకటించాలని, సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా అని శ్నించారు. ఒక్క నిమిషం కూడా చైర్మన్‌కి ఆ స్థానంలో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు.
చదవండి : సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ
మండలికి కళంకం తీసుకు వచ్చారు
శాసన మండలి వ్యవస్థను చైర్మన్ నీరు గార్చారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని, శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు. మోషన్ మూవ్ చేయకుండానే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపండం సరికాదని సూచించారు. ఇష్టం లేకుండానే సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ చెప్పడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే అని పేర్కొన్నారు. గ్యాలరీలో ఉన్న చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు చైర్మన్‌ని తప్పుదోవ పట్టించి.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ చర్యను తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment