
సాక్షి, అమరావతి: ఫార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటీషన్లపై రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటే ఈ నెల 6 నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని స్పీకర్‌కు వివరించినట్టు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
వారు ఆదివారం గుంటూరులో స్పీకర్ కోడెలను కలిసిన అనంతరం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘స్పీకర్‌కు రెండు వినతిపత్రాలు అందజేశాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లను వెంటనే పరిష్కరించాలని కోరాం. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గెలిచిన దెందులూరు అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు నోటిఫై చేయాలని విన్నవించాం’’అని చెప్పారు. ‘లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు 2013 జులై 10న వెలువరించిన తీర్పులోని పేరా 17లో ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీకి కోర్టు శిక్ష ఖరారు చేస్తే అతడు పదవిని కోల్పోతాడని స్పష్టంగా ఉంది. ’’అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
థర్డ్ ఫ్రంట్‌పై స్పష్టత వచ్చాకే స్పందిస్తాం..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానన్న థర్డ్ ఫ్రంట్‌పై స్పష్టత లేదని, పూర్తి స్పష్టత వచ్చాక ఈ అంశంపై తమ పార్టీ స్పందిస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు విజయసాయిరెడ్డి జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment