రేపు వైఎస్సార్ సీపీ సమావేశం | YSR Congress meeting tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్ సీపీ సమావేశం

Published Sun, May 24 2015 3:20 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YSR Congress meeting tomorrow

సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం సోమవారం గుంటూరు నగరంలో జరగనుంది. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమరదీక్ష, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరవుతారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర సీనియర్లు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

 నేడు దీక్షా స్థలి పరిశీలన..
 మంగళగిరి : ఏడాదికాలంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ జగన్‌మోరెడ్డి జిల్లాలో జూన్ 03, 04 తేదీల్లో సమరదీక్ష చేపట్టనున్నారు. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి సమీపంలో ఎంపిక చేసిన సమరదీక్షా స్థలాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పరిశీలనున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement