లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
సీఎం జగన్ ప్రసంగం:
►ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్
►అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నాం
►చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు
►అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నా
►అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమం
►అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం
►ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యం
►పేదరికానికి కులం, మతం ఉండదు
►మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం
►దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు
►రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ
►ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం
►46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం
►మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం
►మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం
►ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు
►ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు
►ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం
►అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు దిశ యాప్
►ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు ఉంటారు
►ఇలాంటి యాప్ దేశంలో ఎక్కడైనా ఉందా?
►మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశాం
►మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి
►గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా?
►గతంలో డీపీటీ పథకం ఉండేది
►గతంలో దోచుకో, పంచుకో, తినుకో
►మా ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు జమ చేసింది
►చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలున్నాయా?
►ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయ్యిందా?
►ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారు?
►ఎవరు దోచుకున్నారు,ఎవరు తిన్నారు ఆలోచన చేయండి
►టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్ అంటా?
►సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదు బాబు..
►సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి
►ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి.. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు
►సీఎం జగన్ పాలనలో మహిళలంతా పండగ చేసుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి కోసమే ఆలోచిస్తారన్నారు.
►ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాల్లోని పేదలకు సీఎం అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. 40 ఏళ్ల కల పొదిలి పెద్దచెరువుకు రూ.50 కోట్లు సీఎం కేటాయించారు. 14 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా రెండో ఫేజ్ అభివృద్ధి పనులకు సీఎం నిధులు సమకూర్చారని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ మొదలుపెట్టిన వెలికొండ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ పూర్తిచేస్తారని నాగార్జునరెడ్డి పేర్కొన్నారు.
►వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
►ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు.
మార్కాపురం చేరుకున్న సీఎం జగన్
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురం చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం 4,39,068 మంది అగ్రవర్ణ పేదలకు రూ.658.60 కోట్లు అందించనున్నారు.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఉ.9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు.
►10.15 గంటల నుంచి మ.12.05 వరకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం లబి్ధదారులకు నగదు జమచేస్తారు. కార్యక్రమం అనంతరం మ.12.40కు అక్కడి నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు.
►రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు.
►ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం.
మూడేళ్లలో మొత్తం రూ.45వేలు..
►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయంచేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.
►ఇక నేడు అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ.30,000. అలాగే, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ కలిపి)
Comments
Please login to add a commentAdd a comment