సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు(బుధవారం)ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు సీఎం జగన్. 10.15- 12.05 గంటలకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.
►ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్ ఈబీసీ నేస్తం
►నేడు అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ. 30,000.
►వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ)
అక్కచెల్లెమ్మలకు ఉద్యోగ, రాజకీయ సాధికారత
►వలంటీర్ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలే, 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే
►రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే కేటాయింపు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌లుగా 51 శాతం మహిళలకే, డైరెక్టర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్‌పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు అక్కచెల్లెమ్మలకే
►శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం, కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం
►జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్‌పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకే
►అమ్మ కడుపులోని బిడ్డ నుండి అవ్వల వరకు, అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
►గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ
►మన బడి నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మార్చిన ప్రభుత్వ బడులు
►స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ
►మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు
►వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా ద్వారా ఆర్ధిక సాయం
►అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు
►జగనన్న అమ్మ ఒడి ద్వారా ఆర్ధిక సాయం
►వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా అక్కచెల్లెమ్మలకు, మహిళలకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.
చదవండి: ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
Comments
Please login to add a commentAdd a comment