Updates..
ముగిసిన సీఎం జగన్ నంద్యాల పర్యటన
- బటన్ నొక్కి వైఎస్సార్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్
- మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేసిన సీఎం జగన్
పవన్, బాబులపై పంచులు.. సీఎం జగన్ ఫుల్ స్పీచ్ కోసం క్లిక్ చేయండి
ముగిసిన సీఎం జగన్ ప్రసంగం
- ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్‌రెడ్డి కోర్టుకు పోయారు
- ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్‌కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా
- ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది
- 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా
- మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు
ఓటు బటన్ నొక్కేప్పుడు పొరపాటు జరిగితే..
- పేదల భవిష్యత్తు మారాలన్నా..
- అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా..
- అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా..
- రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా..
- వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్‌నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా..
- కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు
- పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది
- గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి
- పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా..
రామిరెడ్డి గెలిస్తే.. జగనన్న ప్రభుత్వం వస్తుంది
- ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి
- ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు
- వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి
- రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి
- కాబట్టి జగన్‌ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది
చిన్నవిన్నపం చేసిన సీఎం జగన్
- ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది
- బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం
- డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు
- వారం అటు ఇటుగా జరుగుతుంది
- ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి
- ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు
- ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి
- ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా
- మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం
- దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా
మాయల మాంత్రికులపై ‘ఓటు’ అనే దివ్యాస్త్రం ప్రయోగించండి
- 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు
- మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి
- మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు
- రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు
- ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు
- రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు
- వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి
చంద్రబాబు 2014లో ఎగనామం పెట్టాడు
- 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు
- ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు
- వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు
- చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా?
చంద్రబాబు, దత్తపుత్రుడ్ని పేర్లు చెబితే..
- చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది
- పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది
- చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు
- ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు
- దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు
- ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు
- ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు
- ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు
- కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు
సీఎం జగన్ ప్రసంగం..
- గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి
- గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు
- మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు
- లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు
- అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం
- ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం
సీఎం జగన్ ప్రసంగం..
- పేదరికానికి కులం ఉండదు
- పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి
- పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి
- వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది
- పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది
- వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది
- 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం
- మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది
- రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం
- కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు
- మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం
సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం
- నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమం
- పాల్గొని ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్
- లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్
కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం విడుదల
వైఎస్సార్ ఈబీసీ నేస్తంపై స్పెషల్ ఈవీ ప్రదర్శన
- మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేయనున్న సీఎం జగన్
వైఎస్సార్ ఈబీసీ పథకం.. కార్యక్రమం ప్రారంభం
- బనగానపల్లె వేదిక వద్దకు సీఎం జగన్
- సభావేదిక వద్ద ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సీఎం జగన్
- వైఎస్సార్ విగ్రహానికి పూలమాల.. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం
- వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, స్థానిక నేతలు, అధికారులు
బనగానపల్లె చేరుకున్న సీఎం జగన్
- నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం నిధుల జమ కార్యక్రమం
- బటన్ నొక్కి నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- అంతకు ముందు.. బహిరంగ సభలో లబ్ధిదారుల్ని ఉద్దేశించి ప్రసంగం
లా వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ..
- అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశం
- హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోను హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు
- కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం
- శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం
- శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది
- కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తాం
- నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కొరుతున్నా
- లా వర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించాం
- ఈ యూనివర్శిటితో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఎపి లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్ , వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్, ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా
- వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నా
కర్నూల్‌లో.. లా యూనివర్సిటీ పనులు ప్రారంభం
- జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్
- భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్
- లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ
- కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం.. మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
కర్నూల్ చేరుకున్న సీఎం జగన్
- ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- కర్నూలు శివారుల్లొని జగన్నాథగట్టుకు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో పయనం
- మరికాసేపట్లో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన.. భూమి పూజ
►కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ లా యూనివర్సిటీ. అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
పర్యటన సాగేది ఇలా..
- ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమం ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు
- ప్రసంగం ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు
- కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నాం 2.30గం ప్రాంతంలో.. ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు
- ఈ రెండు జిల్లాల పర్యటనలోనే.. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ ఆయన కాసేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment