National Law University
-
విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్యూ) విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. కేవలం మెయిల్ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సరి్టఫికెట్ సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజి్రస్టార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశంలో 8 యూనివర్సిటీల్లో అమలు ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లో ఉంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ల్లో ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిíÙయల్ అకాడమీల్లో ఈ వి«ధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ ఎనిమిదోది. -
ఈ–గేమింగ్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, ఈ–గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమ మెరుగైన నిర్వహణ కోసం నియంత్రణ ఉండక తప్పదని ఎన్ఎల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ పాండే తెలిపారు. అయితే, ఇటు పరిశ్రమ వృద్ధికి దోహదపడటం, అటు నియంత్రించడం మధ్య సమతౌల్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదింపులతో పాటు నియంత్రించాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనంతోనే తగిన విధానాలను రూపొందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్‌కి సంబంధించి గేమింగ్ సంస్థలే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ గతంలో చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టాటెక్ గేమింగ్, నజారా, గేమ్స్24 గీ7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 3 బిలియన్ డాలర్ల మార్కెట్.. ప్రస్తుతం భారత గేమింగ్ మార్కెట్ దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో 80 శాతం వాటా రియల్ మనీ ప్లాట్‌ఫాంలదే ఉంటోంది. అమెరికా, బ్రెజిల్‌ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ మార్కెట్‌గా మారినట్లు గేమింగ్ కంపెనీ విన్జో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌లో 56.8 కోట్ల మంది గేమర్స్ ఉండగా, 2023లో 950 కోట్ల పైచిలుకు గేమింగ్ యాప్ డౌన్లోడ్స్ నమోదైనట్లు వివరించింది. ఇంతటి భారీ స్థాయిలో విస్తరించిన ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. మనీలాండరింగ్ స్కాములు, భారీ పన్నుల భారం మొదలైన సమస్యలతో సతమతమవుతోంది. తమ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే సక్రమంగా నడుస్తున్న వాటికి ఇలాంటి సమస్యలు తగ్గగలవని గేమింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో కంపెనీలు కలిసి స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్‌ఆర్‌బీలు) ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, బడా సంస్థలు సదరు ఎస్‌ఆర్‌బీలను ప్రభావితం చేయడానికి, అవి నిజంగానే స్వతంత్రంగా పని చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చని భావించి స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది. -
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు!
కర్నూలు (సెంట్రల్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 87 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది సహేతుక న్యాయం చేసేందుకు డీ సెంట్రలైజేషన్ (పరిపాలనా వికేంద్రీకరణ) విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని, రాష్ట్ర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తితో కలసి న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. న్యాయ విశ్వ విద్యాలయం నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ 87 ఏళ్ల క్రితం సహేతుక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అప్పటి నుంచి అమలు కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు. లా యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకం వద్ద సీఎం జగన్ 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆ రోజుల్లోనే హైకోర్టును ఇక్కడే నెలకొల్పుతారని భావించారని చెప్పారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే నెలకొల్పే సామర్థ్యాన్ని లా యూనివర్సిటీ సంతరించుకుంటుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. త్వరలోనే వర్సిటీ నిర్మాణ పనులను చేపట్టి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలుకు మరిన్ని న్యాయ సంస్థలు కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంతోపాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునళ్లను కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు పని చేస్తున్నాయని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో ఆయా కమిషన్లు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థలన్నింటికీ జగన్నాథగట్టుపైనే భవన సముదాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం నిలుస్తుందని, సీమ అభివృద్ధికి ఇది మచ్చు తునక లాంటిదని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. తుంగభద్రలో కాలుష్య విముక్తికి రూ.131.84 కోట్లు కర్నూలు నగర పాలకసంస్థలో అమృత్ 2.0 పథకం కింద రూ.131.84 కోట్లతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రాంబొట్ల దేవాలయం, మామిదాలపాడు, మునగాలపాడు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తుంగభద్ర నదికి మురుగునీరు, కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా చైర్మన్ కరణం కిశోర్‌కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయమనోహరి, జేసీఎస్ జిల్లా అధ్యక్షుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం జగన్ శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడే (కర్నూలు) హైకోర్టు పెడతామని చెప్పారు. ఈమేరకు ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాల్సింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసినందున అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోతుండటంతో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈరోజు మన అడుగులు ముందుకు పడుతున్నాయి. – సీఎం జగన్ కర్నూలు సమగ్ర నీటి సరఫరాకు రూ.115 కోట్లు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కొరతను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. రూ.115 కోట్లతో అమృత్ 2.0 పథకం ద్వారా సమగ్ర నీటి సరఫరాకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాథగట్టు వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్, సర్వీసు రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్ విభాగాల ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. శుద్ధి అయిన నీటిని అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారు. రోజుకు 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీటిని శుద్ధి చేసేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రకుల పేదలను గుర్తించిన ఏకైక సీఎం జగన్ అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని గు ర్తించి మేలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. గత ఎన్నికలకు ముందు నా భర్త మరణించగా వితంతు పింఛన్ అందలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు పింఛన్ మంజూరైంది. ఈబీసీ నేస్తం ద్వారా నాకు రూ.45 వేల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగాం. ఇప్పుడు ఇంటివద్దే వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. – పద్మావతి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, బనగానపల్లె -
సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన ఫొటోలు
-
Watch Live: కర్నూలు నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన
-
ముగిసిన సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు పర్యటన
Updates.. ముగిసిన సీఎం జగన్ నంద్యాల పర్యటన బటన్ నొక్కి వైఎస్సార్ ఈబీసీ నిధుల్ని జమ చేసిన సీఎం జగన్ మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేసిన సీఎం జగన్ పవన్, బాబులపై పంచులు.. సీఎం జగన్ ఫుల్ స్పీచ్ కోసం క్లిక్ చేయండి ముగిసిన సీఎం జగన్ ప్రసంగం ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్‌రెడ్డి కోర్టుకు పోయారు ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్‌కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు ఓటు బటన్ నొక్కేప్పుడు పొరపాటు జరిగితే.. పేదల భవిష్యత్తు మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా.. అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా.. వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్‌నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా.. కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా.. రామిరెడ్డి గెలిస్తే.. జగనన్న ప్రభుత్వం వస్తుంది ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్‌ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది చిన్నవిన్నపం చేసిన సీఎం జగన్ ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు వారం అటు ఇటుగా జరుగుతుంది ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా మాయల మాంత్రికులపై ‘ఓటు’ అనే దివ్యాస్త్రం ప్రయోగించండి 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి చంద్రబాబు 2014లో ఎగనామం పెట్టాడు 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? చంద్రబాబు, దత్తపుత్రుడ్ని పేర్లు చెబితే.. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు సీఎం జగన్ ప్రసంగం.. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం సీఎం జగన్ ప్రసంగం.. పేదరికానికి కులం ఉండదు పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమం పాల్గొని ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్ కాసేపట్లో వైఎస్సార్ ఈబీసీ నేస్తం విడుదల వైఎస్సార్ ఈబీసీ నేస్తంపై స్పెషల్ ఈవీ ప్రదర్శన మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేయనున్న సీఎం జగన్ వైఎస్సార్ ఈబీసీ పథకం.. కార్యక్రమం ప్రారంభం బనగానపల్లె వేదిక వద్దకు సీఎం జగన్ సభావేదిక వద్ద ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల.. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, స్థానిక నేతలు, అధికారులు బనగానపల్లె చేరుకున్న సీఎం జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం నిధుల జమ కార్యక్రమం బటన్ నొక్కి నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతకు ముందు.. బహిరంగ సభలో లబ్ధిదారుల్ని ఉద్దేశించి ప్రసంగం లా వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోను హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తాం నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కొరుతున్నా లా వర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించాం ఈ యూనివర్శిటితో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఎపి లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్ , వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్, ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నా కర్నూల్లో.. లా యూనివర్సిటీ పనులు ప్రారంభం జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్ లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం.. మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ కర్నూల్ చేరుకున్న సీఎం జగన్ ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు శివారుల్లొని జగన్నాథగట్టుకు ప్రత్యేక హెలీకాఫ్టర్ లో పయనం మరికాసేపట్లో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన.. భూమి పూజ ►కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ లా యూనివర్సిటీ. అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పర్యటన సాగేది ఇలా.. ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమం ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రసంగం ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నాం 2.30గం ప్రాంతంలో.. ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు ఈ రెండు జిల్లాల పర్యటనలోనే.. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ ఆయన కాసేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. -
న్యాయ రాజధానికి 'మరో మణిహారం'
న్యాయ రాజధాని కర్నూలు కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా కర్నూలును న్యాయ రాజధాని అని పునరుద్ఘాటించిన క్రమంలో మరో ముందడుగు పడుతోంది. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు దిశగా గురువారం శ్రీకారం చుడుతున్నారు. వర్సిటీ భవన నిర్మాణాలకు సీఎం జగన్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – కర్నూలు (సెంట్రల్) దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఒకటి. న్యాయ రాజధాని కాబోతున్న కర్నూలులో రెండోది, దేశంలో 29వ న్యాయ విశ్వ విద్యాలయం నిర్మాణానికి అంతా సిద్ధమైంది. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఈ విశ్వ విద్యాలయానికి 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అందులో భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 2025–26 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అందుబాటులో న్యాయ విద్య ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కలిపి 45 లా కాలేజీలు ఉన్నాయి. నాణ్యమైన న్యాయ విద్యను అందించేందుకు కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. అంతేకాక న్యాయ విద్యలో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లకు అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో దేశం గర్వించదగ్గ న్యాయవాదులను అందించడంలో ఈ విశ్వవిద్యాలయం గొప్ప పాత్ర పోషిస్తున్నదనడంలో సందేహం లేదని ప్రఖ్యాత న్యాయ కోవిదులు చెబుతున్నారు. కాగా, న్యాయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి న్యాయ విద్యార్థులు కర్నూలుకు రానున్నారు. సీమవాసుల ఆశలకు అనుగుణంగా.. సీమ వాసుల కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో 3 రాజధానుల చట్టాలు అమల్లోకి రాలేకపోయాయి. అయితే ప్రతిష్టాత్మక మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త వంటి న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలుకు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు తరలింపునకు పచ్చజెండా ఊపారు. సీబీఐ కోర్టును కూడా కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ. 10 కోట్లతో ఏపీ ఈఆర్సీ భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘన విజయం సాధించాక హైకోర్టుతో పాటు అన్ని న్యాయ సంస్థలు, ట్రిబ్యునళ్లు కర్నూలుకు తరలివచ్చే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో న్యాయ రాజధాని అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. న్యాయ విశ్వ విద్యాలయం ఓ వరం కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయం. ఇది రాయలసీమ విద్యార్థుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. నాణ్యతా ప్రమాణాలతో కూడిన న్యాయ విద్య అందుబాటులోకి వస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాల జాబితాలోకి కర్నూలు చేరడం సంతోషకరం. – మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, కర్నూలు హైకోర్టు కూడా కర్నూలుకు వస్తుంది సీఎం జగన్ కర్నూలు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన రెండోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా కర్నూలుకు హైకోర్టు వచ్చి తీరుతుంది. ఇప్పటికే కర్నూలులో ప్రతిష్టాత్మక లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు పలు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం. – జయపాల్‌రెడ్డి, రిటైర్డ్ జెడ్పీసీఈఓ, కర్నూలు కర్నూలుకు జాతీయ స్థాయిలో పేరు జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం కర్నూలు సిగలో న్యాయ మణిహారం. ప్రతిష్టాత్మక ఈ విశ్వవిద్యాలయం వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు న్యాయ విద్య కోసం కర్నూలుకు వస్తారు. జాతీయ స్థాయిలో కర్నూలుకు మంచి పేరు వస్తుంది. – మద్దెల శ్రీనివాసరెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కర్నూలు -
గ్రామాలకూ న్యాయవిద్య: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులను సైతం న్యాయవిద్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాంకేతికత మనకు సుదూరప్రాంత విద్యార్థులకు సైతం చేరువయ్యే సామర్థ్యాన్ని అందించింది. న్యాయ విద్య ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఆంగ్లం మాట్లాడే పట్టణ ప్రాంత పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇది అనుకూలంగా ఉంది’అని అన్నారు. ‘ఇటీవల అయిదు లా యూనివర్సిటీల్లో ఓ సర్వే చేపట్టాం. విభిన్న భాషా నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడ లేకపోవడమే కారణంతో ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నట్లు సర్వేలో తేలింది’అని సీజేఐ వెల్లడించారు. భాషా పరమైన అవరోధాలను అధిగమించేందుకు భాషిణి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఇందులో సుప్రీంకోర్టు 1950–2024 మధ్య వెలువరించిన 36 వేల పైచిలుకు తీర్పులను తర్జుమా చేసి ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి కోర్టుల్లో ఇంగ్లిష్ మాట్లాడలేని న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. న్యాయవిద్యను హిందీలో బోధిస్తే ఉత్తమ విద్యార్థులు తయారవుతారని వర్సిటీ యంత్రాంగానికి ఆయన సూచించారు. -
మన రాజ్యాంగం ‘పక్కా లోకల్’
ముంబై: ‘‘భారత రాజ్యాంగం అతి గొప్ప స్వదేశీ రూపకల్పన. ఆత్మగౌరవం, స్వతంత్రం, స్వపరిపాలనకు అత్యుత్తమ కరదీపిక’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కొనియాడారు. ‘‘కానీ కొందరు దాని విజయాలను అతిగా కొనియాడుతుంటే మరికొందరు పూర్తిగా పెదవి విరుస్తుంటారు. ఇది నిజంగా బాధాకరం. మన రాజ్యాంగం ఎన్నో గొప్ప ఘనతలు సాధించిందన్నది నిస్సందేహం. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా భారత సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని సమాజం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నప్పుడే ఈ అసమానతలు పోతాయన్నారు. శనివారం నాగపూర్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ తొలి కాన్వకేషన్‌లో సీజేఐ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలకు కట్టుబడితే రాణిస్తారంటూ యువ న్యాయ పట్టభద్రులకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ‘‘నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, పరిహారాలకు అంబేడ్కర్‌కు రుణపడి ఉండాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సామాజిక సంస్కర్తగా ఎదిగారు’’ అంటూ కొనియాడారు. -
కామన్ ఎంట్రన్స్‌తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు: సీజేఐ
పణాజి: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్ఏటీ) ద్వారా సరైన నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ పరీక్షల్లో ఉత్తీర్ణతకే తప్ప, విలువ ఆధారిత విద్యను ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. శనివారం ఆయన గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి విద్యా సంవత్సరం సెషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. -
Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం
అది 1988. బెంగళూరులో ఉన్న ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’లో అప్పుడే ప్రవేశ పెట్టిన ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సులో చేరింది ఓ అనంతపూరమ్మాయి. 1993 తొలి బ్యాచ్ బయటకు వస్తున్న వేడుకలవి. ఐదు బంగారు పతకాలతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది అదే అమ్మాయి. ఆమె సెవెన్త్, టెన్త్, ఇంటర్లో స్టేట్ ర్యాంకర్. ఎల్ఎల్బీలో ఐదు బంగారు పతకాలతో టాపర్. ఏడుకి ఆరు పాయింట్ ఎనిమిది సీజీపీఏతో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ టాపర్స్ బోర్డులో ఇప్పటికీ ఆమె రికార్డు అలాగే ఉంది. చదువుకు అంతం లేదని నిరూపిస్తూ నిరంతరం చదువుతూనే ఉన్న సుందరి పిశుపాటి న్యాయశాస్త్రం మనిషిని నిత్యవిద్యార్థిగా మారుస్తుందంటారు. మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని రంగాలూ మహిళల కోసం ఎదురు చూస్తున్నాయి. సమాజ ధోరణి కూడా మారుతోంది. ఒకప్పుడు మహిళ గృహిణి పరిధి దాటి తనకంటూ ఒక గుర్తింపును కోరుకుందీ అంటే... అది టీచర్, డాక్టర్ వరకే పరిమితం. ఆ తర్వాత లాయర్ గౌన్‌కు కూడా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అనే పరిధులు లేవు. ఇంతవరకు చూడని రంగంలో మహిళను చూసినా కూడా ఒకింత ఆశ్చర్యానికి మరింత ఆనందానికి లోనవుతోంది తప్ప... సమాజం ఒకప్పటిలాగా తేలికగా చూడడం లేదు. సమాజం ఆలోచన విస్తృతమైంది. ఈ మార్పు కూడా మహిళ సాధించిన ప్రగతి అనే చెప్పాలి. ఎందుకంటే గడచిన తరాల తల్లులు తమకు అడ్డుగోడలుగా ఉన్న ఆంక్షల పరిధులను తన పిల్లల మెదళ్లలో ఇంకనివ్వకుండా జాగ్రత్తపడడమే. ఇవన్నీ మగవాళ్ల రంగాలు అనే దురభిప్రాయాన్ని చెరిపివేస్తూ సాగుతున్న మహిళ విజయ ప్రస్థానంలో సుందరి పిశుపాటి లా ఫర్మ్ స్థాపించి తక్కెడను సమం చేశారు. ఈ రంగంలో మహిళలను న్యాయవాదులుగా లేదా జడ్జిలుగా మాత్రమే చూస్తుంటాం. సుందరి స్థాపించిన టెంపస్ లా అసోసియేట్స్ ఇప్పుడు పాతికమంది లాయర్లు మరో ఐదుగురు న్యాయేతర సిబ్బందితో నడుస్తోంది. సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందడుగు వేయవలసిందిగా స్టార్టప్ ఆలోచనలు ఉన్న మహిళలకు ఆహ్వానం పలుకుతున్నారు సుందరి. అవకాశం తలుపుతట్టింది ‘‘నేను పుట్టింది అనంతపురం జిల్లా గుత్తిలో. పెరిగింది చిత్తూరు, చెన్నైలలో. మా తాత లాయర్. మా నాన్న హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్. నాకు న్యాయవాద వృత్తి కచ్చితంగా సూటవుతుందనుకున్నారాయన. అలాగే ప్రోత్సహించారు. నేను లా పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి హైకోర్టులో ఓ సీనియర్ లాయర్ దగ్గర అప్రెంటీస్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మూడేళ్ల తర్వాత నాకు యూఎస్‌లో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి మా అబ్బాయి ఏడు నెలల బిడ్డ. నిజానికి నా కెరీర్లో అసలైన మలుపు అదే. ఆ క్షణంలో ఇంట్లో వాళ్లు ‘చంటిబిడ్డను వదిలి ఎలా వెళ్తావు’ అంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ‘బాబుని చూసుకుంటాం’ అని అమ్మానాన్న సపోర్టుగా నిలిచారు. ‘అవకాశం ఒక్కసారే వస్తుంది. అప్పుడే అందిపుచ్చుకోవాలి. వదులుకోవద్దు’ అని మామగారు ధైర్యం చెప్పారు. అత్తగారు, మా వారు కూడా అదే మాటన్నారు. అలా కొలంబియా యూనివర్సిటీ నుంచి 1998లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేయడం, కఠినమైన న్యూయార్క్ బార్ ఎగ్జామ్ పూర్తి చేయడంతోపాటు అక్కడే ప్రాక్టీస్ కూడా చేశాను. సిడ్లీ – ఆస్టిన్ బ్రౌన్ అండ్ ఉడ్ లా ఫర్మ్ యూఎస్‌లోని అతి పెద్ద లా ఫర్మ్‌లలో ఒకటి. రెండు వేల ఐదు వందల మంది లాయర్లు ఉంటారు. అందులో ప్రాక్టీస్ చేయడం నాకు బాగా ఉపయోగపడింది. సొంత ఫర్మ్ ఇండియాకి 2003లో వచ్చాను. ఆ తర్వాత ఐదేళ్లకు నేను కో మేనేజింగ్ పార్టనర్‌గా, నా భర్త రవిప్రసాద్ పార్టనర్‌గా టెంపస్ లా అసోసియేట్స్ మల్టీ స్పెషాలిటీ లా ఫర్మ్ స్థాపించాం. బెంగళూరు, కాలిఫోర్నియాలో బ్రాంచ్‌లు కూడా స్వయంగా చూసుకుంటున్నాం. టెంపస్ అంటే ‘అంది వచ్చిన అవకాశం, మంచి అదృష్టం’ అని అర్థం. నా జర్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు... ఇలా మా క్లయింట్ల జాబితా చాలా విస్తృతమైనది. కార్పొరేట్, రియల్ ఎస్టేట్, లిటిగేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ లాస్... ఏరియాలో ఎక్కువగా పని చేస్తున్నాను. అందుకే నేను కొత్త తరం మహిళలకు న్యాయసేవ మీద దృష్టి కేంద్రీకరించాను. ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్న వాళ్లకు మా అవసరం ఉండదు. కానీ ఈ తరం మహిళల్లో సొంతంగా పరిశ్రమ స్థాపించి నిర్వహించాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లు ఎక్కువవుతున్నారు. ఇది మంచి పరిణామం కూడా. అయితే వాళ్లకు తమ ప్రాజెక్టు ఎలా స్థాపించాలో, ప్రభుత్వ పరమైన చట్టాలు ఎలా ఉన్నాయో, విదేశీ చట్టాల పరిధిలో ఇబ్బందులు ఎదురు కాకుండా కంపెనీ స్థాపించేటప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం ఒక మహిళగా నా బాధ్యత అనుకున్నాను. ఎక్కడ నా సేవ అవసరమవుతుందో అక్కడ మహిళలకు మార్గదర్శనం చేయడానికి ముందుంటున్నాను. ట్యాక్స్ మినహాయింపులు, సీడ్ క్యాపిటల్ అరేంజ్మెంట్, జాయింట్ వెంచర్ నిర్వహణ, ప్రైవేట్ లిమిటెడ్ స్థాపన, ఐపీవో వంటివన్నీ వివరిస్తాం. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. ఇలా నేను కోవె, ఫిక్కీ ఎఫ్ఎల్వో ద్వారా మహిళలకు న్యాయ సేవలందిస్తున్నాను. అలాగే టీ హబ్ ద్వారా కూడా నా వంతు సర్వీస్ ఇస్తున్నాను. మహిళల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు చాలా ధారాళంగా పథకాలు రూపొందిస్తున్నాయి. కానీ బ్యాంకులు నాన్ కొలాటరల్ లోన్ ఇవ్వడంలో అంతగా చొరవ చూపించడం లేదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి మేము వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం చేస్తున్నాం. మహిళలను ప్రోత్సహించడానికి మహిళలే స్థాపించి మహిళలే నిర్వహిస్తున్న స్టార్టప్‌లే లక్ష్యంగా ‘షీ క్యాపిటల్’ ఫండ్ ద్వారా ఒక వేదిక మీదకు వచ్చిన క్యాపిటలిస్టుల సహకారం తీసుకుంటున్నాం. మహిళలకు మెంటార్షిప్ చేయడంలో సంతృప్తి ఉంది. ఎందుకంటే... న్యాయవాద వృత్తి ట్వంటీఫోర్ బై సెవెన్ డ్యూటీ, ఎప్పుడూ సబ్జెక్టుకు దగ్గరగా ఉండాలి, క్లయింట్‌కు రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఇంతటి ఒత్తిడి ఉండే వృత్తిలో సాటి మహిళల కోసం చేస్తున్న ఈ సర్వీస్ సంతోషాన్నిస్తుంది’’ అన్నారు సుందరి పిశుపాటి. విజయానికి తొలిమెట్టు ప్రొఫెషన్లో నిలదొక్కుకోవడంలో మహిళ అయిన కారణంగా ప్రత్యేకంగా ఎదురైన ఇబ్బందులేమీ లేవు. కానీ లాయర్‌గానే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. గుడ్ క్వాలిటీ వర్క్, గుడ్ క్వాలిటీ క్లయింట్లను నిలుపుకోగలిగితే అదే విజయానికి తొలిమెట్టు... మలిమెట్టు కూడా. కుటుంబాన్ని, ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రతి వర్కింగ్ ఉమన్కీ తప్పదు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ లాయర్లే. ఇంత స్థాయిలో ఒత్తిడి అవసరమా అని మా పిల్లల విషయంలో అనిపించింది. కానీ వాళ్లు మమ్మల్ని చూసి మా దారిలోనే నడుస్తున్నారు. మాది లాయర్ల ఫ్యామిలీ అయిపోయింది. మా సొంత ఫర్మ్ ఉన్నప్పటికీ మా అబ్బాయిని సొంతంగా అప్రంటీస్‌గా బయట ప్రాక్టీస్ చేయమని చెప్పాం. పని ఒంటబట్టాలంటే పనిని పనిలాగానే నేర్చుకోవాలి. – సుందరి ఆర్ పిశుపాటి, టెంపస్ లా అసోసియేట్స్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి -
న్యాయవ్యవస్థలో స్థిరపడాలి
న్యూఢిల్లీ: న్యాయవిద్య అభ్యసించిన చాలామంది యువతీయువకులు న్యాయవ్యవస్థలో కాకుండా ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ లా యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవంలో జస్టిస్ గొగోయ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ‘లాయర్ల పాత్ర, పనితీరును మనం పరిశీలించాల్సిన అవసరముంది. న్యాయ రంగంలో గొప్ప అవకాశాలు, ఆకర్షణ ఉన్నప్పటికీ న్యాయవిద్యను అభ్యసించినవారిలో చాలామంది ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. చాలామంది న్యాయవాదులు మధ్యవర్తులుగా, ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేవారిగా, న్యాయాధికారులుగా, సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతకాలంలో కార్పొరేట్ న్యాయవాదుల కెరీర్ చాలా ఆకర్షణీయంగా మారింది. ఇందులోని ఆర్థిక మూలాలకు నేను పోదల్చుకోలేదు. అదే సమయంలో బార్, బెంచ్‌లోని ఆసక్తికరమైన బాధ్యతలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముంది. నేను బార్, బెంచ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశా. ఇక్కడ పని కారణంగా దొరికే సంతృప్తి చాలాఎక్కువ. ప్రస్తుతం మనం అందిస్తున్న ఐదేళ్ల ‘లా’ డిగ్రీ కోర్సును సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ఈ పద్ధతి అనుకున్నంతగా విజయవంతం కాలేదు. అదే సమయంలో పూర్తిగా విఫలం కూడా కాలేదు. బార్ వ్యవస్థను పటిష్టం చేసేందుకే ‘లా’ స్కూళ్లను ఏర్పాటుచేశాం. ప్రస్తుతం ఎన్ని ‘లా’ స్కూళ్లు తమ ఏర్పాటు వెనుకున్న లక్ష్యాన్ని అందుకుంటున్నాయి? ఈ విషయమై బార్ విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
‘మరణ’యాతన తగ్గించలేమా?
ఉరి ద్వారా మరణశిక్ష అమలు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ శిక్ష పడిన ఖైదీలు ప్రశాంతంగా మరణించాలే తప్ప బాధతో కాదని, ఒక మనిషిగా మరణంలోనూ గౌరవం పొందాల్సి ఉన్నందున ఈ విధానానికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఉరిశిక్ష ద్వారా ఖైదీలను అంతమొందించే పద్ధతిని ఎందుకు నిలుపుదల చేయకూడదంటూ శుక్రవారం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో పరిస్థితి ఏంటి.. దాని పూర్వాపరాలపై కథనం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అమెరికాలో ఐదు రకాల పద్ధతులు... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాణాంతక ఇంజెక్షన్, విద్యుత్‌షాక్, గ్యాస్ ఛాంబర్, ఫైరింగ్ స్క్వాడ్, ఉరిశిక్షల ద్వారా మరణశిక్షలను అమలు చేస్తున్నారు. టెన్నెస్సీలో ఎలక్ట్రిక్ చైర్‌ను ఉపయోగిస్తుండగా, 35 రాష్ట్రాల్లో ఈ శిక్ష పడిన వారికి ఇంజెక్షన్ విధానాన్ని పాటిస్తున్నారు. 1977లో ఒక్లొహామాలో తొలిసారిగా ఈ ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా న్యూయార్క్ విద్యుత్ షాక్ విధానాన్ని ప్రవేశపెట్టి 1890లో మొదటిసారి అమలుచేసింది. నెవాడా 1920లలోనే గ్యాస్‌ఛాంబర్ ద్వారా మరణశిక్షను అమలుచేసింది. సంఖ్యపై కొరవడిన స్పష్టత... దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటివరకు ఎంత మందికి ఉరిశిక్ష విధించారన్న సంఖ్యపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 52 మందిని ఉరితీసినట్లు చెబుతున్నా, తమ పరిశోధనలో దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఈ శిక్షలు అమలయ్యాయని తేలిందని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ సంస్థ చెబుతోంది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ తన పరిశోధనలో భాగంగా 755 మందిని ఉరితీశారంటూ పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఏసీహెచ్ఆర్ గణాంకాల ప్రకారం 1995లో అత్యధికంగా 13 మంది, 1996, 97లలో ఒక్కొక్కరు చొప్పున, 1998లో ముగ్గురు, 2004లో «ఒకరు, 2012లో ముంబై ఉగ్రదాడిలో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్, 2013లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అçఫ్జల్గురు, 2015లో ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్లను ఉరితీశారు. ప్రపంచవ్యాప్తంగా... వివిధ దేశాల్లో ఉరి, ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పు లు, తుపాకీతో తల వెనక కాల్చడం, తల నరకడం, ప్రాణాంతక ఇంజెక్షన్, రాళ్లతో కొట్టి చంపడం, గ్యాస్ ఛాంబర్, విద్యుత్‌షాక్, ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడేయడం వంటి 9 పద్ధతులను అను సరిస్తున్నారు. అఫ్గానిస్తాన్ మొదలుకుని బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మలేసియా, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, యూఎస్ఏ లాంటి దాదాపు 60 దేశాల్లో ఉరిశిక్షకు చట్టబద్ధత ఉంది. మిలిటరీ కోర్టుల్లో శిక్ష పడ్డవారికి ఫైరింగ్ స్క్వాడ్లతో కాల్పులను అఫ్గానిస్తాన్, బహ్రెయిన్, క్యూబా, కువైట్, యూఏఈ, యూ ఎస్ఏ, వియత్నాం వంటి 28 దేశాలు, తుపాకీతో కాల్చిచంపే శిక్షలను 20 దేశాలు అమలుచేస్తున్నా యి. ఇండోనేసియా, ఇరాన్, మౌరిటానియా, నైజీరి యా, పాకిస్తాన్, సౌదీ ఆరేబియా, సూడాన్, యూఏఈ, యెమన్లలో రాళ్లతో కొట్టి మరణశిక్షను పాటిస్తున్నాయి. వ్యభిచారం, స్వలింగసంపర్క సం బంధాలు, అత్యాచారాలు వంటి కేసుల్లోనే దీనిని అమలు చేస్తున్నారు. ఇరాన్, సౌదీఅరేబియా, యెమన్‌లో తల నరకడం, చైనా, గ్వాటామాలా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో మరణ శిక్షను పాటిస్తున్నారు. మరణశిక్ష రద్దుచేసిన దేశాలు.. అన్ని రకాల నేరాలకు కలుపుకుని మరణశిక్షను రద్దుచేసిన మొత్తం 104 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, భూటాన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఇటలీ, మెక్సికో, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పనామా, ఫిలిప్పిన్స్, పోలండ్, పోర్చుగల్, రొమోనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ వంటివి ఉన్నాయి. సాధారణ నేరాలకు ఈ శిక్షను బ్రెజిల్, చిలీ, కజకిస్తాన్, ఇజ్రాయెల్, పెరూ, ఎల్‌సాల్వడార్, గునియా రద్దుచేశాయి. -
క్లాట్‌కు భారీగా దరఖాస్తులు
ఎడ్యు న్యూస్ దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 45,040 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 39,686 దరఖాస్తులు అందాయి. మే 8న ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఐదేళ్ల బీఏ-ఎల్ఎల్బీ, ఏడాది వ్యవధి ఉన్న ఎల్ఎల్ఎం కోర్సుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది పంజాబ్‌లోని రాజీవ్‌గాంధీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఆర్‌జీఎన్‌యూఎల్) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఆన్లైన్ పరీక్ష కోసం 170 కేంద్రాలను ఎంపిక చేశారు. బీఏఎల్ఎల్బీ (అండర్ గ్రాడ్యుయేట్)కి 39,468 మంది, ఎల్ఎల్ఎం (పోస్ట్ గ్రాడ్యుయేట్)కు 5,572 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2008 నుంచి 2015 వరకు క్లాట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య 200 శాతం పెరిగింది. -
ఇ‘లా పట్టా’భిషేకం...
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్‌గా నిలిచిన పూసర్ల బయోలా కిరణ్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు గోల్డ్‌మెడల్, ప్రశంసాపత్రాలను అందజేస్తున్న దృశ్యమిది. చిత్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.జీవితంలో పైకి ఎదగాలంటే స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. ధర్మం ఎక్కడ ఉంటే న్యాయం అటువైపు ఉంటుందని మహాభారతంలో చెప్పిన విషయాన్ని మరచిపోరాదు. పాండవుల వైపు ధర్మం ఉన్నందు వల్లే వారికి విజయం కలిగింది. కృషి, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చుననడానికి నోబెల్ బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, మలాలాలే ఉదాహరణ. రోజు రోజుకు న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ వృత్తిలోకి వచ్చే వారు వాటిని అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. న్యాయవాదులకు సమాజం పట్ల బాధ్యత ఉంది. వారు కేవలం తమ వృత్తికే పరిమితం కారాదు.