క్లాట్‌కు భారీగా దరఖాస్తులు
ఎడ్యు న్యూస్
దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 45,040 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 39,686 దరఖాస్తులు అందాయి. మే 8న ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఐదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ, ఏడాది వ్యవధి ఉన్న ఎల్‌ఎల్‌ఎం కోర్సుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది పంజాబ్‌లోని రాజీవ్‌గాంధీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఆర్‌జీఎన్‌యూఎల్) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
ఆన్‌లైన్ పరీక్ష కోసం 170 కేంద్రాలను ఎంపిక చేశారు. బీఏఎల్‌ఎల్‌బీ (అండర్ గ్రాడ్యుయేట్)కి 39,468 మంది, ఎల్‌ఎల్‌ఎం (పోస్ట్ గ్రాడ్యుయేట్)కు 5,572 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2008 నుంచి 2015 వరకు క్లాట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య 200 శాతం పెరిగింది.