ఇ‘లా పట్టా’భిషేకం... | Supreme Court Chief Justice HL Dattu goldmedal | Sakshi
Sakshi News home page

ఇ‘లా పట్టా’భిషేకం...

Published Sat, Dec 20 2014 1:23 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

ఇ‘లా పట్టా’భిషేకం... - Sakshi

ఇ‘లా పట్టా’భిషేకం...

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్‌గా నిలిచిన పూసర్ల బయోలా కిరణ్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు గోల్డ్‌మెడల్, ప్రశంసాపత్రాలను అందజేస్తున్న దృశ్యమిది. చిత్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌వి రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.జీవితంలో పైకి ఎదగాలంటే స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను  ఆదర్శంగా తీసుకోవాలి.

ధర్మం ఎక్కడ ఉంటే న్యాయం అటువైపు ఉంటుందని మహాభారతంలో చెప్పిన విషయాన్ని మరచిపోరాదు. పాండవుల వైపు ధర్మం ఉన్నందు వల్లే వారికి విజయం కలిగింది.  కృషి, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చుననడానికి నోబెల్ బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, మలాలాలే ఉదాహరణ. రోజు  రోజుకు న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ వృత్తిలోకి వచ్చే వారు వాటిని అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. న్యాయవాదులకు సమాజం పట్ల బాధ్యత ఉంది. వారు కేవలం తమ వృత్తికే పరిమితం కారాదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement