Dattu
-
ఇ‘లా పట్టా’భిషేకం...
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్‌గా నిలిచిన పూసర్ల బయోలా కిరణ్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు గోల్డ్‌మెడల్, ప్రశంసాపత్రాలను అందజేస్తున్న దృశ్యమిది. చిత్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.జీవితంలో పైకి ఎదగాలంటే స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. ధర్మం ఎక్కడ ఉంటే న్యాయం అటువైపు ఉంటుందని మహాభారతంలో చెప్పిన విషయాన్ని మరచిపోరాదు. పాండవుల వైపు ధర్మం ఉన్నందు వల్లే వారికి విజయం కలిగింది. కృషి, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చుననడానికి నోబెల్ బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, మలాలాలే ఉదాహరణ. రోజు రోజుకు న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ వృత్తిలోకి వచ్చే వారు వాటిని అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. న్యాయవాదులకు సమాజం పట్ల బాధ్యత ఉంది. వారు కేవలం తమ వృత్తికే పరిమితం కారాదు. -
హృదయవిదారకం
పిల్లల అవస్థ చూడలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు విషమంగా నలుగురు విద్యార్థుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ‘డాక్టర్ అంకు ల్... నా కాలు కదలడం లేదు. చేయి పైకి రావడం లేదు. తల ఎటూ తిప్ప లేకపోతున్నా. ఒళ్లంతా ఒకటే నొప్పి. ప్లీజ్... నన్ను మా మమ్మీ దగ్గరికి పం పించండి...’ మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ఏసీయూ, ఏఎన్‌సీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల హృదయ విదారక వేడుకోలు ఇది. పిల్లలు పడుతున్న అవస్థను చూడలేక తల్లిదంద్రులు అక్కడే కుప్పకూలుతున్న దృశ్యాలు అందరితో కంటతడిపెట్టిస్తున్నాయి. నలుగురి పరిస్థితి ఆందోళనకరం... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థుల్లో తరుణ్(7), వైష్ణవి(11), ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి అత్యంత విషమంగా, శిరీష(8), శ్రావణి(6), శరత్(6)ల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, నితుషా(7), సందీప్(5), శివకుమార్(5), అభినందు(9)ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య, డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వార్డుకు తొమ్మిది మంది తరలింపు... ఇప్పటి వరకు ఏసీయూలో చికిత్స పొందిన సాయిరాం(4), రుచితగౌడ్(8), సాత్విక(6), నబిరా ఫాతి మా(9), హరీష్(7), మిహ పా ల్‌రెడ్డి(4), సద్భా వనాదాస్(3), దర్శన్ గౌడ్(6), కరుణాకర్(9)లను జనరల్ వార్డుకు తరలించారు. అభినందు (9), శివకుమార్(5), సందీప్(5), నితూష(7)ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఏసీయూ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బాధితుల్లో 16 మందికి భవిష్యత్‌లో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, బాల్క సుమన్, సీపీఐ నాయకులు నారాయణ, మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు. విషాదంలోనే ఆ గ్రామాలు... గజ్వేల్/తూప్రాన్: రైలు, బస్సు ప్రమాద దుర్ఘటన జరి గి మూడు రోజులు అవుతున్నా ఆ గ్రామాన్ని విషాదం వీడడం లేదు. కొందరు మృతి, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉండడంతో వెంకటాయపల్లి తల్లడిల్లుతోంది. గ్రామానికి చెందిన శివ్వం పేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత కోలుకుంటోం ది. కుమారుడు వరుణ్ ఇంకా స్పృహలోకి రాలేదు. శృతి సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి చేరుకున్నారు. అలాగే మన్నెస్వామి-లావణ్య కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవతా సత్యనారాయణ-గాయత్రి కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక జిన్నారం మండలం కానుకుంటకు చెందిన తప్పెట లక్ష్మణ్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం- నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీ ప్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైన్ వస్తుందని చెబుతూనే ఉన్నా మూడవ సీట్లో కూర్చున్నా. ట్రైన్ వచ్చేది చూశా. డ్రైవర్ అంకుల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంకుల్ ట్రైన్ వస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. పట్టాల మీదకు వచ్చి బస్సు ఆగింది. స్టార్ట్ కాలేదు. అంతలోనే ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. పక్క సీట్లో కూర్చున్న సద్బావన్, మహిపాల్‌రెడ్డిలను కిటికిలోంచి భయటకు తోసేశా. తమ్ముడు వరుణ్‌ను తోసేందుకు ప్రయత్నించినా కిటికిలో పట్టలేదు. - రుచిత ఆడుకుంటూ ఉన్నా.. బస్సులో ప్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉన్నా. పట్టాలపైకి వచ్చే సరికి బస్సు ఆగిపోయింది. ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. చేయి విరిగి నొప్పేసింది... మమ్మీ, డాడీ అంటూ ఏడుస్తూ కూర్చున్నా... - సాత్విక ఏమైందో తెలియదు నాలుగవ సీట్లో కూర్చున్నా.పెద్ద శబ్ధం వచ్చింది. చూసేలోపే దెబ్బలు తగిలాయి. ఏమైందో తెలియదు. కిందపడిపోయాను. - సాయిరాం గాల్లో ఎగిరిపడ్డా నేను, మహిపాల్ ఫ్రెండ్స్ ఇద్దరం ఒకే సీట్లో కూర్చున్నాం... పెద్ద శబ్దంతో బస్సు కిందపడిపోయింది... అక్క రుచిత తోసేయడంతో గాల్లో ఎగిరిపోయి బయటపడ్డాను. నా కాలు పోయింది మమ్మీ... అంటూ ఏడుస్తున్నా.... అక్కడ చాలా మంది అంకుల్ వాళ్లు ఉన్నారు... నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు... ఆ స్కూల్‌కు ఇంక వెళ్లను.... ఇద్దరం ఫ్రెండ్స్ ఊర్లోనే స్కూల్‌కు వెళతాం. - సద్భావన్దాస్ బ్లడ్తో బట్టలు నిండిపోయాయి.. నాలుగవ సీట్లో త్రిష, నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ట్రైన్ బస్సును ఢీకొట్టింది. గట్టిగా అరుస్తున్నాం. క్షణాల్లో అందరికి దెబ్బలు. బ్లడ్తో బట్టలు నిండిపోయాయి. - నబిరా ఫాతిమా ఆ బస్సు ఎక్కను ఆ బస్సెక్కను.. ఆ బడికి పోను.. అక్కడికి వెళ్లడం వల్లే నా కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఇంటిదగ్గరున్న బడికి పోతా. - మహిపాల్‌రెడ్డి -
చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
డిప్యూటీ సీఎం రాజయ్య హైదరాబాద్: మాసాయిపేట ఘటనలో క్షతగాత్రులైన విద్యార్థులకు అత్యాధునిక వైద్యసేవలందిస్తున్నామని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన బాధిత కుటుంబాలను, చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. చిన్నారుల చికిత్సకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా శుక్రవారం మంత్రి హారీష్‌రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, విమలక్క బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు కేర్ సిబ్బంది విరాళం సీఎంకు రూ.50లక్షల చెక్ ఇచ్చిన ఆస్పత్రి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: మాసాయిపేట బాధితుల సహాయార్థం కేర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల విరాళాన్ని (రూ. 50 లక్షలు) చెక్ రూపంలో అందజేశారు. -
మమ్మీ....నొప్పి!
‘యశోద’లో చిన్నారుల ఆక్రందనలు అత్యంత విషమంగా వరుణ్‌గౌడ్,వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ‘మమ్మీ.. కాలు కదలడం లేదు.. చేయి లేవట్లేదు.. ఒళ్లంతా నొప్పి.. తట్టుకోలేకపోతున్నా.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. డాడీకి ఫోన్ చేసి రమ్మను...’ ఐసీయూలోకి అడుగు పెట్టిన తల్లులను చూడగానే అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు చేస్తున్న ఆక్రందనలివి. క్షేమంగా తిరిగొస్తాడనుకున్న బిడ్డలు కళ్లముందే మృత్యువుతో పోరాడుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి తట్టుకోలేకపోతున్నారు. లేత శరీరాలపై భారీ కుట్లు చూసి వారి హృదయాలు తట్టుకోలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం తల్లిదండ్రులు, బంధువులు పెద్దసంఖ్య లో శుక్రవారం యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. వైష్ణవి(11), తరుణ్(7), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. శరత్(6), శ్రావణి(6), శిరీష అలియాస్ త్రిష(8), దర్శన్(6), ప్రశాంత్(6), నితుషా(7)ల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు చెప్పారు. రుతికాగౌడ్(8), ఫాతిమా(9) ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు తెలిపారు. దర్శన్, కరుణాకర్, శివకుమార్, సందీప్, వరున్‌గౌడ్, ఫాతిమాలకు శస్త్ర చికిత్స చే శారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు. -
నిను మరవలేం బిడ్డా!
నాలుగు గ్రామాల్లో వీడని విషాద ఛాయలు గజ్వేల్/తూప్రాన్: స్కూల్‌కు టైమ్ అయ్యింది.. టిఫిన్ కూడా తెచ్చిన.. తొందరగా బడికిపోవాలె లేవుండ్రి బిడ్డా! నీకు బ్రెడ్ తెచ్చిన..చాయ్ తెచ్చిన.. ఇప్పుడైనా లేవుండ్రి కన్నా.. అంటూ తమ పిల్లలు ఇక లేరని తెలిసి కూడా ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించని వారు లేరు. మాసాయిపేట దుర్ఘటనలో మరణించిన చిన్నారులు దివ్య-చరణ్‌లను తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఖననం చేసిన ప్రదేశంలో శుక్రవారం నాటి దృశ్యమిది. వారి తల్లిదండ్రులు జక్కుల సంతోష-యాదగిరి రోదనలతో ఆ ప్రాంతం కంపించింది. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. ఇతర బాధిత కుటుంబాలున్న కిష్టాపూర్, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్ గ్రామాల్లోనూ ఇంకా విషాద ఛాయలే నెలకొన్నాయి. నిన్నటివరకు ఉదయాన్నే స్కూలు బస్సు వద్ద సందడి చేసే పిల్లలంతా ఇక లేరనే నిజం గ్రామస్థుల గుండెలను పిండేస్తూనే ఉంది. కంటికిరెప్పలా చూసుకున్న కన్నబిడ్డలను తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. -
ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు..
ఒక తల్లికి ఆనందం.. ఇంకో తల్లికి గర్భశోకం ‘స్కూలు బస్సు’ మృతుల గుర్తింపులో పొరపాటు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: తమ కనుపాప దూరమైందని తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసి ఆశలు వదిలేసుకున్న ఆ దంపతులు.. తమ బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుని విషాదం నుంచి తేరుకున్నారు. అవును.. పుట్టినరోజు నాడే ‘ధనుష్’ మళ్లీ పుట్టాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన స్కూలు బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడనుకున్న చిన్నారి ధనుష్ అలియాస్ దర్శన్ గౌడ్ బతికే ఉన్నాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భావిస్తున్న మరో పిల్లాడు దత్తు.. ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయినటుతేలింది. దీంతో ఆ కుటుంబాల్లో పరిస్థితి తారుమారైంది. ఒకరింట సంతోషం.. మరో ఇంట విషాదం నెలకొంది. పిల్లలను గుర్తించడంలో పొరపాటు వల్ల ఈ ఉదంతం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన జాలిగామ స్వామిగౌడ్-పుష్ప దంపతులు తమ కొడుకు ధనుష్‌ను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి గురువారమే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే శుక్రవారం ఉదయం వారికి వైద్యుల నుంచి ఫోన్ వచ్చింది. మీ కొడుకు ధనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, వచ్చి చూడండంటూ కబురందించారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ప్రమాదంలో చనిపోయిన దత్తు మృతదేహాన్ని తమ పిల్లాడిదని పొరబడి తీసుకొచ్చినట్లు వారికి అర్థమైంది. కాగా, ఇదే మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరబాబు-నీరజ దంపతుల కూతురు భువన రైలు పట్టాల మీదే చితికిపోయింది. అదే స్కూలు బస్సులో ఉన్న తమ కొడుకు దత్తు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు భావించారు. కూతురు అంత్యక్రియలు పూర్తి చేసి.. కొడుకైనా మిగిలాడనుకున్నారు. తెల్లారేసరికే ఆ దంపతుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రమాదం జరిగిన రోజే మార్గ మధ్యలో దత్తు చనిపోయాడని అధికారులు గుర్తించడంతో వీరబాబు కుంటుంబం మళ్లీ శోకసంద్రమైంది. తల్లిదండ్రుల పేర్లు చెప్పిన ధనుష్ ప్రమాదంలో ధనుష్(అలియాస్ దర్శన్ గౌడ్) మృతి చెందినట్లు అందరూ భావించారు. అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన (దత్తు)మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారికి తిరిగి అప్పగించారు. గురువారం రాత్రే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన 20 మంది చిన్నారులు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో తీవ్రంగా గాయపడిన ధనుష్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో స్పృహ కోల్పోయి... శుక్రవారం తెల్లవారుజామున తిరిగి స్పృహలోకి వచ్చాడు. అతన్ని ప్రశ్నించిన వైద్యులకు తన తల్లిదండ్రుల పేరు, తన నానమ్మ పేరు చెప్పడంతో జరిగిన పొరపాటును గుర్తించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు సమాచారం అందించారు. బాబును గుర్తించేందుకు కుటుంబసభ్యులు హుటాహూటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి.. తన తండ్రి స్వామిగౌడ్‌ని చూసి నాన్నా.. అని పిలవడంతో తమ బిడ్డ బతికే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాపం వీరబాబు, నీరజ దంపతులు ఇప్పటికే కూతురు భువనను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన వీరబాబు-నీరజ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. బతికే ఉన్నాడనుకుంటున్న తమ కొడుకు దత్తు కూడా చనిపోయాడని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న దత్తును సహాయక బృందం హుటాహుటిన కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దత్తు చనిపోయాడు. అయితే దత్తు, ధనుష్‌ల ఎత్తు, పొడవు, రూపం ఒకే విధంగా ఉండటం, ముక్కు, దవడ భాగం పూర్తిగా చితికిపోయి ఉండటంతో పాటు ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోవడం వల్ల తల్లిదండ్రులు తమ బిడ్డలను సరిగా గుర్తించలేకపోయారు. కూతురు చనిపోయిన బాధలో మునిగిపోయిన వీరబాబు దంపతులు తమ కొడుకు బతికే ఉన్నాడనే భ్రమలో ఉండిపోయారు. అయితే కిష్టాపూర్‌లో స్వామిగౌడ్ ఖననం చేసింది వారి కుమారుడిని కాదని తేలడంతో... వీరబాబు దంపతులకు అనుమానం వచ్చింది. అయ్యో..! చనిపోయింది తమ బిడ్డ దత్తే కావచ్చునని గుండెలు బాదుకున్నారు. అప్పటికి కొడుకు కోసం ఆసుపత్రిలో ఉన్న ఆ దంపతులు అక్కడే కుప్పకూలిపోయారు. మంత్రి హరీశ్‌రావు సహా అధికారులు వారిని ఓదార్చే యత్నం చేశారు. వారిని హరీశ్‌రావు స్వయంగా తన కారులో కిష్టాపూర్‌లో దత్తు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలానికి తీసుకెళ్లారు. స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్యర్యంలో పోలీసులు సిబ్బంది, సిద్దిపేట ఆర్డివో ముత్యంరెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఇరు కుటుంబాల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీయించారు. వీరబాబు-నీరజ దంపతులు దత్తును గుర్తించారు. కన్నీరు మున్నీరుమున్నీరుగా విలపించారు. అధికారులు చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇస్లాంపూర్ గ్రామంలో దత్తు మృతదేహానికి మళ్లీ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలనూ కోల్పోయిన వీరబాబు దంపతులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. -
దత్తు మృతదేహం వెలికితీత
-
దత్తు మృతిపై వీడిన అనుమానాలు
-
మృతదేహాల అప్పగింతలో గందరగోళం
-
దత్తు మృతిపై వీడిన అనుమానాలు
హైదరాబాద్ : విద్యార్థి దత్తు మృతిపై అనుమానాలు వీడాయి. ధనుష్ తల్లితండ్రులు ఖననం చేసింది దత్తు మృతదేహానికేనని గ్రామస్తులు నిర్థారణకు వచ్చారు. ఇప్పటివరకూ బతికే ఉన్నాడనుకున్న దత్తు... మరణవార్త వినటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. నిన్న జరిగిన దుర్ఘటనలో కుమార్తై భువనను కూడా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు కూడా లేడనే వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు ధనుష్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రమాదంలో గుర్తు పెట్టలేని విధంగా ఉండటం వల్లే తమ కుమారుడి మృతదేహం అనుకుని దత్తు దేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు ధనుష్ తండ్రి తెలిపారు. -
ధనుష్ బ్రతికున్నాడు.. దత్తు ఏమయ్యాడు?
-
ధనుష్ బతికే ఉన్నాడు.... దత్తు ఏమయ్యాడు
మెదక్ : తమ ఇంటి వెలుగు ఆరిపోయిందనుకున్న ఆ తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ ఊపిరినిచ్చింది. అయితే మరో విద్యార్థి తల్లిదండ్రులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఓ విద్యార్థికి తమ బిడ్డ మరణించాడనుకొని మరో విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కిష్ణాపూర్లో దత్తు అనే విద్యార్థికి .....ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. అయితే ధనుష్ బతికే ఉన్నాడంటూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో ధనుష్ తల్లిదండ్రులు పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు దత్తు తల్లిదండ్రులు శుక్రవారం కిష్టాపూర్ వెళ్లారు. ఇక మృతదేహాన్ని పరిశీలించి ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.