దత్తు మృతిపై వీడిన అనుమానాలు | student Dattu Mystery Revealed | Sakshi
Sakshi News home page

దత్తు మృతిపై వీడిన అనుమానాలు

Published Fri, Jul 25 2014 12:20 PM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

student Dattu Mystery Revealed

హైదరాబాద్ : విద్యార్థి దత్తు మృతిపై అనుమానాలు వీడాయి. ధనుష్ తల్లితండ్రులు ఖననం చేసింది దత్తు మృతదేహానికేనని గ్రామస్తులు నిర్థారణకు వచ్చారు. ఇప్పటివరకూ బతికే ఉన్నాడనుకున్న దత్తు... మరణవార్త వినటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. నిన్న జరిగిన దుర్ఘటనలో కుమార్తై భువనను కూడా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు కూడా లేడనే వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

మరోవైపు ధనుష్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రమాదంలో గుర్తు పెట్టలేని విధంగా ఉండటం వల్లే తమ కుమారుడి మృతదేహం అనుకుని దత్తు దేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు ధనుష్ తండ్రి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement