Yasoda hospital
-
ఆగని జన విస్ఫోటం
నేడు జనాభా దినోత్సవం ఫలితమివ్వని పథకాలు మౌలిక వసతులపై పెనుభారం న్యూఢిల్లీ: మహా నగరాల్లోని మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను ఒక్కసారి పరిశీలిస్తే మనదేశంలో జనాభా ఉధృతి ఎంత భారీగా ఉందో సులువుగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శనివారం జనాభా దినోత్సవాన్ని పాటిస్తున్న నేపథ్యంలో.. జాతీయస్థాయిలో అందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలు అందజేయడానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించడం విధానకర్తల ఎదుట ఉన్న ప్రధాన విధి. భారత్‌లో 2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121.2 కోట్లు. ప్రస్తుతం జనాభా విషయంలో అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ 2025 నాటికి అధిగమిస్తుందని భావిస్తున్నారు. పదుల సంఖ్యలో జనాభా నియంత్రణ, సామాజిక సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేసినా, ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. అత్యాధునిక వైద్యవిధానాల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య చాలా వరకు తగ్గినా, జననరేటు మాత్రం తగ్గడం లేదు. పేదల్లోనే జనాభా ఎక్కువ.. పేద కుటుంబాల్లోనే జనాభా అధికమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణ ప్రాధాన్యం, గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేమే ఇందుకు కారణమని డాక్టర్లు అంటున్నారు. భారత్‌లోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల కుటుంబాల్లో సంతానసాఫల్య రేటు 2.1గా ఉన్నట్టు 2009లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని జనాభా ప్రమాణాలతో చూస్తే ఇది చాలా ఎక్కువ. చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఒక జంట-ఒక సంతానం’ విధానం మానవ హక్కులకు వ్యతిరేకమనే విమర్శలున్నా, అక్కడ జన విస్ఫోటాన్ని నియంత్రించడంలో ఈ పద్ధతి విజయవంతమైంది. భారత్‌లో జననాల సంఖ్య నిరోధానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో, మన జనాభా త్వరలోనే 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంత మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను ఎలా కల్పిస్తాయన్నది చాలా విలువైన ప్రశ్న. నిపుణులు చేస్తున్న ముఖ్య సిఫార్సులు 1.మహిళలు, బాలికల సంక్షేమం, చదువుపై శ్రద్ధ చూపడం 2.గర్భనిరోధక సాధనాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడం 3.లైంగిక విద్యకు ప్రాధాన్యం పెంచడం 4.పురుషులకు కూడా సంతాన నిరోధక ఆపరేషన్లను ప్రోత్సహించడం 5.తొలి కాన్పునకు మలికాన్పునకు మధ్య వ్యవధి పెంచడం 6.పేదలకు కండోమ్‌ల వంటి గర్భనిరోధక సాధనాలను నిస్సంకోచంగా పంచాలి 7.వైద్యరంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి. డాక్టర్లు కరువు గత రెండు సంవత్సరాల్లో కొత్తగా 7,500 ప్రైవేటు ఆస్పత్రులు, మూడు లక్షల మంది డాలర్లు అందుబాటులోకి వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన మందుల దుకాణాల వల్ల గ్రామస్థాయిల్లోనూ సాధారణ మందులతోపాటు గర్భనిరోధక సాధనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే జనాభా అసాధారణ రీతిలో పెరుగుతుండడంతో రోగులకు సరిపడినంత మంది డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉందని ఢిల్లీ యశోదా హాస్పిటల్ డాక్టర్ రజత్ అరోరా అన్నారు. అట్టడుగు స్థాయిలోనూ నాణ్యమైన వైద్యం అందించే వ్యూహాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. -
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి
నాగర్‌కర్నూల్/హసన్‌పర్తి: స్వైన్‌ఫ్లూతో సోమవారం ఇద్దరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురానికి చెందిన లెక్చరర్ ఎన్నం రాకేష్ (33) స్వైన్‌ఫ్లూ బారిన పడి ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అలాగే వరంగల్ నగర పరిధిలోని చింతగట్టు క్యాంప్ ప్రాంతానికి చెందిన బి. శాంతమ్మ(51) స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజాగా 55 పాజిటివ్ కేసులు... హైదరాబాద్ : సోమవారం హైదరాబాద్‌లో 52 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు వైద్యులు ఉన్నారు. సీఎంవోలోని ఎస్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీరాములు ఇద్దరు పిల్లలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్థారించగా ... లోటస్చిల్ట్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్‌కు చెందిన భీమరి నర్సింహులు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన మందడి నర్సింహులుగౌడ్(40), వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ప్రవీణ్‌కు స్వైన్ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. ఈ సీజన్లో 22 స్వైన్‌ఫ్లూ మరణాలు నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూతో 22 మంది మరణించారని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెలలో ఇప్పటి వరకు 1,050 మంది రక్త నమూనాలను పరీక్షించగా 360 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలగా.. ఇందులో 13 మంది చనిపోయారన్నారు. ఈ నెలలో రంగారెడ్డి జిల్లాలో 105 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా ఐదుగురు, హైదరాబాద్‌లో 224 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా ముగ్గురు చనిపోయారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 మంది స్వైన్‌ఫ్లూ సోకగా ఇద్దరు మృతి చెందారని చెప్పారు. మెదక్‌లో 11 మందికి, ఆదిలాబాద్‌లో ఇద్దరికి, వరంగల్ జిల్లాలో ముగ్గురికి సోకగా, ఒక్కొక్కరు చొప్పున చనిపోయారన్నారు. ఇప్పటివరకు జిల్లాలకు 28 వేల స్వైన్‌ఫ్లూ మాత్రలను సరఫరా చేసినా ఉపయోగించాల్సిన అవసరం రాలేదన్నారు. సీఎం ఆదేశం మేరకు సోమవారం గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ కమిటీ సమావేశం జరిగిందన్నారు. ఇందులో మంత్రి లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారన్నారు. -
బస్సు ఢీకొన్న విద్యార్థిని పరిస్థితి విషమం
మెదక్: జిల్లాలోని జహీరాబాద్ శనివారం ఓ ప్రైవేటు బస్సు ఢీకొని మహిళా విద్యార్థి తీవ్రంగా గాయపడింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన ఆమెను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా బస్సును నడపటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటికొచ్చిన.. కంటి వెలుగులు
* కోలుకున్న మాసాయిపేట బస్సుప్రమాద బాధిత చిన్నారులు * మార్పులేని ఇద్దరి పరిస్థితి సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల ఆశలను చిదిమేసిన మెదక్‌జిల్లా మాసాయిపేట బస్సుదుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సలు పూర్తిచేసుకున్న చిన్నారులు బుధవారం డిశ్చార్జి కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం ఏర్పడింది. పిల్లల తల్లిదండ్రుల కళ్లనుంచి ఆనందబాష్పాలు రాలాయి. ఈ నెల 24న ఇక్కడ చికిత్సకు వచ్చిన కాకతీయ స్కూలు విద్యార్థుల్లో 9 మంది ఏడు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారు. మాసాయిపేట్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది విద్యార్థులను చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. గత రెండు రోజుల క్రితమే 12 మంది పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. వారి తల్లిదండ్రులు మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోని వారిని ఉంచాలని కోరడంతో ఆస్పత్రి వర్గాలు సమ్మతించాయి. ఆమేరకు వారిని బుధవారం డిశ్చార్జి చేశాయి. వీరిలో సాయిరాం(4), సాత్విక(6), మహిపాల్‌రెడ్డి(4), సద్భావన్దాస్(3), కరుణాకర్(9), సందీప్(5), అభినందు(9),శివకుమార్(5), హరీష్(7)లను ఇంటికి పంపించారు. రుచితగౌడ్(8), శ్రావణి(6), త్రిష అలియాస్ శిరీష(8)ల తల్లిదండ్రులు ఇంకా రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుతామని చెప్పడంతో వారిని ప్రత్యేక వార్డుకు తరలించారు. దర్శన్‌గౌడ్(6), నబీరాఫాతిమా(9), నితూష(7) ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. శరత్(6) పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. డిశ్చార్జ్ అయి వెళుతున్న విద్యార్థుల వద్దకు ప్రతీరోజు ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, పారామెడికల్ సిబ్బంది వెళ్లి అవసరమైన చికిత్స, డ్రెస్సింగ్ లాంటివి చేస్తారని యశోద ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ లింగయ్య చెప్పారు. వారం రోజులకు సరిపడే మందులు కూడా ఇచ్చామన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా వైద్యులతో ఫోన్లో సంప్రదించవచ్చని, ఆస్పత్రికి వచ్చి ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని వైద్యులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు ఆరోగ్యంగా ఇళ్లకు వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను యశోద ఆస్పత్రి, 108 ఆంబులెన్సులలో స్వగ్రామాలకు తరలించారు. మాసాయిపేట రైల్వే మృతులకు టీడీపీ సాయం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన నారా లోకేష్ తూప్రాన్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బుధవారం తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో సాయం అందజేశారు. రైలు ప్రమాదం బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రైల్వే ప్రమాద ంలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే వర్గల్ మండలం వెలురూలోని బస్సు డ్రైవర్ బిక్షపతిగౌడ్, తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన బస్సు క్షీనర్ రమేశ్ కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కును అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారుల చదువులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. అలాగే, రైలు ప్రమాద ఘటనా స్థలంలో నారా లోకేష్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానందగౌడ్, మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి, గజ్వేల్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నాయకులు మృతుల ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించారు. -
ప్రశాంత్, వరుణ్ పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో గాయపడిన విద్యార్థులలో ప్రశాంత్, వరుణ్ గౌడ్ల పరిస్థితి విషమంగా ఉందని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై బుధవారం మధ్యాహ్నం వైద్యులు మాట్లాడుతూ... ఆ ఘటనలో గాయపడిన శరత్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దర్శన్‌గౌడ్, ఫాతిమా, నితూష పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులును డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. -
తరుణ్ తనువు చాలించాడు..
* మాసాయిపేట ఘటనలో మరో విద్యార్థి మృతి * 17కు చేరుకున్న మాసాయిపేట మృతులు * మరో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమం * యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు * 7గురు విద్యార్థుల డిశ్చార్జి సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో తరుణ్ (7) అనే మరో విద్యార్థి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థు ల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే. తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ మృ తి చెందాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు చేసిన యత్నాలు ఫలించలేదని వైద్యులు వెల్లడించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమం తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6),వరుణ్‌గౌడ్ (7),వైష్ణవి (11) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వైష్ణవి స్థితి మరింత విషమంగా ఉందని డాక్టర్లు తెలి పారు. వీరు కాకుండా మరో ఇద్దరు నితూష (7), శరత్ (6)లకు ప్రాణాపాయం తప్పినప్పటికీ అత్యవసర వైద్య సేవలను అందజేస్తున్నారు. ఈ విషయాలను సికి ంద్రాబాద్ యశోద ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య వెల్లడించారు. చికిత్స పొందుతున్న మొత్తం 20 మందిలో ఏడుగురిని సోమవారం డిశ్చార్జి చేయగా, మరో 7 గురిని రెండు,మూడు రోజుల్లో ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. డిశ్చార్జి అయిన పిల్లల కుటుంబీకులు మాత్రం తమకు పూర్తి సంతృప్తి కలిగిన తరువాతనే వెళ్తామని చెప్పడంతో తాము అంగీకరించామని డాక్టర్ లింగయ్య చెప్పారు. యశోద ఆసుపత్రి ‘హోమ్ కేర్ సర్వీసెస్’ బాధితులు ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి అవసరమైన వైద్యసేవలను అందజేస్తుందన్నారు. డిశ్చార్జి అయింది వీరే : సాయిరామ్ (4), రుచిత గౌడ్ (8), సాత్విక(6), మహిపాల్‌రెడ్డి (4), సద్భావన్దాస్ (3), కరుణాకర్ (9),సందీప్ (5)లను డాక్టర్లు వైద్యపరంగా డిశ్చార్జి చేశారు. కోలుకునే వరకూ వైద్యసేవలు: డిప్యూటీ సీఎం బస్సు దుర్ఘటనలో చికిత్సలందుకున్న విద్యారులకు డిశ్చార్జ్ అనంతరం కూడా పూర్తిగా కోలుకునేంత వరకు వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. సోమవారం ఆయన ఆస్పత్రిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించారు. డిశ్చార్జ్ అయిన వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కామారెడ్డిలోని ఆర్థోపెడిక్ సర్జన్ పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సందర్శించారు. చెక్కులు పంపిణీ చేసిన నారా లోకేష్ మాసాయిపేట్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబా బు కుమారుడు లోకేష్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల వంతున 20 మందికి ఆయన అందించారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకునేందుకు వ చ్చే వారికి ట్రస్టు తరఫున ఉచిత విద్యనందిస్తామని హా మీ ఇచ్చారు. మృతి చెందినవారి కుటుంబాలకు ఈ నెల 30న గజ్వేల్‌లో రూ.లక్ష చొప్పున ఇస్తామన్నారు. మాసాయిపేట ఘటనపై రాష్ట్రపతి సంతాపం మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు సోమవారం లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయకచర్యలను అందులో ప్రస్తావించారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కూడా పంపారు. కరిగిన కలలు.. మెదక్ జిల్లా గుండ్రెడ్డిపల్లికి చెందిన శ్రీశైలం, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడైన తరుణ్‌ను ఈ ఏడాదే కాకతీయ స్కూల్లో చేరాడు. పాప వయస్సు ఏడాది. సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకొని బతుకుతోన్న శ్రీశైలం దంపతులు కొడుకును బాగా చదివించాలని కలలు గన్నారు. అవి కల్లలయ్యాయి. కొడుకు మరణవార్త తెలిసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. దర్యాప్తు జరపాలని జనహిత వ్యాజ్యం మెదక్ జిల్లా మాసాయిపేటలో చిన్నారులను బలి గొన్న రైలు-బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీతో విచారణ చేయించాలని హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. నగరానికి చెందిన ఎం.రామ్మోహన్రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని రైల్వే క్రాసింగ్ ప్రాంతాల్లో గేట్లను ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షించేందుకు సిబ్బందిని నియమించాలని ఆ పిటిషన్లో కోరారు. -
మసాయిపేట ఘటన: నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం విద్యార్థుల ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంతి, తరుణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మరో నలుగురు విద్యార్థులను ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. ఎనిమిది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. మరో నలుగురిని సాయంత్రంలోగా సాధారణ వార్డుకు తరలిస్తామన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
హృదయవిదారకం
పిల్లల అవస్థ చూడలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు విషమంగా నలుగురు విద్యార్థుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ‘డాక్టర్ అంకు ల్... నా కాలు కదలడం లేదు. చేయి పైకి రావడం లేదు. తల ఎటూ తిప్ప లేకపోతున్నా. ఒళ్లంతా ఒకటే నొప్పి. ప్లీజ్... నన్ను మా మమ్మీ దగ్గరికి పం పించండి...’ మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ఏసీయూ, ఏఎన్‌సీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల హృదయ విదారక వేడుకోలు ఇది. పిల్లలు పడుతున్న అవస్థను చూడలేక తల్లిదంద్రులు అక్కడే కుప్పకూలుతున్న దృశ్యాలు అందరితో కంటతడిపెట్టిస్తున్నాయి. నలుగురి పరిస్థితి ఆందోళనకరం... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థుల్లో తరుణ్(7), వైష్ణవి(11), ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి అత్యంత విషమంగా, శిరీష(8), శ్రావణి(6), శరత్(6)ల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, నితుషా(7), సందీప్(5), శివకుమార్(5), అభినందు(9)ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య, డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వార్డుకు తొమ్మిది మంది తరలింపు... ఇప్పటి వరకు ఏసీయూలో చికిత్స పొందిన సాయిరాం(4), రుచితగౌడ్(8), సాత్విక(6), నబిరా ఫాతి మా(9), హరీష్(7), మిహ పా ల్‌రెడ్డి(4), సద్భా వనాదాస్(3), దర్శన్ గౌడ్(6), కరుణాకర్(9)లను జనరల్ వార్డుకు తరలించారు. అభినందు (9), శివకుమార్(5), సందీప్(5), నితూష(7)ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఏసీయూ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బాధితుల్లో 16 మందికి భవిష్యత్‌లో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, బాల్క సుమన్, సీపీఐ నాయకులు నారాయణ, మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు. విషాదంలోనే ఆ గ్రామాలు... గజ్వేల్/తూప్రాన్: రైలు, బస్సు ప్రమాద దుర్ఘటన జరి గి మూడు రోజులు అవుతున్నా ఆ గ్రామాన్ని విషాదం వీడడం లేదు. కొందరు మృతి, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉండడంతో వెంకటాయపల్లి తల్లడిల్లుతోంది. గ్రామానికి చెందిన శివ్వం పేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత కోలుకుంటోం ది. కుమారుడు వరుణ్ ఇంకా స్పృహలోకి రాలేదు. శృతి సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి చేరుకున్నారు. అలాగే మన్నెస్వామి-లావణ్య కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవతా సత్యనారాయణ-గాయత్రి కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక జిన్నారం మండలం కానుకుంటకు చెందిన తప్పెట లక్ష్మణ్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం- నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీ ప్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైన్ వస్తుందని చెబుతూనే ఉన్నా మూడవ సీట్లో కూర్చున్నా. ట్రైన్ వచ్చేది చూశా. డ్రైవర్ అంకుల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంకుల్ ట్రైన్ వస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. పట్టాల మీదకు వచ్చి బస్సు ఆగింది. స్టార్ట్ కాలేదు. అంతలోనే ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. పక్క సీట్లో కూర్చున్న సద్బావన్, మహిపాల్‌రెడ్డిలను కిటికిలోంచి భయటకు తోసేశా. తమ్ముడు వరుణ్‌ను తోసేందుకు ప్రయత్నించినా కిటికిలో పట్టలేదు. - రుచిత ఆడుకుంటూ ఉన్నా.. బస్సులో ప్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉన్నా. పట్టాలపైకి వచ్చే సరికి బస్సు ఆగిపోయింది. ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. చేయి విరిగి నొప్పేసింది... మమ్మీ, డాడీ అంటూ ఏడుస్తూ కూర్చున్నా... - సాత్విక ఏమైందో తెలియదు నాలుగవ సీట్లో కూర్చున్నా.పెద్ద శబ్ధం వచ్చింది. చూసేలోపే దెబ్బలు తగిలాయి. ఏమైందో తెలియదు. కిందపడిపోయాను. - సాయిరాం గాల్లో ఎగిరిపడ్డా నేను, మహిపాల్ ఫ్రెండ్స్ ఇద్దరం ఒకే సీట్లో కూర్చున్నాం... పెద్ద శబ్దంతో బస్సు కిందపడిపోయింది... అక్క రుచిత తోసేయడంతో గాల్లో ఎగిరిపోయి బయటపడ్డాను. నా కాలు పోయింది మమ్మీ... అంటూ ఏడుస్తున్నా.... అక్కడ చాలా మంది అంకుల్ వాళ్లు ఉన్నారు... నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు... ఆ స్కూల్‌కు ఇంక వెళ్లను.... ఇద్దరం ఫ్రెండ్స్ ఊర్లోనే స్కూల్‌కు వెళతాం. - సద్భావన్దాస్ బ్లడ్తో బట్టలు నిండిపోయాయి.. నాలుగవ సీట్లో త్రిష, నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ట్రైన్ బస్సును ఢీకొట్టింది. గట్టిగా అరుస్తున్నాం. క్షణాల్లో అందరికి దెబ్బలు. బ్లడ్తో బట్టలు నిండిపోయాయి. - నబిరా ఫాతిమా ఆ బస్సు ఎక్కను ఆ బస్సెక్కను.. ఆ బడికి పోను.. అక్కడికి వెళ్లడం వల్లే నా కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఇంటిదగ్గరున్న బడికి పోతా. - మహిపాల్‌రెడ్డి -
'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్‌ల పరిస్థితి విషమం'
-
'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్‌ల పరిస్థితి విషమం'
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైల్ ఢీ కొన్న ఘటనలో తరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంత్‌ల పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శరత్, శ్రావణి, శిరీసలను అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. మరో ఎనిమిది మంది విద్యార్థులను సాయంత్రంలోపు జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థుల ఆరోగ్యంపై మరో బులెటన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
-
అయిదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీ కొన్న ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై శనివారం ఉదయం యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మరో 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మరికాసేపట్లో వారందరిని జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
డిప్యూటీ సీఎం రాజయ్య హైదరాబాద్: మాసాయిపేట ఘటనలో క్షతగాత్రులైన విద్యార్థులకు అత్యాధునిక వైద్యసేవలందిస్తున్నామని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన బాధిత కుటుంబాలను, చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. చిన్నారుల చికిత్సకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా శుక్రవారం మంత్రి హారీష్‌రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, విమలక్క బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు కేర్ సిబ్బంది విరాళం సీఎంకు రూ.50లక్షల చెక్ ఇచ్చిన ఆస్పత్రి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: మాసాయిపేట బాధితుల సహాయార్థం కేర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల విరాళాన్ని (రూ. 50 లక్షలు) చెక్ రూపంలో అందజేశారు. -
మమ్మీ....నొప్పి!
‘యశోద’లో చిన్నారుల ఆక్రందనలు అత్యంత విషమంగా వరుణ్‌గౌడ్,వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ‘మమ్మీ.. కాలు కదలడం లేదు.. చేయి లేవట్లేదు.. ఒళ్లంతా నొప్పి.. తట్టుకోలేకపోతున్నా.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. డాడీకి ఫోన్ చేసి రమ్మను...’ ఐసీయూలోకి అడుగు పెట్టిన తల్లులను చూడగానే అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు చేస్తున్న ఆక్రందనలివి. క్షేమంగా తిరిగొస్తాడనుకున్న బిడ్డలు కళ్లముందే మృత్యువుతో పోరాడుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి తట్టుకోలేకపోతున్నారు. లేత శరీరాలపై భారీ కుట్లు చూసి వారి హృదయాలు తట్టుకోలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం తల్లిదండ్రులు, బంధువులు పెద్దసంఖ్య లో శుక్రవారం యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. వైష్ణవి(11), తరుణ్(7), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. శరత్(6), శ్రావణి(6), శిరీష అలియాస్ త్రిష(8), దర్శన్(6), ప్రశాంత్(6), నితుషా(7)ల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు చెప్పారు. రుతికాగౌడ్(8), ఫాతిమా(9) ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు తెలిపారు. దర్శన్, కరుణాకర్, శివకుమార్, సందీప్, వరున్‌గౌడ్, ఫాతిమాలకు శస్త్ర చికిత్స చే శారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు. -
నిను మరవలేం బిడ్డా!
నాలుగు గ్రామాల్లో వీడని విషాద ఛాయలు గజ్వేల్/తూప్రాన్: స్కూల్‌కు టైమ్ అయ్యింది.. టిఫిన్ కూడా తెచ్చిన.. తొందరగా బడికిపోవాలె లేవుండ్రి బిడ్డా! నీకు బ్రెడ్ తెచ్చిన..చాయ్ తెచ్చిన.. ఇప్పుడైనా లేవుండ్రి కన్నా.. అంటూ తమ పిల్లలు ఇక లేరని తెలిసి కూడా ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించని వారు లేరు. మాసాయిపేట దుర్ఘటనలో మరణించిన చిన్నారులు దివ్య-చరణ్‌లను తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఖననం చేసిన ప్రదేశంలో శుక్రవారం నాటి దృశ్యమిది. వారి తల్లిదండ్రులు జక్కుల సంతోష-యాదగిరి రోదనలతో ఆ ప్రాంతం కంపించింది. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. ఇతర బాధిత కుటుంబాలున్న కిష్టాపూర్, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్ గ్రామాల్లోనూ ఇంకా విషాద ఛాయలే నెలకొన్నాయి. నిన్నటివరకు ఉదయాన్నే స్కూలు బస్సు వద్ద సందడి చేసే పిల్లలంతా ఇక లేరనే నిజం గ్రామస్థుల గుండెలను పిండేస్తూనే ఉంది. కంటికిరెప్పలా చూసుకున్న కన్నబిడ్డలను తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. -
ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు..
ఒక తల్లికి ఆనందం.. ఇంకో తల్లికి గర్భశోకం ‘స్కూలు బస్సు’ మృతుల గుర్తింపులో పొరపాటు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: తమ కనుపాప దూరమైందని తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసి ఆశలు వదిలేసుకున్న ఆ దంపతులు.. తమ బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుని విషాదం నుంచి తేరుకున్నారు. అవును.. పుట్టినరోజు నాడే ‘ధనుష్’ మళ్లీ పుట్టాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన స్కూలు బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడనుకున్న చిన్నారి ధనుష్ అలియాస్ దర్శన్ గౌడ్ బతికే ఉన్నాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భావిస్తున్న మరో పిల్లాడు దత్తు.. ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయినటుతేలింది. దీంతో ఆ కుటుంబాల్లో పరిస్థితి తారుమారైంది. ఒకరింట సంతోషం.. మరో ఇంట విషాదం నెలకొంది. పిల్లలను గుర్తించడంలో పొరపాటు వల్ల ఈ ఉదంతం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన జాలిగామ స్వామిగౌడ్-పుష్ప దంపతులు తమ కొడుకు ధనుష్‌ను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి గురువారమే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే శుక్రవారం ఉదయం వారికి వైద్యుల నుంచి ఫోన్ వచ్చింది. మీ కొడుకు ధనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, వచ్చి చూడండంటూ కబురందించారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ప్రమాదంలో చనిపోయిన దత్తు మృతదేహాన్ని తమ పిల్లాడిదని పొరబడి తీసుకొచ్చినట్లు వారికి అర్థమైంది. కాగా, ఇదే మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరబాబు-నీరజ దంపతుల కూతురు భువన రైలు పట్టాల మీదే చితికిపోయింది. అదే స్కూలు బస్సులో ఉన్న తమ కొడుకు దత్తు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు భావించారు. కూతురు అంత్యక్రియలు పూర్తి చేసి.. కొడుకైనా మిగిలాడనుకున్నారు. తెల్లారేసరికే ఆ దంపతుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రమాదం జరిగిన రోజే మార్గ మధ్యలో దత్తు చనిపోయాడని అధికారులు గుర్తించడంతో వీరబాబు కుంటుంబం మళ్లీ శోకసంద్రమైంది. తల్లిదండ్రుల పేర్లు చెప్పిన ధనుష్ ప్రమాదంలో ధనుష్(అలియాస్ దర్శన్ గౌడ్) మృతి చెందినట్లు అందరూ భావించారు. అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన (దత్తు)మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారికి తిరిగి అప్పగించారు. గురువారం రాత్రే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన 20 మంది చిన్నారులు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో తీవ్రంగా గాయపడిన ధనుష్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో స్పృహ కోల్పోయి... శుక్రవారం తెల్లవారుజామున తిరిగి స్పృహలోకి వచ్చాడు. అతన్ని ప్రశ్నించిన వైద్యులకు తన తల్లిదండ్రుల పేరు, తన నానమ్మ పేరు చెప్పడంతో జరిగిన పొరపాటును గుర్తించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు సమాచారం అందించారు. బాబును గుర్తించేందుకు కుటుంబసభ్యులు హుటాహూటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి.. తన తండ్రి స్వామిగౌడ్‌ని చూసి నాన్నా.. అని పిలవడంతో తమ బిడ్డ బతికే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాపం వీరబాబు, నీరజ దంపతులు ఇప్పటికే కూతురు భువనను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన వీరబాబు-నీరజ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. బతికే ఉన్నాడనుకుంటున్న తమ కొడుకు దత్తు కూడా చనిపోయాడని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న దత్తును సహాయక బృందం హుటాహుటిన కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దత్తు చనిపోయాడు. అయితే దత్తు, ధనుష్‌ల ఎత్తు, పొడవు, రూపం ఒకే విధంగా ఉండటం, ముక్కు, దవడ భాగం పూర్తిగా చితికిపోయి ఉండటంతో పాటు ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోవడం వల్ల తల్లిదండ్రులు తమ బిడ్డలను సరిగా గుర్తించలేకపోయారు. కూతురు చనిపోయిన బాధలో మునిగిపోయిన వీరబాబు దంపతులు తమ కొడుకు బతికే ఉన్నాడనే భ్రమలో ఉండిపోయారు. అయితే కిష్టాపూర్‌లో స్వామిగౌడ్ ఖననం చేసింది వారి కుమారుడిని కాదని తేలడంతో... వీరబాబు దంపతులకు అనుమానం వచ్చింది. అయ్యో..! చనిపోయింది తమ బిడ్డ దత్తే కావచ్చునని గుండెలు బాదుకున్నారు. అప్పటికి కొడుకు కోసం ఆసుపత్రిలో ఉన్న ఆ దంపతులు అక్కడే కుప్పకూలిపోయారు. మంత్రి హరీశ్‌రావు సహా అధికారులు వారిని ఓదార్చే యత్నం చేశారు. వారిని హరీశ్‌రావు స్వయంగా తన కారులో కిష్టాపూర్‌లో దత్తు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలానికి తీసుకెళ్లారు. స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్యర్యంలో పోలీసులు సిబ్బంది, సిద్దిపేట ఆర్డివో ముత్యంరెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఇరు కుటుంబాల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీయించారు. వీరబాబు-నీరజ దంపతులు దత్తును గుర్తించారు. కన్నీరు మున్నీరుమున్నీరుగా విలపించారు. అధికారులు చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇస్లాంపూర్ గ్రామంలో దత్తు మృతదేహానికి మళ్లీ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలనూ కోల్పోయిన వీరబాబు దంపతులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. -
దత్తు మృతిపై వీడిన అనుమానాలు
-
మృతదేహాల అప్పగింతలో గందరగోళం
-
దత్తు మృతిపై వీడిన అనుమానాలు
హైదరాబాద్ : విద్యార్థి దత్తు మృతిపై అనుమానాలు వీడాయి. ధనుష్ తల్లితండ్రులు ఖననం చేసింది దత్తు మృతదేహానికేనని గ్రామస్తులు నిర్థారణకు వచ్చారు. ఇప్పటివరకూ బతికే ఉన్నాడనుకున్న దత్తు... మరణవార్త వినటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. నిన్న జరిగిన దుర్ఘటనలో కుమార్తై భువనను కూడా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు కూడా లేడనే వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు ధనుష్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రమాదంలో గుర్తు పెట్టలేని విధంగా ఉండటం వల్లే తమ కుమారుడి మృతదేహం అనుకుని దత్తు దేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు ధనుష్ తండ్రి తెలిపారు. -
ధనుష్ బ్రతికున్నాడు.. దత్తు ఏమయ్యాడు?
-
ధనుష్ బతికే ఉన్నాడు.... దత్తు ఏమయ్యాడు
మెదక్ : తమ ఇంటి వెలుగు ఆరిపోయిందనుకున్న ఆ తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ ఊపిరినిచ్చింది. అయితే మరో విద్యార్థి తల్లిదండ్రులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఓ విద్యార్థికి తమ బిడ్డ మరణించాడనుకొని మరో విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కిష్ణాపూర్లో దత్తు అనే విద్యార్థికి .....ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. అయితే ధనుష్ బతికే ఉన్నాడంటూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో ధనుష్ తల్లిదండ్రులు పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు దత్తు తల్లిదండ్రులు శుక్రవారం కిష్టాపూర్ వెళ్లారు. ఇక మృతదేహాన్ని పరిశీలించి ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. -
యశోదాలో చిన్నారులకు రాజయ్య పరామర్శ
-
యశోదాలో చిన్నారులకు రాజయ్య పరామర్శ
హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డిప్యూటీ సీఎం, వైద్య, విద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య శుక్రవారం పరామర్శించారు. చికిత్స వివరాలను ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. చిన్నారులకు ఏం కాదని వారి తల్లిదండ్రులకు రాజయ్య ధైర్యం చెప్పారు. 20మంది విద్యార్థులు యశోదాలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా వీరిలో నలుగురి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ఆర్డీవో విచారణ జరుపుతున్నారు. -
ట్రాఫిక్ ఆపి.. ప్రాణం పోసి..
ట్రాఫిక్ పోలీసుల సహకారంతో విజయవంతమైన గుండెమార్పిడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి నుంచి గుండె సేకరణ.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఆపేసి, సిగ్నళ్లను నిలిపేసి.. ప్రత్యేక మార్గం ఏర్పాటు 12.7 కిలోమీటర్లు, 9 కూడళ్లు.. దాటింది ఎనిమిది నిమిషాల్లోనే.. సాక్షి, హైదరాబాద్: సమయం రాత్రి 9.30.. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి ప్రాంతం నుంచి ఒక వాహనం బయలుదేరింది.. జూబ్లీహిల్స్ వైపు దూసుకెళుతోంది.. నిరంతరం ట్రాఫిక్‌తో కిటకిటలాడే మార్గమది.. కానీ, ట్రాఫిక్‌ను ఎక్కడిక్కడ ఆపేశారు.. కూడళ్లన్నింటి వద్ద సిగ్నళ్లను నిలిపేశారు.. ఈ వాహనం వెళుతున్న దారిలో ఉన్న వాహనాలన్నింటినీ వేగంగా పంపించారు.. మరికొన్నింటిని దారి మళ్లించారు.. ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక మార్గాన్ని కల్పించారు.. రాష్ట్రపతి వంటివారు ప్రయాణిస్తుంటే తీసుకునే ముందుజాగ్రత్తల్లా ఉన్నాయా చర్యలు... ఇదంతా ఒక యువకుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు వైద్యులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి చేసిన అద్భుతం. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న ఒక యువకుడికి అమర్చేందుకు.. ఇలా అసాధారణ ట్రాఫిక్ అప్రమత్తత మధ్య తీసుకువెళ్లారు. ఈ ఆస్పత్రుల మధ్య 12.7 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది కూడళ్లను దాటుకుని వెళ్లేందుకు ఆ సమయంలో సాధారణంగా 45 నిమిషాలకు పైగా పడుతుంది. కానీ, ఈ గుండెను తీసుకువెళుతున్న అంబులెన్సు కేవలం 8 నిమిషాల్లో దూసుకుపోగలిగింది. ‘డైలేటెడ్ కార్డియోపతి (గుండె కండరాలు, రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడం)’తో బాధపడుతున్న గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు (19) కొద్ది నెలల కింద అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరాంజనేయులుకు గుండె మార్పిడి మాత్రమే పరిష్కారమని చెప్పిన వైద్యులు.. బాధితుడి సమాచారాన్ని నిమ్స్ జీవన్‌దాన్ కేంద్రానికి చేరవేశారు. నవంబర్ 11న సాయంత్రం 6.30 గంటల సమయంలో యశోదా ఆస్పత్రిలో ఒక వ్యక్తి బ్రెయిన్‌డెడ్ స్థితికి వెళ్లినట్లు ‘జీవన్‌దాన్’కు సమాచారం అందింది. జీవన్‌దాన్ సిబ్బంది అవయవదానానికి ఆ వ్యక్తి బంధువుల అంగీకారం తీసుకుని.. సమాచారాన్ని అపోలో ఆస్పత్రికి చేరవేశారు. వయసు, రక్తం గ్రూపు వంటివి మ్యాచ్ కావడంతో అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నారు. యశోద ఆస్పత్రిలోని వ్యక్తి నుంచి సేకరించిన గుండెను పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పద్మనాభరెడ్డి సహాయంతో 8 నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో గుండెను తరలించడం వల్ల శస్త్రచికిత్స విజయవంతమైనట్లు అపోలో వైద్యుడు విజయ్ దీక్షిత్ చెప్పారు. తరలింపులో పోలీసులు అందించిన సహకారం మరువలేనిదని సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘జీవన్‌దాన్’ పథకం కింద హైదరాబాద్‌లో తొలిసారి ఉచితంగా జరిగిన గుండెమార్పిడి శస్త్రచికిత్స ఇది కావడం గమనార్హం. నాలుగు గంటల్లోపే.. గుండె మార్పిడి చేయాలంటే.. దాత వయస్సు, రక్తం గ్రూపు బాధితుడికి మ్యాచ్ కావాలి. సేకరించిన గుండెను పది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచి తరలించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అందులో ఆక్సిజన్, గ్లూకోజ్ శాతాలు తగ్గకుండా చూడాలి. బాధితుడి దెబ్బతిన్న గుండె స్థానంలో అమర్చాలి. గుండెను తీయడం నుంచి బాధితుడికి అమర్చడం వరకూ అంతా కూడా నాలుగు గంటల లోపుగా జరగాలి. లేకపోతే అది పనిచేయదు. కాగా, విదేశాల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు రూ. కోటిన్నరకుపైగా ఖర్చు అవుతుండగా.. హైదరాబాద్‌లో రూ. 15 లక్షల వరకు మాత్రమే అవుతుందని అపోలో ఆస్పత్రి ఎండీ సంగీతారెడ్డి చెప్పారు.