డిప్యూటీ సీఎం రాజయ్య
హైదరాబాద్: మాసాయిపేట ఘటనలో క్షతగాత్రులైన విద్యార్థులకు అత్యాధునిక వైద్యసేవలందిస్తున్నామని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన బాధిత కుటుంబాలను, చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. చిన్నారుల చికిత్సకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా శుక్రవారం మంత్రి హారీష్‌రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, విమలక్క బాధిత కుటుంబాలను పరామర్శించారు.
బాధితులకు కేర్ సిబ్బంది విరాళం
సీఎంకు రూ.50లక్షల చెక్ ఇచ్చిన ఆస్పత్రి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: మాసాయిపేట బాధితుల సహాయార్థం కేర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల విరాళాన్ని (రూ. 50 లక్షలు) చెక్ రూపంలో అందజేశారు.
చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
Published Sat, Jul 26 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement