తమ ఇంటి వెలుగు ఆరిపోయిందనుకున్న ఆ తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ ఊపిరినిచ్చింది. అయితే మరో విద్యార్థి తల్లిదండ్రులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చింది.
మెదక్ : తమ ఇంటి వెలుగు ఆరిపోయిందనుకున్న ఆ తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ ఊపిరినిచ్చింది. అయితే మరో విద్యార్థి తల్లిదండ్రులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఓ విద్యార్థికి తమ బిడ్డ మరణించాడనుకొని మరో విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కిష్ణాపూర్లో దత్తు అనే విద్యార్థికి .....ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు.
అయితే ధనుష్ బతికే ఉన్నాడంటూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో ధనుష్ తల్లిదండ్రులు పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు దత్తు తల్లిదండ్రులు శుక్రవారం కిష్టాపూర్ వెళ్లారు. ఇక మృతదేహాన్ని పరిశీలించి ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.