'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమం' | Three students health critical says yashoda hospital doctors | Sakshi
Sakshi News home page

'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమం'

Published Sat, Jul 26 2014 11:05 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమం' - Sakshi

'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమం'

హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైల్ ఢీ కొన్న ఘటనలో తరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శరత్, శ్రావణి, శిరీసలను అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. మరో ఎనిమిది మంది విద్యార్థులను సాయంత్రంలోపు జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థుల ఆరోగ్యంపై మరో బులెటన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.  

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement