నాగర్‌కర్నూల్/హసన్‌పర్తి: స్వైన్‌ఫ్లూతో సోమవారం ఇద్దరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురానికి చెందిన లెక్చరర్ ఎన్నం రాకేష్ (33) స్వైన్‌ఫ్లూ బారిన పడి ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అలాగే వరంగల్ నగర పరిధిలోని చింతగట్టు క్యాంప్ ప్రాంతానికి చెందిన బి. శాంతమ్మ(51) స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
తాజాగా 55 పాజిటివ్ కేసులు...
హైదరాబాద్ : సోమవారం హైదరాబాద్‌లో 52 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు వైద్యులు ఉన్నారు. సీఎంవోలోని ఎస్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీరాములు ఇద్దరు పిల్లలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్థారించగా ... లోటస్‌చిల్ట్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్‌కు చెందిన భీమరి నర్సింహులు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన మందడి నర్సింహులుగౌడ్(40), వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ప్రవీణ్‌కు స్వైన్ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు.
ఈ సీజన్‌లో 22 స్వైన్‌ఫ్లూ మరణాలు
నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్‌లో ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూతో 22 మంది మరణించారని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెలలో ఇప్పటి వరకు 1,050 మంది రక్త నమూనాలను పరీక్షించగా 360 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలగా.. ఇందులో 13 మంది చనిపోయారన్నారు. ఈ నెలలో రంగారెడ్డి జిల్లాలో 105 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా ఐదుగురు, హైదరాబాద్‌లో 224 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా ముగ్గురు చనిపోయారని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 14 మంది స్వైన్‌ఫ్లూ సోకగా ఇద్దరు మృతి చెందారని చెప్పారు. మెదక్‌లో 11 మందికి, ఆదిలాబాద్‌లో ఇద్దరికి, వరంగల్ జిల్లాలో ముగ్గురికి సోకగా, ఒక్కొక్కరు చొప్పున చనిపోయారన్నారు. ఇప్పటివరకు జిల్లాలకు 28 వేల స్వైన్‌ఫ్లూ మాత్రలను సరఫరా చేసినా ఉపయోగించాల్సిన అవసరం రాలేదన్నారు. సీఎం ఆదేశం మేరకు సోమవారం గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ కమిటీ సమావేశం జరిగిందన్నారు. ఇందులో మంత్రి లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారన్నారు.
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి
Published Tue, Jan 27 2015 4:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement