హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డిప్యూటీ సీఎం, వైద్య, విద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య శుక్రవారం పరామర్శించారు. చికిత్స వివరాలను ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. చిన్నారులకు ఏం కాదని వారి తల్లిదండ్రులకు రాజయ్య ధైర్యం చెప్పారు. 20మంది విద్యార్థులు యశోదాలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా వీరిలో నలుగురి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ఆర్డీవో విచారణ జరుపుతున్నారు.