హైదరాబాద్: అబ్దుల్ కలాంగారు శతాబ్దపు యుగపురుషుడు అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన 46 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన మహనీయుడని చెప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ తరుపున కలాం మృతిపట్ల విష్ణుకుమార్ రాజు నివాళులు అర్పించారు. ప్రపంచ దేశాల్లో భారత్ను గొప్పశక్తిమంతమైన దేశంగా భావించిన వ్యక్తి కలాం అని చెప్పారు. కేవలం సైంటిస్టు సంబంధ విషయాలే కాకుండా మానవాళికి సంబంధించిన సేవలు కూడా అందించారని కొనియాడారు. కలాం భారత దేశపు ముద్దుబిడ్డ, ఆణిముత్యం అని ఆయన చెప్పారు.