
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కుట్రలు చేయడం బీజేపీకి తెలియదని ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తాను చెప్పిన తర్వాతే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిందని, అయినా అక్రమాలు తగ్గలేదని ఆయన అన్నారు. ఇసుక రీచ్‌లలో రౌడీయిజం పెరిగిందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టకుంటే అరాచకాలు జరుగుతాయని చెప్పినా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు.
ఏసీబీ దాడులు జరిగినా.. అవినీతి ఆగడం లేదు..
తాను ఎమ్మెల్యే అయినా.. అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేశానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏసీబీ దాడులు జరిగిన కూడా అవినీతి ఆగడం లేదంటే నేతల ప్రమేయం ఉందని అంతా అనుకుంటున్నారని ఆయన వ్యాఖానించారు. ఇంతగా అవినీతి విస్తరించినందువల్ల తాను వచ్చేసారి సభకు వస్తానో రానో తెలియదన్నారు. వచ్చే ఎనికల్లో నోటుకు ఓటేస్తారో.. నిజాయితీకి ఓటేస్తారో నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారని విష్ణుకుమార్ రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment