Fact Check: సిగ్గు ‘ఈడీ’సి రాతలా? | Fact Check: Eenadu Ramoji Rao Fake News On Sand Policy | Sakshi
Sakshi News home page

Fact Check: సిగ్గు ‘ఈడీ’సి రాతలా?

Published Tue, Mar 5 2024 5:55 AM | Last Updated on Tue, Mar 5 2024 5:55 AM

Fact Check: Eenadu Ramoji Rao Fake News On Sand Policy - Sakshi

తమిళనాడులో ఈడీ విచారణకు ఏపీలో ఇసుక పాలసీకి సంబంధం ఏమిటీ? 

ఇసుక తవ్వకాలను అక్కడితో పోల్చడం దిగజారుడుతనమే   

రోజురోజుకీ రామోజీకి పెరిగిపోతున్న అక్కసు 

ఇసుమంతైనా నిజాయతీ లేకుండా నిందలా.?   

పారదర్శక ఇసుక విధానంపై ఈడీ దృష్టి సారించాలని కోరడం సిగ్గుచేటు 

అసలు ఈడీ విచారణ జరగాల్సింది మార్గదర్శి అక్రమాలపైనే  

ఫిలింసిటీ భూ కుంభకోణాలపై జాతీయ స్థాయి దర్యాప్తు అవసరం 

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం 

ఉచిత ఇసుక పేరుతో జరిగిన దందాకు చెక్‌ పెట్టడం వల్లే కడుపు మంట  

ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఇస్తుంటే పిచ్చి రాతలు 

నాటి అక్రమాలపై ఈడీ కేసులు పెట్టాలని ఆనాడు ఎందుకు రాయలేదు? 

గురివింద చెబుతున్నట్లు గత చంద్రబాబు పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఉంటే.. చింతమనేని ప్రభాకర్‌ మహిళా తహశీల్దార్‌ను ఎందుకు జుట్టు పట్టుకుని ఈడ్చినట్లు? అర్ధ రాత్రిళ్లు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వెనుక ప్రొక్లయినర్లతో ఎందుకు ఇసుక తవ్వకాలు సాగించినట్లు? వీటిని బట్టి బాబు అండ్‌ గ్యాంగ్‌ అందినకాడికి దోచుకున్నారని ఈ రాజగురివిందకు తెలీదా? ఈ లెక్కన ఈ ప్రభుత్వంలో ఇసుక విక్రయం వల్ల  ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తోంది.

మరోవైపు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపుతోంది. స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో ద్వారా నిఘా పెట్టింది. ఏకంగా 6.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను సీజ్‌ చేసింది. ఇదంతా కళ్లెదుటే అందరికీ కనిపిస్తున్నా.. రామోజీకి, పచ్చ మీడియాకు మాత్రం కనిపించదు. తమ చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఎంతకైనా దిగజారుతామని, అవసరమైతే బట్టలిప్పుకుని దుష్ప్రచారం చేస్తామని అనునిత్యం చాటుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఎవరు నవ్విపోతే మాకేంటని నిస్సిగ్గుగా రోజూ రోత రాతలు రాయడం రామోజీకే చెల్లింది.  

సాక్షి, అమరావతి:  మోకాలికి బోడిగుండుకి ముడి పెట్టడం ఎంత తిక్క తనమో ఏపీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను తమిళనాడుతో పోల్చి అక్కసు వెళ్లగక్కడం అంతకంటే ఎక్కువ పిచ్చితనం. ఈ పిచ్చి రాతలనే నమ్ముకున్న రామోజీ అదే పనిగా ఇసుకపై తనకున్న పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్క­డో తమిళనాడులో జరిగిన ఇసుక తవ్వకాలపై ఈడీ దృష్టి సారిస్తే, ఇక్కడ కూడా అలాగే జరగాలని కోరుకోవడం సీఎం వైఎస్‌ జగన్‌పై ఉన్న కక్ష కాకపోతే మరేమిటి?. ఇసుక తవ్వకాలు సక్రమంగా జరుగుతున్నా అక్కసుతో నిత్యం తాను బురద జల్లడమే కాకుండా ఏకంగా ఈడీ జోక్యం చేసుకోవాలని బరి తెగిం­చి అడ్డగోలు రాతలు రాయడం గురువింద రామో­జీకి చెల్లింది. నిజానికి ఈడీ దర్యాప్తు జరపా­ల్సింది డిపాజిటర్లను నిట్టనిలువునా ముంచిన రామోజీ సొంత సంస్థ మార్గదర్శిపైనే. మార్గదర్శికి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని సాక్షాత్తూ కోర్టులే స్పష్టం చేశాయి.

వేల కోట్లు దోచేసి నంగనాచి రాతలు, దొంగ ఏడుపులు, నక్క తెలి­వి తేటలతో తప్పించుకున్నారు. రామో­జీ ఫిలిం సిటీ భూకుంభకోణాలపై ఈడీగానీ, సీబీఐగానీ విచారణ చేస్తే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా నిజాలు బహిర్గతమవుతాయి. తన వెనుక ఉన్న ఈ అక్రమాలను దాచిపెట్టుకుని ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లడం రామోజీకి రోజువారీ ప్రక్రియగా మారిపోయింది. విష ప్రచారం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలనే ఆరాటం తప్ప నిజంగా ఇసుక తవ్వకాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో తెలిపే ఒక్క లైను ఈనాడు రాయలేకపోతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, ఇక్కడి ఇసుక విధానం, తమిళనాడులో ఇసుక విధానం, తవ్వకాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా రెండు రాష్ట్రాలను పోలుస్తూ ఈనాడు ప్రచురించిన కథనంలో అక్కసు మాత్రమే కనిపిస్తోంది.   

బాబు హయాంలో జేబుల్లోకి రూ.వేల కోట్లు  
వాస్తవానికి గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఇసు­­క మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. ఆ దోపిడీని నివారించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రతి సంవత్స­రం రూ.765 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును తిరిగి ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా చంద్రబాబు హయాంలో ఏమైంది? సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూ ప్రజా సంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లేలా చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం.

ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది చంద్ర­బాబు. ఆ అరాచక విధానాన్ని రూపు మాపి ప్రజల­కు అందుబాటు ధరలో ఇసుక లభించేలా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా నూ­తన ఇసుక పాలసీని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమ­లు చేస్తోంది. దీంతో ఎక్కడా ఇసుక కొరత లే­కుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసు­కను పొందే వీలు కల్పించారు. టెండర్ల ద్వారా ఇసు­క తవ్వకాలను ఏజెన్సీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో రూ.3825 కోట్ల ఆదాయం వస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తోంది.    

అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాపైనా ప్రభుత్వం ఉక్కు­­పాదం మోపింది. అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జై­లు శిక్షను విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బ్యూరోను ఏర్పా­టు చేసి దాదాపు 18 వేల కేసులను ఈ బ్యూ­రో నమో­దు చేసింది. 6.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను సీజ్‌ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. అంటే ఉచిత ఇసుక విధానం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఇటు పర్యావరణానికి విఘాతం ఏర్పడింది. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.  

గత ప్రభుత్వంలో ఆదాయం ఏమైంది ? 
ఈ ప్రభుత్వంలో ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రూ.3,825 కోట్ల ఆదాయం గతంలో ఏమైంది? ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని తెలిసినా ఎందుకు టెండర్లు పిలువలేదు? పారదర్శక విధానాలను ఎందుకు ఎంచుకోలేదు? అప్పుడు రామోజీరావు ఈ అక్రమాలపై ఈడీ విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు.? ప్రస్తుతం పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్‌ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్‌ జరుగుతోంది.

రాష్ట్రంలో ఎక్కడా అక్రమ తవ్వకాలు జరగడానికి అవకాశమే లేదు. దీనిపై పర్యవేక్షణకు నిఘా కోసం ఎస్‌ఈబిని ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్‌ స్క్వాడ్‌ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్‌ పోస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement