
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల సంఘాల సమావేశంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిల సమావేశానికి రాని పార్టీలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నిర్ణయం ప్రకారం తాము సమావేశానికి హాజరు కాలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన అఖిల పక్షానికి తామెందుకు వస్తామన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యారని టీడీపీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ‘ వైఎస్ జగన్‌కు మేం చేబితే ఎందుకు వింటారు..? మేం చెప్పిన మాట పవన్ వింటాడా..?, మేం చెబితే అచ్చెన్నాయుడే వినడు.. వారెందుకు వింటారు..’ అని ప్రశ్నించారు. టీడీపీ హఠాత్తుగా యూటర్స్ తీసుకుందని, అందులో తాము భాగస్వామ్యం కాకుడదని సమావేశానికి రాలేదని విష్ణుకుమార్ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment