సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు లేఖ రాశారు. సీఎం అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలపక్షానికి తాము హాజరుకావడం లేదని విష్ణుకుమార్ రాజు లేఖలో పేర్కొన్నారు. సొంత లాభం కోసమే అఖిలపక్ష భేటీ పెట్టారన్నారు. రాజకీయ ప్రయెజనాల కోసమే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
మొదట కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఇపుడు ఏపీకి కేంద్రం, ప్రధాని మోదీ అన్యాయం చేశారనడం సరికాదన్నారు. టీడీపీ ఎంపీల ధర్నాలు, సైకిల్ ర్యాలీలు చవకబారు ప్రచారమన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ కడిగేసిందని, చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు పాలన సాగిస్తోందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేశారు. రాయలసీమకు రెండో రాజధాని ప్రకటించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment