చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎంపీలు | TDP MP's Bus Yatra Postponed in Andhra Pradesh - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎంపీలు

Published Tue, Apr 10 2018 11:56 AM | Last Updated on Sat, Aug 11 2018 4:30 PM

TDP MPs bus yatra postponed - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై పోరాటం ఉధృతం చేయాలనుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ఎంపీలు షాక్‌ ఇచ్చారు.  హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆ పార్టీకి పోటీగా కార్యక్రమాలు రూపొందించాలనుకున్నారు. ఆ దిశంగా టీడీపీ ఎంపీలతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రకు సంబంధించి రూట్‌ మ్యాప్‌పై చర్చించేందుకే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు.

అలాగే ఎంపీల బస్సు యాత్ర ద్వారా హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతోపాటు ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రపై నుంచి జనం దృష్టి మరల్చడానికి చంద్రబాబు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. అయితే అధినేత ప్రతిపాదించిన బస్సు యాత్రకు ఎంపీలు సముఖంగా లేకపోవండంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఎంపీల బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన చంద్రబాబుకు ఎంపీలు ...యాత్రకు సుముఖంగా లేకపోవడంతో తదుపరి కార్యాచరణ దిశగా పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement