
'కాల్వ శ్రీనివాసులుపై కేసు నమోదు చేయాలి'
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులు తీరును తప్పుబట్టారు.
ఇసుక అక్రమ రవాణాకు వత్తాసు పలుకుతూ కాల్వ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని కాపు ధ్వజమెత్తారు. ఏపీలో రెవెన్యూ అధికారులకు రక్షణ లేదని చెప్పారు. కణేకల్ ఇసుక అక్రమ రవాణా కేసులో కాల్వ శ్రీనివాసులపై కేసు నమోదు చేయాలని కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.