
చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై స్పీకర్ ఆగ్రహం
అమరావతి: ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ‍్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి ప్రశ్నకు మాట్లాడేందుకు మైక్ ఇస్తున్నారని కాల్వ బుధవారం సభలో ప్రశ్నించారు. దీంతో ఛైర్‌ను ప్రశ్నించవద్దని స్పీకర్ ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులును హెచ్చరించారు. తన అధికారాలనే ప్రశ్నిస్తావా ...సిట్ డౌన్ అంటూ కాల్వకు స్పీకర్ హితవు పలికారు. అంతేకాకుండా అందరూ దాడి చేస్తే ఎలా అంటూ కాల్వపై ఆగ్రహం చెందారు. కాగా స్పీకర్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని, తమ హక్కులను కాపాడాలని మాత్రమే స్పీకర్‌ను కోరినట్లు కాల్వ శ్రీనివాసుతు తెలిపారు.