అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీల్లో వర్షపు నీరు లీక్ అవడంపై సీఐడీ విచారణ మూడో రోజూ కొనసాగింది. సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు, సిబ్బంది వర్షపు నీరు లీక్ అయిన ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జేఎన్టీయూ ప్రొపెసర్ల బృందం కూడా శుక్రవారం అసెంబ్లీని సందర్శించింది.
వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే.