నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగిన శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం తన సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డితో భేటీ కావడంతో టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డిని బుజ్జగించే చర్యలకు దిగారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి కాల్వ శ్రీనివాసులు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి చక్రపాణి రెడ్డితో మంతనాలు జరిపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో సీఎం రమేష్‌తో చక్రపాణి రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. తమకు పార్టీలో కనీసం గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు.