మావాళ్ల దాడి.. చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ | it is a small issue, ap chief whip says on attack issue | Sakshi

మావాళ్ల దాడి.. చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ

Mar 27 2017 10:26 AM | Updated on Mar 28 2019 5:27 PM

మావాళ్ల దాడి.. చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ - Sakshi

మావాళ్ల దాడి.. చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ

రవాణా శాఖ అధికారులపై తమ పార్టీ నాయకులు చేసిన దాడి చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు.

రవాణా శాఖ అధికారులపై తమ పార్టీ నాయకులు చేసిన దాడి చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాన్ని వివాదం చేయడం దారుణమని, తమవాళ్లు సారీ చెప్పారు కాబట్టి అంతా అయిపోయినట్లేనని చెప్పారు.

అయితే, ఉద్యోగులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు అసెంబ్లీలో ప్రస్తావించారు. అధికారులపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. మొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నడివీధిలో రౌడీయిజం చేశారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement