ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం తత్తరపాటు పడుతోంది. డేటా చోరీతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే.. తమ డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారని ఉల్టా ఆరోపణలు చేస్తోంది. పొంతనలేని సమాధానాలు చెబుతూ ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తమపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతుదంటూ గగ్గోలు పెడుతోంది.