డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ లొంగుబాటు గడువు ముగిసింది. 24 గంటల్లో లొంగిపోవాలని సైబరాబాద్ పోలీసులు సోమవారం అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే 24 గంటలు గడిచినా నోటీసులకు అశోక్ స్పందించలేదు .దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.