రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.
అనంతపురం : రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా బీసీరేహల్‌లో శివలింగస్వామి ఆలయంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ...కోడ్ ఉల్లంఘించిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
మరోవైపు మహిళా సంఘాలతో పాటు సామాన్య, మధ్య తరగతికి చెందిన మహిళలను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. విందు ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళా సంఘాల సభ్యులు, ఇతర మహిళలకు బిర్యానీతో పాటు విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్కరికి రూ.100 నగదుతో పంచిపెట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తారని నమ్మబలికారు.