అసెంబ్లీ సమావేశాల పొడిగింపు కుదరదు
చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు
సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలను పొడిగించలేమని ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. బీఏసీ సమావేశం నిర్ణయానికి విరుద్దంగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు.
గవర్నర్ ప్రసంగం బాగుందని చెప్పారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, ఎ.నాగేశ్వర్‌రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, కేఏ నాయుడు, కాగిత వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు.