
2 రోజులపాటు నిర్వహించే అవకాశం
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment