సాక్షి, అమరావతి: ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 22వ తేదీ తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు సమాచారం. అయితే మంత్రులందరూ పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణను వాయిదా వేసినట్టు ప్రచారం నడుస్తోంది. 24వ తేదీ నుంచి ఐదురోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ లీగల్ సెల్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
గత ఐదేళ్లలో టీడీపీ లీగల్ విభాగం అనేక పోరాటాలు చేసిందని, లాయర్‌లు చేసిన కృషి ప్రశంసనీయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని, ఈ క్రమంలో కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment