
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసుకు ఎదురుదెబ్బ తగిలింది. కణేకల్ లో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో మంత్రి కాలువకు చేదు అనుభవం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి కాలువ శ్రీనివాస్కు టిక్కెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేగానీ.. కాలువ శ్రీనివాస్కు మాత్రం సహకరించేది లేదని కణేకల్ టీడీపీ నేతల స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment