అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి తీరాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి తీరాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో మాత్రమే అసెంబ్లీలో తీర్మానం చేయకుండా విభజించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వీలుగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన అంశాన్ని రిఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళదామని వైఎస్‌ఆర్‌సీపీ మిగిలిన పార్టీలకు సవాల్ విసిరింది. ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే మిగిలిన పార్టీలు తమ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమా అని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సమైక్యమే తమ అజెండా అని మిగిలిన పార్టీలు వారి వైఖరి వెల్లడించాలని డిమాండ్‌చేశారు.
సమైక్య తీర్మానం చేసేంతవరకూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టంచేసింది. టీడీపీ నేతలు కొందరు సమైక్యమంటూ... మరికొందరు విభజనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ వైఖరి ఏమిటనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.