'సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడటం లేదు'
అనంతపురం: ప్రస్తుతం చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రెండు నెలలకు పైగా సీమాంధ్రలో చేస్తున్న తీవ్ర రూపం దాల్చినా ఢిల్లీ అధిష్టానానికి కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ పెద్దలపై విరుచుకుపడ్డారు.
గాంధీ మార్గంలో చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ గాంధీలు దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఇందులో సరికొత్త వ్యూహాలతో ముందుకుపోతూ ఉద్యమ రూపు రేఖల్ని మార్చాల్సిన అవసరం ఉందని కాపు రామచంద్రారెడ్డి సూచించారు.