మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రెచ్చగొట్టడంతో రాయదుర్గంలో రాళ్లు రువ్వుకుంటున్న బేలోడు గ్రామస్తులు (ఫైల్)
తెలుగుదేశం పాలనలో ప్రజా సంక్షేమం విస్మరించి అక్రమార్జనపైనే దృష్టిసారించిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి పట్టం కట్టారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన కాలవ తన అనుచరులను, టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైకి ఉసిగొల్పుతూ గొడవలు సృష్టిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టి దాడులకు ఎగదోసి పైశాచికానందం పొందుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు.
సాక్షి, రాయదుర్గం: ప్రశాంతతకు నిలయమైన రాయదుర్గం ప్రాంతంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అలజడి రేపుతున్నారు. పల్లెల్లో ఏదో ఒక గొడవ సృష్టించి తర్వాత తాను నియోజకవర్గంలో అడుగుపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచింది. ప్రజా సంక్షేమ పథకాలతో సాఫీగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే కాలవ శ్రీనివాసులు పల్లెల్లో అల్లర్లు, గొడవలు సృష్టించి వైఎస్సార్‌సీపీపై దు్రష్పచారం చేసేందుకు పడుతున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తూ వస్తున్నారు.
చదవండి: విజయనగరం జిల్లాకు రాజావారి రాజద్రోహం
►గత ఏడాది జూలై 15న రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హనుమంతరాయుడుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జాఫర్ దాడి చేసి గాయపరిచాడు.
►గుమ్మగట్ట మండలం బేలోడులో మొహర్రం పండుగ రోజున చోటుచేసుకున్న చిన్నపాటి గొడవను పెద్దది కాకుండా సర్దిచెప్పి సద్దుమణిగించాల్సిన ప్రతిపక్ష పారీ్టకి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పచ్చని గ్రామంలో కుల చిచ్చు రగిల్చారు. గ్రామంలో జరిగిన సంఘటనను రాజకీ యం చేసి రాయదుర్గం ఆస్పత్రి వద్ద సెపె్టంబర్ 12న ధర్నా చేసి, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో అటుగా వస్తున్న దళితులతో వారు వాగ్వాదానికి దిగి రాళ్ల దాడికి తెగబడ్డారు.
►కణేకల్లు మండలం కళేకుర్తిలో నవంబర్ 27న గ్రామ వలంటీర్ హరిజన మహేంద్రపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కులం పేరుతో దూషించి వలంటీర్‌పైన, అడ్డు వచ్చిన అతడి తల్లి మరియమ్మపైనా దాడి చేసి గాయపరిచారు.
టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన గ్రామ వలంటీర్ హరిజన మహేంద్ర, తల్లి మరియమ్మ (ఫైల్)
►గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్టు గ్రామానికి చెందిన జయరామిరెడ్డి అనే టీడీపీ కార్యకర్త నవంబర్ 11న తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రామాకు తెరలేపాడు. తనకిచ్చిన నివేశన స్థల పట్టాకు అధికారులు స్థలం ఎక్కడుందో చూపడం లేదని ఖాళీ పురుగుమందు బాటిల్‌లోకి నీరు నింపి దాన్ని తాగగా, అతని భార్య పల్లవి వీడియో తీసి డ్రామా రక్తి కట్టించింది. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లు చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఘటన జరగడానికి గంట ముందే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్ చేసి ‘తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లండి.. జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ చెప్పడం వారి కుట్ర రాజకీయాలను బయటపెట్టింది.
►గుమ్మగట్ట మండలం భూపసముద్రం ఉన్నతపాఠశాల కమిటీ చైర్మన్ శ్రీధర్‌పై ఇదే గ్రామానికి చెందిన తమ్మణ్ణ కుమారుడు రాజ అనే టీడీపీ నాయకుడు ఈ నెల నాలుగో తేదీన దాడి చేసి గాయపరిచాడు. టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుని ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎలా మద్దతు పలుకుతావంటూ రాయితో దాడి చేశాడు.
►అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దని వివిధ పారీ్టల నాయకులతో తమకు అనుకూలంగా మలచుకోవడానికి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో ఈ నెల నాలుగో తేదీన వాసవీ కల్యాణమంటపంలో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు అడ్డుకోవడంతో కాలవ శ్రీనివాసులు రహదారిపైనే సమావేశం నిర్వహించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు నన్ను రెచ్చగొట్టవద్దంటూ పోలీసులనే భయపెట్టడానికి ప్రయత్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment