Kalava Srinivasulu
-
కాపు VS కాల్వ వాడుకుని ఇరికించారు..!
-
కాలవ మోసం.. ఇదే సాక్ష్యం!
ఇది రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో నాయీ బ్రాహ్మణ భవన నిర్మాణం కోసమంటూ టీడీపీ హయాంలో వేసిన వేసిన శిలాఫలకం. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలు రెండు నెలల్లో జరగబోతున్నాయగా.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు హడావుడిగా శిలాఫలకం వేసేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టించుకోకుండా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కనికట్టు చేసేశారు. ఇదొక్కటే కాదు... పలు వర్గాలను మచ్చిక చేసుకునేందుకు పట్టణంలో అనేక చోట్ల ఇలాగే శిలాఫలకాలతో నాటకాలకు తెరలేపి వలపన్నారు. కానీ, అప్పటికే ఆయన మోసాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. తనను నమ్మి ఓట్లేసిన పాపానికి నియోజకవర్గ ప్రజలను గతంలో కాలవ శ్రీనివాసులు నిండా ముంచారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినా నియోజకవర్గానికి ఆయన ఒరగ బెట్టిందేమీ లేదు. పైగా టీడీపీ నేతలతో కలిసి దోపిడీలకు తెగబడ్డారు. కావాల్సినంత వెనకేసుకున్నారు. అప్పట్లో ప్రజలపై పచ్చమూకలు దౌర్జన్యాలకు పాల్పడినా అడ్డు చెప్పలేదు. జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తున్నా ఆపలేదు సరికదా.. వారికే వంత పాడారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు. కుల సంఘాలకు కుచ్చుటోపీ.. మంత్రిగా ఉన్నన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకోని కాలవ శ్రీనివాసులు.. గత సార్వత్రిక ఎన్నికల ముందు నాటకాలకు తెరలేపారు. ఎలాగైనా ఓట్లు రాబట్టేందుకు కల్యాణ మండపాల పేరుతో డ్రామాలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉండగా, రాయదుర్గం ముత్రాసు కాలనీ బైపాస్‌రోడ్డు పక్కన షాదీమహల్‌కు, మల్లాపురం లౌఅవుట్ వద్ద రజక భవనానికి, బళ్లారి రోడ్డులో స్వకుళసాలి సమాజ కళ్యాణ మండపానికి శంకుస్థాపనలు చేశారు. ఆర్భాటంగా శిలాఫలకాలు వేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం గంట ముందు కూడా డీ హీరేహాళ్ మండలం ఓబుళాపురం వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ఓ నీటి పథకానికి శంకుస్థాపన చేశారంటే ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఆయన ఎంతలా యత్నించారో అర్థం చేసుకోవచ్చు. కాలవ మోసాలకు నేటికీ ఆ శిలాఫలకాలు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. మళ్లీ మోసగించేందుకు కుయుక్తులు.. ఎన్నికల సమయంలో నాటకాలు ఆడడం అలవాటుగా మార్చుకున్న కాలవ శ్రీనివాసులు.. నేడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుయుక్తులకు తెరలేపారు. ఈ సారి గెలిస్తే తప్పకుండా కల్యాణ మండపాలు పూర్తి చేస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. కానీ, ఆయన మోసాలు పసిగట్టిన నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే పూర్తి చేయలేని నిర్మాణాలను.. మళ్లీ గెలిపిస్తే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 650 హామీలిచ్చి, ఆఖరుకు ఆరింటిని కూడా నెరవేర్చని టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే కాలవ శ్రీనివాసులు ఇంకా నడుస్తుండడం బాధాకరమంటూ నిట్టూరుస్తున్నారు. కాలవను ఎవరూ నమ్మరు! గత ఎన్నికల ముందు షాదీమహల్ నిర్మాణానికి కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ముస్లిం, మైనార్టీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. చివరికి అంతా ఆర్భాటమేనని తేలింది. పైసా నిధులు మంజూరు చేయకుండా మోసం చేశారు. ఇలాగే, శ్మశాన వాటికకు కూడా శిలాఫలకం వేసి చెవిలో పూలు పెట్టారు. నేడు మళ్లీ డ్రామాలాడుతున్న ఆయనను నమ్మేవారు లేరు. – గోనబావి షర్మశ్, రాయదుర్గం ఆశలపై నీళ్లు చల్లారు.. కల్యాణ మండపం నిర్మిస్తామని చెప్పి నాయీ బ్రాహ్మణులను కాలవ శ్రీనివాసులు మోసగించారు. శాంతినగర్‌లో శిలాఫలకం వేసినప్పుడు చాలా సంతోషించాం. అంతటితోనే చేతులు దులుపుకుని మా ఆశలపై నీళ్లు చల్లారు. నిధులు మంజూరు చేయకపోవడంతో నేటికీ శిలా ఫలకం ప్రజలను వెక్కిరిస్తోంది. – రఘురాం, రాయదుర్గం మాయమాటలతో సరి టీడీపీ హయాంలో స్వకులశాలి, కుర్నిశాలి, పద్మశాలి కులాల వారి కోసం కల్యాణ మండపాలు నిర్మిస్తామంటూ శిలా ఫలకాలు వేశారు. ఇవి పూర్తయ్యాక ఎంతో ఉపయోగపడతాయని అనుకున్నాం. తీరా చూస్తే అవి ఉత్తుత్తివని తేలింది. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి వంచించడం సరికాదు. – నగేష్, శాంతినగర్, రాయదుర్గం -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్‌లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
టీడీపీలో అంతా ఎవరికి వారే...
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నాయకుల మధ్య సఖ్యత చెడి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఏ నాయకుడికీ మరొక నియోజకవర్గ నాయకుడితో సరైన సంబంధాలు లేవు. ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను నియమించింది. కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుల మాట కిందిస్థాయి నాయకులు వినే పరిస్థితి లేదు. పరిటాల వర్గమంటేనే భగ్గుమంటున్నారు పరిటాల రవి బతికున్నపుడు టీడీపీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మరణానంతరం పరిటాల కుటుంబమంటేనే కత్తులు దూస్తున్న పరిస్థితి. రాప్తాడు పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబానికి సత్సంబంధాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనే పరిస్థితులు చాలా తక్కువ. ఇక ధర్మవరం నుంచి 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన వరదాపురం సూరి.. 2019లో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ఇద్దరూ ఒకే ఊర్లో ఉంటే రోజూ ఉద్రిక్త పరిస్థితులే. జేసీ అనుచరులతో ఎవరికీ సంబంధాలు లేవు పరిటాల తర్వాత జిల్లాలో ప్రధాన గ్రూపు జేసీ బ్రదర్స్‌ది. ఈడీ కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇప్పుడు జిల్లాలో పలకరించే దిక్కులేదు. పార్టీపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరూ ఆయన దగ్గరకు రాని పరిస్థితి. జిల్లాలో ఏ నాయకుడితోనూ సత్సంబంధాలు లేవు. విధిలేని పరిస్థితుల్లోనే ఆయన కుమారుడికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తున్నట్లు తెలిసింది. కాలవ మాటకు విలువేది? టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు మాటకు విలువ ఇచ్చే నాయకులు వెతికినా కనిపించరు. పైగా ఆయనంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన నాయకులు కత్తులు దూస్తున్నారు. అంతటా ప్రత్యేక గ్రూపులు పెట్టి పార్టీని అధమ స్థాయికి తీసుకెళ్లారని కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర నియోజకవర్గాల నాయకులు వాపోతున్నారు. అందుకే కాలవ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీగా దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీకే వేదన అరణ్య రోదన టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీకే పార్థసారథి వేదన అరణ్య రోదనగానే ఉంది. తనకు టికెట్ లేదన్న లీకులు ఆయన్ను కలవరపెడుతున్నాయి. సవితమ్మకూ ఈయనకూ గత కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంది. ఈసారి సవితమ్మకు టికెట్ ఇస్తూ తనను ఎంపీగా పంపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేగానే పోటీచేస్తా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా బీకేను పార్టీ లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా తన మాట ఎవరూ వినడం లేదని ఆయన లోలోపల కుమిలిపోతున్నారు. వర్ధంతి..జయంతులకు కొట్లాటే ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ కొట్లాటలే. పూలదండలు వేసే కార్యక్రమం చిల్లర కొట్లాటలను తలపించాయి. కళ్యాణదుర్గం నుంచి కదిరి వరకూ వర్గాలు బాహాబాహీగా పోరులో పాల్గొన్నవే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వర్గపోరును నియంత్రించలేకపోతున్నారు. అందుకే టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. -
టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిపై.. వైఎస్సార్సీపీ నాయకుడు ఫైర్!
అనంతపురం: తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి హెచ్చరించారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసే అర్హత, స్థాయి ఆయనకు లేవన్నారు. అనంతపురంలోని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీ పెట్టిన కణేకల్లు మండలం హనకనహాల్‌కు చెందిన శనగల వ్యాపారి కృష్ణారెడ్డికి ఎర్రిస్వామిరెడ్డి సహకారం ఉందంటూ కాలవ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ కుటుంబం ఎలాంటిదో ఒకసారి తమ సొంత గ్రామమైన హనకనహాల్‌కు వెళ్లి విచారించుకోవాలని హితవు పలికారు. కృష్ణారెడ్డి చేతిలో మోసపోయిన రైతుల పక్షాన నిలిచి తమ కుటుంబం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. మా గ్రామంలోని రైతుల కోసం మంత్రి, ఇతర పెద్దలను తన సోదరుడు బి. గురునాథరెడ్డి మాట్లాడి 1,400 సబ్సిడీ విత్తన శనగను ఇప్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పని చేసిన కాలవ వాస్తవలు తెలుసుకోకుండా పనికిమాలిన దగుల్బాజీలను పక్కన కూర్చోబెట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. మానసిక స్థితి సరిగాలేని ఎస్సీ వృద్ధ మహిళను బలత్కారం చేసిన కేసులో నిందితులుగా ఉన్న వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన కాలవ... రాజకీయాలకు అనర్హుడన్నారు. ‘విలేకరిగా ఉన్నప్పుడు నీ ఆస్తులు ఎంత? ఈ రోజు నీ ఆస్తులు ఎంత? ఎలా వచ్చాయి., విలువల్లేని నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఎలా?’ అని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై ఊరి దేవునికట్ట వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రామంలో కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ తమ కుటుంబాన్ని ఆదరిస్తారని, తాము కూడా అంతేస్థాయిలో అక్కడి ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో హనకనహాల్‌కు చెందిన పూజారి రామాంజినేయులు, గెలివే అనిల్‌కుమార్, జయరామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు అవినీతివల్లే ‘గుండ్లకమ్మ’కు నష్టం -
కాలవ భరత్ డ్రైవర్ వీరంగం.. కావాలనే చేశారా? తప్పతాగి వాహనం నడిపారా?
రాయదుర్గం: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కుమారుడు కాలవ భరత్ వాహన డ్రైవర్ వీరంగం సృష్టించాడు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్ మండలం సింగానహళ్లిలో ఈ నెల ఏడో తేదీ జరిగిన సంగమేశ్వర రథోత్సవానికి డ్రైవర్‌తో కలసి భరత్ హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో సింగానహళ్లి– శ్రీధరఘట్ట మార్గమధ్యంలోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కాన్వాయ్‌పైకి కాలవ భరత్ వాహనం దూసుకెళ్లింది. అప్రమత్తమైన పోలీస్ ఎస్కార్ట్ వాహన డ్రైవర్ వారి వేగం నుంచి తప్పించుకోగా, దాని వెనుకనే ఉన్న విప్ వాహనాన్ని ఢీకొనడంతో సైడ్ మిర్రర్ పగిలింది. సకాలంలో మేల్కొన్న విప్ వాహన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని పక్కకు నిలిపారు. దీంతో త్రుటిలోనే ఘోర ప్రమాదం తప్పిందని కాన్వాయ్‌లోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాలవ భరత్ వాహన డ్రైవర్ అంతటితో ఆగకుండా వెనుక ఉన్న మరో వాహనానికి అడ్డం వస్తూ దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. పోలీసులతో పాటు కాన్వాయ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు పరుగెత్తుకెళ్లి తలుపుతీసి చూడగా డ్రైవర్‌తో పాటు పక్కనే కాలవ భరత్ ఉండటాన్ని చూసి నివ్వెరపోయారు. అక్కడే ఉన్న బొమ్మనహాళ్ ఎస్ఐ శివ.. కాలవ భరత్ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. విప్ కాపు వదిలిపెట్టాలని సూచించారు. ఈ విషయం ఐదు రోజులుగా ఆనోట ఈ నోట నాని ఎట్టకేలకు బయటకు పొక్కడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కావాలనే ఇలా చేశారా? లేక తప్పతాగి వాహనం నడిపి ఉంటారా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంపై బొమ్మనహాళ్ ఎస్ఐ శివను సంప్రదించగా.. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. అవసరమైతే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామన్నారు. -
అభినందన మరచి అభాండమా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు తీరుపై విమర్శలు
సాక్షి, అనంతపురం: రాజకీయాలు ఎప్పుడూ హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజాశ్రేయస్సుకు, వ్యవస్థల పనితీరుకు దోహదపడాలి. నేతలు హుందాగా వ్యవహరించినప్పుడే అది సాధ్యపడుతుంది. కానీ ప్రతిపక్ష నేతలు రాజకీయ కట్టుబాట్లు పాటించడం లేదు. మరీ ముఖ్యంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యవహారశైలి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటోంది. నిక్కచ్చిగా పనిచేస్తూ జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులను అభినందించాల్సింది పోయి..వారికి రాజకీయ దురుద్దేశాలను అంటగడుతున్నారు. ఇటీవల జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి, ఆయుధాల సరఫరా ముఠాను అరెస్టు చేసిన విషయం విదితమే. దేశవ్యాప్త నెట్వర్క్ కల్గిన ఈ ముఠా ఆట కట్టించడానికి పోలీసులు ఎంతగానో శ్రమించారు. కానీ వారి శ్రమను వృథా చేసేలా కాలవ వ్యాఖ్యలు చేశారు. ముఠా సభ్యుల్లో ఒకరితో అధికార పార్టీ నేతలకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కేసు దర్యాప్తులో పోలీసులకు ఆటంకాలు సృష్టించేలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలను పోలీసు అధికారులు నేరుగా ఖండించాల్సిన పరిస్థితులను కల్పించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి..రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సమర్థతకు నిదర్శనాలెన్నో.. జిల్లా పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. ‘చాట్‌బాట్’ సేవల ద్వారా గతే ఏడాది ఆఖరు వరకు సుమారు రూ.7 కోట్లు విలువ చేసే 4,294 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 2021–22 మధ్యకాలంలో మత్తుపదార్థాలు, పేకాట, మట్కా, గుట్కా, బెట్టింగ్ తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఒక్క జూదాలపైనే 5,236 కేసులు నమోదు చేశారంటే పోలీసు వ్యవస్థ సమర్థతను అర్థం చేసుకోవచ్చు. నకిలీ ఎన్ఓసీలు, ఆధార్‌కార్డుల మార్ఫింగ్, రియల్ ఎస్టేట్ దందాల ముఠాల ఆట కట్టించారు. ఈ కేసుల్లో పలువుర్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. డీజీపీ నుంచి ప్రశంసలు ఆయుధాల సరఫరా ముఠా అరెస్టులో ‘అనంత’ పోలీసులు చూపిన తెగువను స్వయాన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశంసించారు. ఈ ముఠా సభ్యులకు నకిలీనోట్ల చెలామణి మొదలుకుని..గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, కిరాయి హత్యలు తదితర వాటితో సంబంధాలు ఉన్నాయి. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను గత డిసెంబరులో అరెస్టు చేసిన జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టి ఆయుధ నెట్వర్క్ మూలాలను గుర్తించారు. ముఠా సభ్యుల్లో కీలకమైన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌పాల్‌సింగ్ ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆయుధాల తయారీ కేంద్రాలపైనా దాడులు నిర్వహించారు. కొత్త ప్రాంతాల్లో, అది కూడా ఆయుధ ముఠా కేంద్రాలపై దాడులు చేయడమంటే ఆషామాషీ కాదు. అయినప్పటికీ జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి దాడులు చేసి..ఆయుధాలను, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించిన పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించగా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మాత్రం వారి శ్రమను తక్కువ చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు పోలీసు వర్గాలను విస్మయానికి, వేదనకు గురి చేశాయి. కాలవ తీరు హేయం జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి ఆయుధ ముఠాను పట్టుకున్నారు. వారి శ్రమను గుర్తించాల్సింది పోయి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అభాండాలు వేయడం హేయమైన చర్య. స్వార్థ రాజకీయాల కోసం కేసునే తప్పుదారి పట్టించేలా మాట్లాడటం పద్ధతిగా లేదు. – బీటీపీ గోవిందు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎక్కడా రాజీ పడలేదు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల ఆట కట్టించడానికి డీజీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుదీర్ఘంగా ఆపరేషన్ చేశాం. ఈ ముఠాలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్నా ధైర్యంగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తులో ఎక్కడా రాజీపడలేదు. ఈ కేసు విషయంలో అనవసరమైన ఆరోపణలు చేయడం తగదు. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ సంబంధం లేని అంశాలను తేవొద్దు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం. ఆయుధ ముఠాను పట్టుకోవడంలో మన పోలీసులు చూపిన ప్రతిభ రాష్ట్రానికే తలమానికం. డీజీపీ నుంచి రివార్డు అందుకోవడం గర్వంగా ఉంది. దర్యాప్తుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం మంచిపద్ధతి కాదు. – బి.శ్రీనివాసులు, డీఎస్పీ, కళ్యాణదుర్గం -
కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?
ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు కావడం కామనే. తెలుగుదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు ఎంపీగా పనిచేసిన ఆ నేతపై పచ్చ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారట. అందుకే ఈసారి టిక్కెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? కాల్వ కేరాఫ్ రామోజీ క్యాంపస్ కాలువ శ్రీనివాస్. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన తరచుగా మీడియాలో కనిపించేవారు. ఈనాడు జర్నలిస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలువ తొలిసారి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. టీడీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా.. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాల్వకు జేసీబీతో బ్రేక్ చంద్రబాబు కావాలని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కాలువ శ్రీనివాస్‌కు గతంలో మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే ప్రస్తుతం ఆయనకు జేసీబీ (జేసీ బ్రదర్స్) రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్‌కు రాయదుర్గం టిక్కెట్ దక్కదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కోసం రాయదుర్గం టిక్కెట్ త్యాగం చేసిన దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాయదుర్గం నియోజకవర్గంపై కన్నేసిన దీపక్ రెడ్డి.. చంద్రబాబు, నారాలోకేష్ లతో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. కార్యకర్తల విరాళాలు కాల్వ పాలు.! కాలువ శ్రీనివాస్ వైఖరిపై గత కొంత కాలంగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పార్టీ పదవులు ఇప్పిస్తానని పలువురు నేతల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కాలువ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఫండ్ అభ్యర్థులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి.. దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టుకున్నట్లు సమాచారం. కిం కర్తవ్యం.? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కాలువ శ్రీనివాస్ తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్. పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేతల ద్వారా కాలువ శ్రీనివాస్ లాబీయింగ్ ప్రారంభించినట్లు అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రచారం సాగుతోంది. -
బలంగా ‘బాదినా’ బుద్ధి రాలేదా?
రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకునే నీకు ధరల పట్ల కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. ‘పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు, చిత్రదుర్గం, బళ్లారికి నాతో కలిసి నీవు, నీ పచ్చ బ్యాచ్, మీడియాతో వస్తే అక్కడ మీరు చెప్పిన దుకాణాల్లో నిత్యావసర ధరలు విచారిద్దాం.. ఆ తర్వాత రాయదుర్గం, అనంతపురం వచ్చి ఇక్కడెలా ఉన్నాయో బేరీజు వేద్దాం. ధరల్లో వ్యత్యాసం కనిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అంటూ సవాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయాలని చూడొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే ‘చీపుర్లతో బాదుడు’ తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియా తోకలు కత్తిరిస్తాం.. ‘సొంత డబ్బుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న నాపై విమర్శలు చేసినా సహించా. దీన్ని అలుసుగా తీసుకుని నా కుటుంబంపై అక్కసు వెళ్లగక్కుతూ అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించేలా కుట్రలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబడ్దార్’ అంటూ కాలవకు విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘రెడ్‌క్రాస్ సంస్థకే వన్నె తెచ్చేలా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ఆపద సమయంలో ప్రజలకు రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే బాధ్యత సంస్థ చైర్‌పర్సన్‌గా కాపు భారతి తీసుకుంటే ప్రశంసించాల్సిందిపోయి.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిస్తావా..? ఇదా రాజకీయంలో నీవు నేర్చుకున్న నీతి’ అంటూ విరుచుకుపడ్డారు. అసభ్యకర పోస్టింగ్‌లపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాలవ శ్రీనివాసులు చీకటి బతుకు గురించి తెలిస్తే ప్రజలే ముఖాన ఉమ్మేస్తారని, పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచావని దుమ్మెత్తి పోశారు. కరోనా లాంటి కష్టకాలంలో రోడ్డు మీదకొచ్చి తాము ప్రజలకు సేవ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రశాంతంగా ఉండే రాయదుర్గాన్ని రావణకాష్టగా మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. మార్ఫింగ్ వీడియో పోస్టు చేయించి డ్రామాలా? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ ఆడిన డ్రామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయని విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ‘ఐ– టీడీపీ’ అనే ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా అర్ధరాత్రి మారి్ఫంగ్ వీడియో పోస్ట్ చేసి నీచమైన కుట్రకు ఒడిగట్టి.. ఏదో జరిగిపోయిదంటూ డ్రామాలు ఆడతారా అంటూ నిలదీశారు. వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ చెబుతున్నా.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరివి కానున్నాయన్నారు. ఇందుకు చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కనీ్వనర్ ముస్తాక్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహే‹Ù, మండల కనీ్వనర్ బోయ మంజునాథ, సీనియర్ నాయకుడు గొల్లపల్లి కాంతారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
Anantapur: కాలవా.. కంత్రీ వ్యవహారాలు మానుకో
సాక్షి, అనంతపురం: ‘రాయదుర్గం ప్రజల దీవెనలతో రాష్ట్రానికి మంత్రిగా చేశావ్. నీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. అదే మేము ప్రజలకు మంచి చేస్తుంటే సంతోషించాల్సింది పోయి కంత్రీలా వ్యవహరిస్తావా’ అంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన రాయదుర్గంలోని తన కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ ముస్తాక్, జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహేష్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాలవ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో కూర్చొని చెంచాగాళ్లయిన కొందరికి డైరెక్షన్ ఇస్తూ తమను అడ్డుకోవాలని కుట్ర పన్నడం, దాన్ని ఏదో జరిగిపోయినట్టు ఎల్లోమీడియా చిత్రీకరించడం, ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉన్నట్టు దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. డి.కొండాపురంలో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో మూడు రేషన్‌కార్డులుంటే రూ.2.40 లక్షలు, వడ్రవన్నూరులోనూ టీడీపీ నాయకుడి కుటుంబానికి రూ.2.50 లక్షల ప్రభుత్వ సహాయం అందిందని, అందుకు సంబంధించిన బ్రోచర్లను తాము అందించామని తెలిపారు. ఇలా లబ్ధి పొది కూడా పచ్చ నాయకులు విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చదవండి: (పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్) ఐటీ కట్టినోడికి అమ్మఒడి ఎలా ఇవ్వాలి? ‘రాయదుర్గం 8వ వార్డులో టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్తకు గత రెండేళ్లు అమ్మఒడి వచ్చింది. ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినందున జాబితాలో పేరు రాలేదు. అంతమాత్రాన ఉద్యోగులు, వలంటీర్ పట్ల రౌడీలా ప్రవర్తిస్తాడా? ఇంటి వద్దకెళ్లిన నా పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడమని డైరెక్షన్ ఇస్తావా కాలవా? అతనిపై వలంటీర్ ఫిర్యాదిస్తే నీవు గుంపును వెంటేసుకుని రచ్చ చేస్తావా? కర్ణాటక రాష్ట్రం రాంపురంలో బిందెల కంపెనీ పెట్టి ఆ ప్రాంత ప్రజలతో చీపుర్లతో కొట్టించుకున్న వ్యక్తికి నీలాంటి ద్రోహులు అండగా నిలవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నార’ని విప్ కాపు అన్నారు. ఇటీవల కణేకల్లులోనూ అప్పులు ఎగ్గొట్టిన టీడీపీ నాయకుడికి కాలవ అండగా నిలవడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కాలవ.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యభిచారిగా మారిన అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టకరమన్నారు. అప్పుడేం పీకావ్? ‘రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావ్? పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఎందుకివ్వలేదు? మీ అసమర్థత వల్లే ఈ రోజు మా ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాల్సి వచ్చింది. నీ హయాంలో టెంకాయ కొట్టిన రోడ్లను సైతం మేమే బాగుచేశాం. దమ్మూ ధైర్యముంటే మాతో పాటు గడప గడపకూ రా! నీవేం చేశావో.. మేమేం చేస్తున్నామో ప్రజలనే నేరుగా అడుగుదాం’ అని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. నీవొక అడుగు ముందుకేస్తే..తాను పదడుగులు ముందుకేస్తానని, తగ్గేదేలేదని అన్నారు. సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్లు దేవరాజు, పద్మ, శారద, గోవిందరాజులు, ఫకృద్దీన్, కృష్ణమూర్తి, పొరాళ్ల శివ, వైజాక్ రిబ్కా, గుమ్మఘట్ట మండల కన్వీనర్ బోయ మంజునాథ, ఎస్సీసెల్ రాష్ట్రకార్యదర్శి గోవిందు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మార్కెట్‌యార్డు డైరెక్టర్ నారాయణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయి?
కణేకల్లు(అనంతపురం): భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ)కు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు టీడీపీ హయాంలో మంజూరైన రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజలకు తెలపాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాయదుర్గం మార్కెట్‌యార్డు చైర్పర్సన్ ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యులు డి.పద్మావతి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ లీలావతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డితో కలిసి కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బీటీపీ కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు కాలవ తెచ్చిన జీఓ అంతా ఉత్తిదేనన్నారు. జగన్‌తోనే బీటీపీకి కృష్ణా జలాలు సాధ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయదుర్గానికి వచ్చిన సమయంలో బీటీపీకి కృష్ణా జలాలు తీసుకొస్తామని మాట ఇచ్చారని, త్వరలోనే పనులు ప్రారంభించి కృష్ణా జలాలు తెచ్చితీరుతామన్నారు. కాలవా.. ఇవి నిజం కాదా..? బీటీపీపై మట్టి రోడ్డు వేసి రూ.50 లక్షలు, పైలాన్ కట్టి రూ.80 లక్షలు మీరు దోచేయడం నిజం కాదా..? నాగేపల్లి గ్రామంలో మారుతి వనం పేరుతో అనుచరులతో కలిసి రూ.కోట్లు పందికొక్కుల్లా మెక్కడం వాస్తవం కాదా..? కులానికో కల్యాణ మంటపమంటూ స్థలం కేటాయింపులపై ఉత్తుత్తి కాగితాలిచ్చి కుల రాజకీయాలు చేసింది నువ్వు కాదా...? 2019లో ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో ఓబుళాపురం గ్రామంలో తాగునీటి పథకం పనికి భూమి పూజ చేసి ప్రజలను వంచించిన ఘనత నీది కాదా..? రూ.3,500 కోట్లతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్న కాలవ ఆ నిధులతో ఏయే పనులు చేశారో చెప్పాలని కాపు నిలదీశారు. మీ జాతకాలు బయటపెడతా అసెంబ్లీ సమావేశాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలో ‘నీరు–చెట్టు’ పథకం పేరుతో కాలవ, అతని అనుచరులు ఎవరెవరు ఎంత దోచేశారో.. వారి జాతకాలను బయట పెడతానని కాపు పేర్కొన్నారు. కణేకల్లు చెరువు పేరుతో రూ.2 కోట్లు, కళేకుర్తి చెరువు పూడికతీత పేరుతో భారీగా నిధులు దోచేశారన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు పైనేటి తిమ్మప్పచౌదరి, మాజీ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, కణేకల్లు పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ టీ.కేశవరెడ్డి, మాజీ సర్పంచు పాటిల్ చెన్నకేశవరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ నేడు వర్గవిభేదాలు, అసమ్మతులు, అసంతృప్తులకు పెట్టనికోట. నియోజకవర్గ స్థాయి నాయకులు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సవాళ్లు విసురుకుంటుంటే.. ఉన్న కొద్దిమంది కార్యకర్తలూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సైతం అండగా లేకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నాయకులంతా సమావేశమయ్యారు. ఇది సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయింది. దీంతో పల్లె వారిని బుజ్జగించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిటాల శ్రీరాం వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ధర్మవరంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మరో పార్టీలోకి వెళ్లారు. దీంతో పరిటాల శ్రీరాంను ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. అయితే.. వరదాపురం సూరి తిరిగి పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలు రావడంతో శ్రీరాం ఫైరయ్యారు. ‘పార్టీలోకి ఎవరొచ్చినా కండువా నేనే వేయాలి. పదవులూ నేనే ఇవ్వాలి. అయినా చెంచాలకు సీట్లొస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీలోని పరిటాల వ్యతిరేకులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక హిందూపురంలో నెగ్గిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు. ఆయన పేరు చెప్పి మరో వ్యక్తి పెత్తనం చెలాయిస్తుండటంతో కిందిస్థాయి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. చదవండి: (పారిశ్రామిక విప్లవం) కాలవకు సెగ.. రాయదుర్గం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు సొంత పార్టీ శ్రేణుల నుంచే సెగ తగులుతోంది. మంత్రి ఉన్నప్పుడు చేసిందేమీ లేదంటూ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని వారు వాపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గీయుల మధ్య పోరు నడుస్తోంది. ఏవర్గంలో ఉండాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు. అనంతపురం అర్బన్‌లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభాకర్ చౌదరిపై అసమ్మతులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో భారీ ఓటమి తర్వాత బీకే పార్థసారథి పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన్ను స్వయాన చంద్రబాబు పిలిపించుకుని గట్టిగా మందలించిన విషయం తెలిసిందే. శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. చదవండి: (సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ) గౌరవ సభలా? విందు భోజనాలా? గౌరవ సభల పేరిట టీడీపీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభాసుపాలవుతున్నాయి. శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి మాంసాహారం వడ్డిస్తున్న తీరు విందు భోజనాలను తలపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనం రాకపోవడంతో డబ్బులిచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఈ సభలు ఎందుకు పెడుతున్నారో వాటికి వచ్చే వారికి కూడా తెలియడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
రచ్చకెక్కిన విభేదాలు: కాల్వ శ్రీనివాస్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్‌ల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓడిపోవడం ఖాయమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సూచించారు. కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఓటమి భయంతో జేసీ కంటతడి..!) తనకు, కార్యకర్తలకు ఏ మాత్రం సమాచారం లేకుండానే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ కనుసన్నల్లోనే ఇలా జరుగుతుందన్నారు. కాల్వ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలానే జరిగితే త్వరలోనే కార్యకర్తలు తామే స్వయంగా మీటింగ్ పెట్టుకుంటారని జేసీ హెచ్చరించారు. పెద్దవాళ్లను దృష్టిలో పెట్టుకుని తాను ఇలా మాట్లాడటం లేదని.. తమను పలకరించిన వారే లేరని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను సరిగా చూసుకోవడం లేదు.. టీడీపీ నేతలను కార్యకర్తలు నమ్మటంలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చదవండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ -
మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): అనుమతుల్లేకుండా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటూ ఉద్దేహాళ్ నుంచి బొమ్మనహాళ్‌కు పాదయాత్ర చేపట్టారు. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అనుచరులతో కలిసి పాదయాత్రగా ఉప్పరహాళ్ క్రాస్ వద్దకు చేరుకున్న కాలవను కళ్యాణ దుర్గం ఇన్చార్జ్ డీఎస్పీ ఆంథోనప్ప, సీఐ రాజా, ఎస్ఐలు రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. విషయం ఏదైనా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేయాలని సూచించారు. దీనిపై హైడ్రామాకు కాలవ తెరలేపారు. ఇష్టం వచ్చిన రీతిలో పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని, తమను ఎవరూ అడ్డుకోలేరంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో చివరకు అరెస్ట్ చేసి, కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, పాదయాత్రకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తమనుంచి ఎలాంటి అనుమ తులు తీసుకోలేదని డీఎస్పీ ఆంథోనప్ప తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం బొమ్మనహాళ్ ఎస్ఐ రమణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినతిపత్రాలు అందజేశారని, బొమ్మనహాళ్ మండలంలో ఇందుకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసులును అరెస్ట్ చేసి, సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ -
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు గురువారం ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది మార్చి నెలలో రాయదుర్గంలో ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కాగా గతంలో తన అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులను కాల్వ శ్రీనివాస్ బెదిరించిన విషయం తెలిసిందే. -
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లకు స్థానిక ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. పరిటాల సొంత మండలం రామగిరిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పాగా వేయడంతో 26 ఏళ్ల పరిటాల ఆధిపత్యానికి చెక్ పడింది. మండలంలో 7 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. రామగిరి, పేరూరు, కుంటిమద్ది, పోలేపల్లి, కొండాపురం, గంతిమర్రి, చెర్లోపల్లి, ఎంసీ పల్లి పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయతీల్లో 63 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. రాయదుర్గం బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి కాల్వకు ఘోర పరాభవం ఎదురయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలో 87 పంచాయతీ లకు గాను 70 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో పయ్యావుల పట్టుకోల్పోయారు. బెలుగుప్పలోని 19 పంచాయతీల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్‌నాయుడు సొంత పంచాయతీ అంకంపల్లిలో టీడీపీ ఓటమి పాలైంది. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) టీడీపీ కంచుకోటలు బద్దలు -
‘కాలవ’ డైరెక్షన్.. ఖాకీ దందా
డీ.హీరేహాళ్ మండలంలోని కూడ్లూరు గ్రామ సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ పోలీసు అధికారి.. పక్కనే ఉన్న మరో 20 సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నాడు. తన మామ, టీడీపీ నాయకుడి అండతో బినామీ హరిజన హనుమంతప్ప పేరిట 3.79 ఎకరాలకు పట్టా చేయించుకున్నాడు. ఈ భూమిలో ఇసుక లేకపోయినా రీచ్‌కు అనుమతి పొంది.. పక్కనే ఉన్న దళితుల శ్మశానం, వంక పరంబోకులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. సదరు పోలీసు అధికారి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ దందా వెనుక ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం. సాక్షి, రాయదుర్గం: సహజ వనరులను దోచుకోవడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో రూ.కోట్లు సంపాదించిన నేతలు.. ఇప్పుడూ అదేబాటలో వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు దళితులను అడ్డుపెట్టుకుని ఇసుక దందా సాగిస్తున్నారు. అక్రమం బయటపడితే తమ చేతికి మట్టి అంటుకోకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలో ఇసుక రీచ్‌కు అనుమతి పొంది సమీప ప్రాంతాల్లోని వంక పరంబోకును తోడేస్తున్నారు. ఈ దందా బయటపడటంతో టీడీపీ నేతలు దళిత రైతును ముందు పెట్టి నాటకం ఆడించడం విమర్శలకు తావిస్తోంది. (మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!) ఖాకీ అల్లుడు.. బినామీల పర్వం రాయదుర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకున్న ఓ పోలీసు అధికారి తన మామ పలుకుబడి ఉపయోగించి డీ.హీరేహాళ్‌లో పోస్టింగ్ వేయించుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు ఇక్కడే పనిచేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా.. తన సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి ఆశీస్సులు పొంది భారీగా సంపాదించాడు. అనతి కాలంలోనే సుమారు 80 ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేసి బినామీల పేరిట పట్టాలు చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ మంత్రి అండతో తన భూముల పక్కనే ఉన్న అసైన్డ్ భూములను కూడా కలిపేసుకుని పట్టాలు పొందాడు. ఇలా డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమిని ఇతరుల ద్వారా కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న మరో 20 సెంట్ల అసైన్డ్ భూమిని ఆక్రమించి మొత్తంగా 3.79 ఎకరాలకు తన మామ నమ్మిన బంటుగా ఉన్న హరిజన హనుమంతప్ప పేరిట పట్టా చేయించాడు. ఇసుక లేకపోయినా రీచ్‌కు అనుమతి తన బినామీ హరిజన హనుమంతప్ప పేరిట చేయించిన భూమిలో ఇసుక లేకపోయినప్పటికీ సదరు పోలీసు అధికారి, ఆయన మామ రీచ్ కోసం మంత్రాంగం నడిపించారు. కొందరు అధికారుల అండతో ఇసుక రీచ్‌కు అనుమతులు పొందారు. టన్ను ఇసుకకు రూ.60 చెల్లించేలా తొలుత అధికారులతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని సాకుగా చూపి టన్ను ఇసుకకు రూ.100 ఇచ్చేలా అనుమతి పొందారు. అలాగే ఇసుక రవాణా కాంట్రాక్టర్‌ను సైతం తమ వారినే నియమించుకుని ఇసుక దందా ప్రారంభించారు. (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు) శ్మశానంలో తవ్వకాలు.. పట్టాభూమిలో ఇసుక లేకపోవడంతో పక్కనే ఉన్న దళితుల శ్మశానం, ఆ పక్కనే ఉన్న చిన్న హగరిలోని పరీవాహకంలోని 14 ఎకరాల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేసి విక్రయించుకున్నారు. ఈ క్రమంలో 4 అస్థిపంజరాలు బయట పడినా గుట్టుగా వేరే ప్రాంతంలో పూడ్చినట్లు గ్రామానికి చెందిన దళితులు చెబుతున్నారు. ఇసుక రవాణా కాంట్రాక్టర్ కూడా తమవాడే కావడంతో ఇసుక అక్రమ దందాను నిరాటంకంగా కొనసాగించారు. అక్రమం బయట పడటంతో కాలవ ఎదురుదాడి డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు ఇసుక రీచ్ అక్రమాలు బయటపడటంతో కాలవ బయటకొచ్చారు. ఈ దందా వెనుక ఉన్న తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధిపై ఎదురుదాడికి దిగారు. తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, అతని అల్లుడు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే విప్ కాపు రామచంద్రారెడ్డి దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు తీగలాగుతున్నారు. -
ఆగని టీడీపీ ఆగడాలు
తెలుగుదేశం పాలనలో ప్రజా సంక్షేమం విస్మరించి అక్రమార్జనపైనే దృష్టిసారించిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి పట్టం కట్టారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన కాలవ తన అనుచరులను, టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి ఉసిగొల్పుతూ గొడవలు సృష్టిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టి దాడులకు ఎగదోసి పైశాచికానందం పొందుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. సాక్షి, రాయదుర్గం: ప్రశాంతతకు నిలయమైన రాయదుర్గం ప్రాంతంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అలజడి రేపుతున్నారు. పల్లెల్లో ఏదో ఒక గొడవ సృష్టించి తర్వాత తాను నియోజకవర్గంలో అడుగుపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచింది. ప్రజా సంక్షేమ పథకాలతో సాఫీగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే కాలవ శ్రీనివాసులు పల్లెల్లో అల్లర్లు, గొడవలు సృష్టించి వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసేందుకు పడుతున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. చదవండి: విజయనగరం జిల్లాకు రాజావారి రాజద్రోహం ►గత ఏడాది జూలై 15న రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతరాయుడుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జాఫర్ దాడి చేసి గాయపరిచాడు. ►గుమ్మగట్ట మండలం బేలోడులో మొహర్రం పండుగ రోజున చోటుచేసుకున్న చిన్నపాటి గొడవను పెద్దది కాకుండా సర్దిచెప్పి సద్దుమణిగించాల్సిన ప్రతిపక్ష పారీ్టకి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పచ్చని గ్రామంలో కుల చిచ్చు రగిల్చారు. గ్రామంలో జరిగిన సంఘటనను రాజకీ యం చేసి రాయదుర్గం ఆస్పత్రి వద్ద సెపె్టంబర్ 12న ధర్నా చేసి, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో అటుగా వస్తున్న దళితులతో వారు వాగ్వాదానికి దిగి రాళ్ల దాడికి తెగబడ్డారు. ►కణేకల్లు మండలం కళేకుర్తిలో నవంబర్ 27న గ్రామ వలంటీర్ హరిజన మహేంద్రపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కులం పేరుతో దూషించి వలంటీర్పైన, అడ్డు వచ్చిన అతడి తల్లి మరియమ్మపైనా దాడి చేసి గాయపరిచారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన గ్రామ వలంటీర్ హరిజన మహేంద్ర, తల్లి మరియమ్మ (ఫైల్) ►గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్టు గ్రామానికి చెందిన జయరామిరెడ్డి అనే టీడీపీ కార్యకర్త నవంబర్ 11న తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రామాకు తెరలేపాడు. తనకిచ్చిన నివేశన స్థల పట్టాకు అధికారులు స్థలం ఎక్కడుందో చూపడం లేదని ఖాళీ పురుగుమందు బాటిల్లోకి నీరు నింపి దాన్ని తాగగా, అతని భార్య పల్లవి వీడియో తీసి డ్రామా రక్తి కట్టించింది. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఘటన జరగడానికి గంట ముందే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్ చేసి ‘తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లండి.. జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ చెప్పడం వారి కుట్ర రాజకీయాలను బయటపెట్టింది. ►గుమ్మగట్ట మండలం భూపసముద్రం ఉన్నతపాఠశాల కమిటీ చైర్మన్ శ్రీధర్‌పై ఇదే గ్రామానికి చెందిన తమ్మణ్ణ కుమారుడు రాజ అనే టీడీపీ నాయకుడు ఈ నెల నాలుగో తేదీన దాడి చేసి గాయపరిచాడు. టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుని ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎలా మద్దతు పలుకుతావంటూ రాయితో దాడి చేశాడు. ►అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దని వివిధ పారీ్టల నాయకులతో తమకు అనుకూలంగా మలచుకోవడానికి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో ఈ నెల నాలుగో తేదీన వాసవీ కల్యాణమంటపంలో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు అడ్డుకోవడంతో కాలవ శ్రీనివాసులు రహదారిపైనే సమావేశం నిర్వహించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు నన్ను రెచ్చగొట్టవద్దంటూ పోలీసులనే భయపెట్టడానికి ప్రయత్నించాడు. -
‘టీడీపీ నాయకులకు మతి భ్రమించింది’
సాక్షి, అనంతపురం: రాజకీయ లబ్ధి కోసమే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటమి అనంతరం టీడీపీ నాయకులకు మతి భ్రమించిందన్నారు. ప్రభుత్వ పాలనను విమర్శించడమే ధ్యేయంగా పని పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల రౌడీయిజం రోజురోజుకు పెరుగుతుందని.. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ శ్రీనివాసులు మాటలు నమ్మి.. ప్రజలు తమ జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. టీడీపీ కార్యకర్తలతో మాకు ఎలాంటి విబేధాలు లేవని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
పెన్నా 'కాలవ'
మంత్రి కాలవ శ్రీనివాసులు.. రాయదుర్గం నియోజవర్గానికి ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ ఐదేళ్లూ ఇసుక అక్రమ రవాణాతో రూ.కోట్లకు పడగలెత్తారనే చర్చ ఉంది. ఇప్పటికే అక్కడి వేదవతి హగరి నది రూపు రేఖలు కోల్పోయింది. ప్రస్తుతం పామిడిలోని పెన్నానది పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పేరుతో ఈ ప్రాంతం నుంచి ఇసుకను భారీ స్థాయిలో పెద్ద పెద్ద నగరాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి అండ చూసుకుని స్థానిక టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణాతో స్థానిక నేతలే రూ.కోట్లు వెనకేసుకుంటుంటే.. ఇక మంత్రిగారి అక్రమార్జన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం, పామిడి :పామిడి పెన్నానది ఒకప్పుడు జీవకళతో గలగలపారేది. నిండైన ఇసుక మేటలు.. పాయలుపాయలుగా పారుతున్న నీటితో చూడ ముచ్చటేసేది. 30 సంవత్సరాల క్రితం వరకూ పామిడి చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల మేర ఎక్కడ తవ్వినా 15 అడుగుల్లోపు సమృద్ధిగా నీరు లభ్యమయ్యేది. బంగారు పంటలు పండేవి. ఏనాడూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడింది లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టీడీపీ నేతలు అడ్డగోలుగా ఇసుక తరలిస్తుండటంతో పామిడి పెన్నానది నామరూపాల్లేకుండా పోయింది. దురాక్రమణలతో నది కాస్త కాలవగా మారిపోయింది. ఐఓసీ పేరుతో కొంత కాలం.. గతంలో పామిడి పెన్నానది నుంచి గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఇసుకను భారీగా తరలించారు. ఐఓసీ పేరుతో అక్రమ రవాణా కొనసాగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకూ ఇక్కడి నుంచి ఇసుక ఎగుమతులు చేసి రూ.కోట్లలో లబ్ధి పొందారు. ఇసుక తవ్వకాలతో పామిడి బైపాస్, రైల్వే వంతెనలకు ముప్పు పొంచి ఉంది. వంతెనలకు దిగువన ఇసుక కోసం జేసీబీలతో తోడేయడం వల్ల పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో వంతెనలు కూలిపోయే ప్రమాదముందంటూ స్థానికులు, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంటూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తాత్కాలికంగా ఇసుక తరలింపులకు అప్పట్లో టీడీపీ నేతలు స్వస్తి పలికారు. కాలవ కన్ను పడి.. తాజాగా పామిడి పెన్నానది నుంచి భారీగా ఇసుక తరలింపులు మొదలయ్యాయి. జేసీబీలను ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లూ టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రోజూ వందకు పైగా టిప్పర్లలో ఇసుక తరలిపోతోంది. గుంతకల్లు పరిధిలో టిడ్నో కంపెనీ చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు ఇసుకతరలించుకునేందుకు సాక్షాత్తూ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఓ సిఫారసు పత్రాన్ని రవాణాదారులు చూపిస్తూ అక్రమంగా ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంపాదనలో సింహభాగం మంత్రి వాటాగా తెలుస్తోంది. నిర్మాణాలు చేపట్టకనే.. గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు అంటూ తరలిస్తున్న ఇసుక వాస్తవానికి అక్కడకు చేరడం లేదు. గుంతకల్లు నుంచి 15 కిలోమీటర్లు దాటగానే జిల్లా సరిహద్దులు దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తొమ్మిది టిప్పర్లకు అనుమతులు ఉన్నాయంటూ 40 టిప్పర్లతో రేయింబవళ్లూ వందకు పైగా ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పైగా నిబంధనలకు వ్యతిరేకంగా పెన్నానదిలో జేసీబీలను ఉంచి ఇసుకను తోడేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి వంటి నగరాలకు ఇసుకను తరలిస్తే టిప్పర్‌కు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఒక రోజుకు వంద టిప్పర్లకు రూ.కోటి వరకు దోపిడీ చేస్తున్నారు. పోలీసులకూ వాటా ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకోకుండా ఉండేందుకు పోలీసులను తెలుగు తమ్ముళ్లు ప్రభావితం చేశారు. భారీ మొత్తంలో పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ తమ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇందులో విజిలెన్స్ శాఖకూ వాటాలు ఉన్నట్లు సమాచారం. పట్టపగలే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇసుక లోడుతో టిప్పర్లు వెళుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. సబ్‌సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలి ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణలతో ప్రస్తుతం పెన్నానది ఉనికి కోల్పోయింది. 200 అడుగుల లోతున తవ్వినా నీరు లభ్యం కావడం లేదు. దీంతో పామిడిలోనే నీటి ఎద్దడి మొదలైంది. నాలుగు రోజులకొకసారి కొళాయిల ద్వారా నీరు అందితే గొప్ప విషయమే. ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణలు అరికట్టాలంటే పామిడి వద్ద పెన్నానదిపై సబ్‌సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలి. – బసవరెడ్డి, పామిడి -
గోరంతను కొండంత చేసి..
ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు శాంతికాముకులనడంలో సందేహం లేదు. అయితే మంత్రి కాలవ శ్రీనివాసులు మాత్రం ఇక్కడి ప్రజలను ఇంకో విధంగా భావిస్తున్నాడు. ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించరు.. ఏమి చెప్పినా వెర్రివెంగళప్పల్లా నమ్ముతారు అని అనుకున్నాడు. అందుకే పట్టణంలో నాలుగు కి.మీ రోడ్డు విస్తరణకు గాను 1.2 కి.మీ, మాత్రం అదీ అసంపూర్తిగా పనులు చేసి, ప్రచారంలో మాత్రం రాయదుర్గం రోడ్లు వెలిగిపోతున్నాయి అని గొప్పలు చెబుతున్నాడు. మాటలకు, పనులకు పొంతన లేకుండా పోతోంది. సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలో నాలుగు వరుసల రోడ్ల విస్తరణ, విద్యుత్ దీపాల అమరిక కోసం 2014లో నిధులు మంజూరయ్యాయి. పాలశీతలీకరణ కేంద్రం నుంచి మొలకాల్మూరు రోడ్డు బైపాస్ రోడ్డుకు లింక్ కలిపే 4 కి.మీ రోడ్డు పనులు 2015లో ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లు గడిచినా మంత్రి నియోజకవర్గంలోని ప్రధాన మున్సిపాల్టీలో 4 కి.మీ రోడ్డు కూడా వేయని దుస్థితి. నాలుగేళ్లుగా ముక్కి, మూలిగి 1.2 కి.మీ సీసీ రోడ్డు, వంద మీటర్ల బీటీ రోడ్డు మాత్రం వేశారు. వినాయక సర్కిల్లో కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రధానంగా ప్రమాదాలు జరిగే తేరు మలుపు వద్ద రోడ్డు పనులు ఆగిపోయాయి. అలాగే వేసిన 1.2 కి.మీ. ప్రధాన సీసీ రోడ్డు నుంచి వీధుల్లోకి వెళ్లే రోడ్లకు కూడా లింక్ కలుపకుండా పనులు ఆగిపోయినా మంత్రికి మాత్రం ఇలాంటివి అగుపడవు. ప్రజలు , వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలు అసలు కనబడవు. వీటి గురించి మంత్రి గాని, ఆయన అనుచరగణం గాని కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు. 2 కణేకల్లు రోడ్డును ఫారెస్ట్‌లో 3 కి.మీలు, పూలచెర్ల రోడ్డు నుండి నల్లంపల్లి సమీపం వరకు 1 కి.మీ రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోలయ్య తోట నుంచి క్రాసింగ్ వరకు 2 కి.మీలు అక్కడి నుంచి కణేకల్లు వరకు 8 కి.మీ డబుల్ రోడ్డు చేయించలేని అసమర్థుడు మంత్రి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవి లేని ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలే నయమని, పూర్తి స్థాయిలో ఆయా పట్టణాల్లో రోడ్లు వేశారని దుర్గం ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రిగా ఉంటూ తన అభివృద్ధి మాత్రమే చూసుకున్న కాలవ ‘దుర్గం’ అభివృద్దికి ఏమాత్రం చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో జరిగిన రోడ్డు విస్తరణలో రోడ్డు మధ్య అమర్చిన వీధి దీపాలు కూడా ఒకరోజు వెలిగితే రెండురోజులు వెలగని పరిస్థితి నెలకొందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
నియోజకవర్గాన్ని మంత్రి కాలవ భ్రష్టు పట్టించారు
ఎన్నికలకు ముందు మంత్రి కాలవ శ్రీనివాసులుకు మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా మెట్టు రాకను స్వాగతించారు. ఇప్పటికే మంత్రి కాలవపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాలవకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదని, ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఓవైపు మెట్టు, మరోవైపు దీపక్‌రెడ్డి దూరం కావడంతో టీడీపీ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇంకోవైపు మెట్టు చేరికతో వైఎస్సార్సీపీకి అదనపు బలం చేకూరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో కాలవకు ఇక్కట్లు తప్పేలా లేవని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో బాగా వెనుకబడిన ప్రాంతం. బొమ్మనహాల్ ప్రాంతం పూర్తి ఎడారిగా మారే భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవంలోకి వెళితే నియోజకవర్గానికి ఈయన స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గ వాసి. గత ఎన్నికల్లో మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి టిక్కెట్ ఆశించారు. చివరి నిమిషంలో జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రావడంతో జేసీ దివాకర్‌రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఖరారు చేసి, కాలవను రాయదుర్గం అసెంబ్లీకి పంపారు. 1999లో ఎంపీగా పోటీ చేసినా, పార్టీ గాలిలో గెలవడం మినహా ఆయనకు రాయదుర్గంలో ప్రత్యేకంగా వర్గమంటూ లేదు. ఈక్రమంలో మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి సహకారంతో ఎన్నికల్లో తలపడ్డారు. మెట్టు గోవిందరెడ్డికి నియోజకవర్గంలో సౌమ్యుడిగా మంచి పేరుంది. అవినీతికి దూరంగా ఉంటారని, కష్టపడి సంపాదించిన సొమ్ము మినహా రాజకీయాలలో అవినీతికి పాల్పడలేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. 2004–09 వరకూ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ కూడా అప్పటి వరకు మెట్టు చేతుల్లోనే ఉంది. దీంతో గత ఎన్నికల్లో కాలవకు తలలో నాలుకలా మెట్టు పనిచేశారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తర్వాత మెట్టును పూర్తిగా దూరం పెట్టిన కాలవ ఎన్నికల్లో విజయం తర్వాత చీఫ్ విప్‌గా కాలవ ఎంపికయ్యారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని యోచించారు. దీంతో అప్పటి వరకూ తనకు సహకరించిన మెట్టు గోవిందరెడ్డిని పూర్తిగా దూరం పెట్టారు. టీడీపీ శ్రేణులు ఎవ్వరూ మెట్టు వద్దకు వెళ్లకూడదని, వెళితే తాను సహకరించననే సంకేతం పంపారు. ఈ పరిణామాలతో మెట్టు కలత చెందారు. చివరకు ఎమ్మెల్సీగా 2017లో గడువు ముగిసిన తర్వాత చంద్రబాబు తిరిగి మెట్టును కొనసాగించాలనే యోచన చేసినా, కాలవనే అడ్డుపడ్డారనే చర్చ కొనసాగింది. దీంతో అప్పటి నుంచి కాలవకు వ్యతిరేకంగా మెట్టు పావులు కదుపుతూ వచ్చారు. మరోవైపు దీపక్‌రెడ్డి కూడా కాలవపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కాలవ చేసిన అవినీతిపై కూడా ప్రకటనలు చేశారు. కాలవ కూడా ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన అవినీతి చిట్టాను చంద్రబాబు ముందుంచి, నియోజకవర్గంలో తనతో పాటు మొదటి నుంచి టీడీపీ కోసం శ్రమించిన వారిని కాలవ నిర్లక్ష్యం చేసిన తీరును మెట్టు వివరించారు. దీపక్‌రెడ్డి కూడా కాలవకు వ్యతిరేకంగానే గళం విప్పారు. నియోజకవర్గాన్ని విస్మరించిన తీరును కూడా బయటపెట్టారు. పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో విశేష స్పందన ఉందని, ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గాలి వీస్తోందని, ఈక్రమంలో అతనికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే పార్టీ వీడుతానని మెట్టు తేల్చి చెప్పారు. టీడీపీ కీలక నేతలైన మెట్టు, దీపక్‌రెడ్డి మాటలతో పాటు మెజార్టీ టీడీపీ శ్రేణుల అభిప్రాయం కాదని, కాలవకే టిక్కెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మెట్టు రాజీనామాతో టీడీపీకి ఇక్కట్లే చంద్రబాబుకు చెప్పినా తన మాటను పట్టించుకోలేదని మెట్టుగోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా ప్రకటన చేసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మెట్టు నివాసానికి వెళ్లి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే వైఎస్సార్సీపీలో మెట్టు చేరనున్నారు. ఇప్పటికీ ‘దుర్గం’లో కాలవకు బలమైన వర్గం లేదు. గత ఎన్నికల్లో పార్టీ గాలిలో స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. మెట్టు రాజీనామాతో టీడీపీలో బలమైన వర్గం దూరమైనట్లే. వీరంతా వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. మంత్రిగా ఉన్న కాలవ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు. ఇంకోవైపు దీపక్‌రెడ్డి కాలవపై ఉరుముతున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే ఎన్నికలకు ముందు టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలినట్లే. -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా
-
ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతా
అనంతపురం, రాయదుర్గం : పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను మంత్రి కాలవ శ్రీనివాసులు అవమానించారు..దాడులు చేయించారు..అక్రమంగా కేసులు పెట్టించారు..అందుకే వారంతా ఆయనపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. టీడీపీ టిక్కెట్ కాలవకే కేటాయించడంతో ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు రాయదుర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా...మంత్రి కాలవను ఓడించి తీరుతా’’ అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన ‘చేయూత’ ట్రస్ట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి కాలవ శ్రీనివాసులు తనకు కావాల్సిన వారిని మాత్రమే అమరావతికి తీసుకెళ్లి నియోజకవర్గ రివ్యూలో తనకు అనుకూలంగా చెప్పించుకున్నాడన్నారు. టీడీపీలోనే మంత్రి కాలవపై 20 నుంచి 30 వేల మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే దీపక్ రెడ్డి వర్గం అనే భావనతో నియోజకవర్గంలో ఎంతో మంది టీæడీపీ నాయకులపై మంత్రి కాలవ అక్రమ కేసులు బనాయించారని, దాడులు చేయించారని ఆరోపించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న తనపై, తన కార్యకర్తలపై దాడులు చేసిన వైఎస్సార్సీపీ నాయకుడైన పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత మంత్రి కాలవ టీడీపీ వారికి ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోశారు. మంత్రి నియోజకవర్గంలోని టీడీపీలో వర్గాలు ఏర్పాటు చేస్తున్నాడని, తన కోటరీలో దొంగలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు. అందువల్లే కార్యకర్తల నిర్ణయం మేరకు ఇండింపెండ్ంట్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. రెండురోజుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం వెల్లడిస్తానన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పసుపులేటి రామాంజనేయులు, మహాబలి, ఆదెప్ప, మారెన్న , చంద్రశేఖర్ రెడ్డి, ఓబనాయక, జయరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై కాలవ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి కాలవ శ్రీనివాసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. డీ హీరేహాల్ మండలం మురిడిలో సర్వే పేరుతో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆ సర్వే బృందం గ్రామంలోని వైఎస్సార్ సీపీ ఓటర్ల వివరాలు సేకరించింది. ఈ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి ముగ్గురు అనుమానితులను పోలీసులకు అప్పగించారు. అయితే కాలవ శ్రీనివాసులు ఒత్తిడితో రాయదుర్గం సీఐ చలపతిరావు ఈ కేసును తారుమారు చేశారు. మంత్రి ఆదేశాలతో రామచంద్రారెడ్డితో పాటు 11 మందిపై సీఐ అక్రమ కేసులు నమోదు చేశారు. సీఐ తీరుపై రామచంద్రారెడ్డితో వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. అనుమానితులను అప్పగిస్తే.. పోలీసులు తమపై కేసులు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు దొంగ సర్వేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. రాయదుర్గం పోలీసులు కాల్వ శ్రీనివాసులుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘కాలవ’ అండతోనే తమ్ముళ్ల అరాచకాలు
రాయదుర్గం: ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయని, మంత్రి కాలవ శ్రీనివాసులు అండతోనే వారు పేట్రేగిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గూండాలు చేస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోయిందన్నారు. ఇందుకు ఉదాహరణలు చింతమనేని, కేశినేని నాని లాంటివారు అహంకారంతో ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడమే అన్నారు. ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్న కాలవ రాష్ట్ర మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులుకు అధికారులపై చేసిన దాడులు కనబడలేదా అని కాపు ప్రశ్నించారు. జిల్లాలోని తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏమి జరుగుతుందో కాలవకు కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. పట్టపగలే తహసీల్దార్ కార్యాలయంతో తెలుగు తమ్ముళ్లు చేసిన హత్యలు, ఓ మహిళను విచక్షణారహితంగా అధికార పార్టీకి చెందిన ఓ ఉన్మాది చెప్పుకాలితో తన్నినా ఎందుకు స్పందించలేదని ఆగ్రహించారు. చీఫ్‌విప్‌గా, మంత్రిగా భిక్ష పెట్టిన రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్నో అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తూ తెలుగుతమ్ముళ్లు రాక్షసుల్లా వ్యవహరించినా మంత్రి నోరుమెదపకపోవడం విచారకరమన్నారు. పల్లేపల్లిలో ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచింది టీడీపీ వారు కాదా? బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నది మీరు కాదా అని మంత్రిని ప్ర శ్నించారు. అధికార పార్టీకి చెందిన వాడైనా, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వర్గానికి చెందిన వారని మాజీ ఎంపీపీ పుష్పావతి భర్తను పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టినా మంత్రి పట్టనట్టు వ్యవహరించలేదా అని విరుచుకుపడ్డారు. = కాలవ ఎంపీగా ఉన్నపుడు రాయదుర్గం ప్రాంతానికి ఒరగబెటిందేమీ లేదని ఎద్దేవా చేశారు. స్థానికేతరుడైన నీ గెలుపునకు కారణమైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి.. నీ రాక్షసత్వంపై పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. = నియోజకవర్గంలో నీవు మంత్రి అయిన తరువాతనే నీ ‘పచ్చ సైన్యం’ గూండాల ఆగడాలు, అకృత్యాలు పెచ్చరిల్లాయి. నీవు నియోజకవర్గానికి రాకమునుపు ఇలాంటి సంస్కృతే లేదు. దుర్గం రాజకీ యాల్లో అరాచకాలకు ఆజ్యం పోసిన ఘనుడవు నీవే’ అని విమర్శించారు. = మట్టి, ఇసుక దందాలకు పాల్పడుతూ ఇతరులపై విమర్శలు చేయడం చూస్తే ‘దొంగే .. దొంగ.. దొంగ’ అని అరిచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. నీ అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కాలవకు హెచ్చరించారు. -
రాక్షస ప్రభుత్వానికి పతనం తప్పదు : రాంభూపాల్
అనంతపురం అర్బన్: పోలీసుల ద్వారా ఉద్యమాలను అణచివేసేందుకు సిద్ధపడిన రాక్షస ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. సోమవారం మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిలో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. అప్పటికే కలెక్టరేట్, నగర పాలక సంస్థ వద్ద భారీగా మొహరించిన పోలీసులు.. కార్మికులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు తీరుపై సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. కార్మికుల అరెస్టు: వి.రాంభూపాల్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.శకుంతల, జె.రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి, వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. -
మంత్రి ఇంటిని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు
-
మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెం 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిని అడ్డుకున్న పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు మున్సిపల్ కార్మికులను అక్కడినుంచి ఈడ్చిపారేశారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాలువ అక్రమాల చిట్టా నా వద్ద ఉంది
-
కాలవా.. నీకిదే చివరి హెచ్చరిక!
‘‘బళ్లారికి వచ్చి నా వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా..? దేవుడి గుడిలో ప్రమాణం చేద్దామా..’’ అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపిస్తే నీవు కిమ్మనలేదు. అంటే పార్టీ సిద్ధాంతాలు, ప్రజలను పట్టించుకోకుండా కుమ్మక్కు రాజకీయాలు చేశావు. రాయదుర్గం: ‘‘నీవు రాజీనామా చేసి రా. నీపై బీసీ అభ్యర్థినే బరిలో దింపుతా, మా సహకారం లేకుండా గెలిచావనుకో.. నీవు గ్రేట్. నేను రాయదుర్గం వదిలి వెళ్లిపోతా. లేకపోతే నువ్వ వెళ్లిపోతావా. అందుకు సిద్ధమైతే.. రా తేల్చుకుందాం.’’ అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రి కాలవకు సవాల్ విసిరారు. ‘‘నన్నూ, నా అనుచర వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నావు. మీలాంటి వారికి నేను భయపడే రకం కాదు.. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ మంత్రిని హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన స్థానిక చేయూత చారిటబుల్ ట్రస్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ అధిష్టానం కాలవకు టికెట్ ఇచ్చినా.. ఎలాంటి స్వార్థం లేకుండా తాము పార్టీ కోసం పనిచేసి, ఆయన్ను గెలిపించామన్నారు. ఇప్పుడేమో ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని దగ్గరకు తీసుకుని, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను ఇబ్బందిపెడుతున్నారన్నారు. దీపక్ రెడ్డి కనబడరాదు, ఫ్లెక్సీలు కట్టరాదు, ఆయన్ను మరిపించాలని మంత్రి కాలవ ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో కుట్ర పన్నాడన్నారు. తాను టీడీపీ వ్యక్తిని కాదనేలా వ్యవహరిస్తున్నాడన్నారు. అయినా ప్రజల్లో దీపక్‌రెడ్డిని మరిపించడం మీ తాత తరం కూడా కాదన్నారు. ‘‘నేను టీడీపీ మనిషిని కాను అని చెప్పించగలవా? అలా చెప్పిస్తే నేను రాజీనామా చేసి, రాయదుర్గం వీడిపోతా. చెప్పించకపోతే నీవు రాజీనామా చేసి పోతావా? అంటూ కాలవకు సవాల్ విసిరారు. నీముఖం మీదే చెప్పింది మరిచావా..? ఎన్నికల ప్రచారంలో ఓటు అడగడానికి వెళితే.. దీపక్ రెడ్డి ముఖం చూసి ఓటేస్తామని ఆనాడు కార్యకర్తలు నీ ముఖం మీదే చెప్పడాన్ని మరచిపోయావా అని కాలవను ప్రశ్నించారు. తన వెంట తిరిగే స్టోర్ డీలర్‌ను తొలగించడం, 6ఏ కేసు బనాయించడం, పార్టీ సిద్ధాంతాలు వీడి డి.హీరేహాళ్ మండల ఎంపీపీని పదవి నుంచి దిగిపో అంటావా? అని దుయ్యబట్టారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ తిరిగి బలహీన పడుతోందనీ, 30 శాతం మంది కార్యకర్తలు మంత్రి పద్ధతి నచ్చక వైఎస్సార్సీపీలోకి వెళ్లాలని సిద్ధమైనా.. వారిని నివారించానన్నారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డిని, ఆయన అనుచరులను పక్కనపెట్టడం తగదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీనైన తనకు సమాచారం ఇవ్వవద్దని అధికారులకు చెబుతూ చిల్లర రాజకీయాలు చేయడం పద్ధతి కాదని కాలవకు సూచించారు. ఇప్పటికైనా మంత్రి తన విధానాలు మార్చుకోవాలి, లేకపోతే అసలు కథ ప్రారంభం అవుతుందన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని...తాను చిట్టా విప్పితే తట్టుకోలేవని కాలవను హెచ్చరించారు. -
అక్రమాలు బయటపడతాయని భయమా?
బెళుగుప్ప: అక్రమాలు బయటపడతాయనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని బహిరంగ చర్చను మంత్రి కాలవ శ్రీనివాసులు నీరుగార్చారంటూ రాయదుర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన నియోజకవర్గ అభివృద్ధి అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత సుదర్శనరెడ్డి గృహంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. విషయం తెలుసుకున్న ఆయన సతీమణి భారతి, అనంతపురం పార్లమెంట్ సమన్వయక్త తలారి పీడీ రంగయ్య అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడుతూ.. కాలవ శ్రీనివాసులు గతంలో ఈ ప్రాంతా ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో కనీసం ఐదు సార్లు కూడా రాయదుర్గంలో పర్యటించలేదని గుర్తు చేశారు. 2002లో కణేకల్లు, బొమ్మనహాళ్ ప్రాంతాలకు చెందిన 173 మంది రైతులపై అకారణంగా నాటి ప్రభుత్వం కేసులు పెడితే వారిని పరామర్శించిన దాఖలాలు కూడా లేవన్నారు. బహిరంగ చర్చ జరగకుండా పోలీసులను అడ్డు పెట్టుకుని కావాలనే తనను గృహ నిర్బంధం చేసారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 50 మందితో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్న మంత్రి బెల్టు షాపులు, మట్కా, పేకాట లాంటి వాటిని విచ్ఛలవిడిగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ బహిరంగ చర్చలో వెలుగు చూస్తాయని భయపడ్డారన్నారు. బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడగట్ట క్రిష్టప్ప, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దుద్దుకుంట రామాంజినేయులు, మండల ప్రధాన కార్యదర్శి అశోక్, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోదమ్మ పాల్గొన్నారు. -
ఆ మైత్రి విలువ రూ.342 కోట్లు
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. జిల్లాకు చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత బినామీగా చెప్పుకునే ఈ సంస్థ చేతిలో ఇప్పుడు లెక్కలేనన్ని పనులు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో.. కోట్లాది రూపాయల భారీ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. తాజాగా బీటీపీ మట్టి పనుల ముసుగులో మంత్రి కాలవశ్రీనివాసులు ఆమోదముద్రతో ఈ సంస్థ ఖాతాలో రూ.342కోట్ల టెండర్ చేరిపోయింది. ప్రతిఫలంగా 20 శాతం, అంటే రూ.68 కోట్లు మంత్రి జేబులోకి వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సాగునీరు.. రైతులు.. ఆయకట్టు ముసుగులో టీడీపీ నేతలు సాగిస్తున్న ధనయజ్ఞం పరాకాష్టకు చేరింది. ఎమ్మెల్యేలు.. మంత్రులకు గంపగుత్తగా కోట్లాది రూపాయలు ఇంటికి చేర్చే ఆదాయ వనరుగా భారీ నీటిపారుదల శాఖ మారిపోయింది. ఇందుకు ససాక్ష్యాలే 36వ ప్యాకేజీ, పేరూరు. తాజాగా ఆ జాబితాలో బీటీపీ కూడా చేరిపోయింది. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న నిధులను వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను తరిచి చూస్తే అవినీతి ఉప్పొంగుతున్న విషయం ఇట్టే అర్థమవుతుంది. హంద్రీనీవా పథకంలో భాగంగా 36వ ప్యాకేజీలో 80,600 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.336 కోట్లతో జీడిపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గం వరకు కాలవ తవ్వనున్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్యాకేజీ నుంచే బీటీపీకి నీళ్లిచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మరో రూ.968.89 కోట్లు ఖర్చ చేసి జీడిపల్లి నుంచి ప్రత్యేకంగా మరో కాలువ తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో సివిల్ వర్క్స్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. 1.19కోట్ల క్యూబిక్ మీటర్ల కాలవ తవ్వేందుకు టెండర్లను ఆహ్వానించారు. వాస్తవానికి మట్టి పని ఆ మేరకు లేదని తెలుస్తోంది. 72 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి.. అదనంగా 47లక్షల క్యూబిక్ మీటర్లు చేర్చి డీపీఆర్‌లో చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చక్రం తిప్పిన మంత్రి కాలవపెంచిన అంచనాల మేరకుమట్టి పనుల్లో టెండర్ దక్కించుకున్న సంస్థకు 47లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయకుండానే బిల్లు వచ్చే పరిస్థితి. ఈ అంచనాలను డీపీఆర్‌కు ముందు ప్రతిపాదనలు పంపే సమయంలోనే సర్వే చేసిన ఓ ఏజెన్సీతో మాట్లాడి మంత్రి కాలవ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలు నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లిన తర్వాత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో చర్చించి ఆమోదముద్ర వేయించి టెండర్ ఖరారు చేయించారు. మంత్రి కాలవకు సన్నిహితుడైన అమిలినేని సురేంద్ర నేతృత్వంలోని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు ఈ టెండర్ దక్కేలా మిగిలిన ఏజెన్సీలు పోటీలో లేకుండా చేసినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ టెండర్ మొత్తంలో 20 శాతం గుడ్‌విల్ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీటీపీ వద్ద పైలాన్ ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఈ నెలలో ‘అనంత’ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు అంచనా పెంపుపై సీఎంతో పాటు నీటిపారుదలశాఖ ఈఎన్సీకి టీడీపీలోని ఓ వర్గం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు స్వరూపం ఇదీ ⇔ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప(బీటీపీ)ప్రాజెక్టుకు నీళ్లు తీసుకెళ్లేందుకు రూ.968.89కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రధాన కాలవ, బ్రాంచ్ కెనాల్స్, సివిల్ వర్క్స్, మెకానికల్ వర్క్స్‌ను ఈ మొత్తంతో పూర్తి చేయాలి. ⇔ పథకంలో మొత్తం 1,507 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ పనిని సివిల్, మెకానికల్ పేరిట రెండుగా విడగొట్టారు. ⇔ సివిల్‌వర్క్స్‌కు సంబంధించి కాలవ తవ్వకం, స్ట్రక్చర్ల నిర్మాణ( కల్వర్లు, అక్విడిక్టులు) పనులను రూ.342కోట్లతో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. మెకానికల్ పనులను బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ చేజిక్కించుకుంది. ⇔ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి గరుడాపురం వరకు 28.7 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాలి. ఇందులో 7లిఫ్ట్‌లు(ఎత్తి పోతలు) ఉంటాయి. అక్కడి నుంచి బీటీపీకి మరో 32.625 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాలి. గరుడాపురం నుంచి మరో కాలువ కుందుర్పి వరకు 32.228 కిలోమీటర్లు. ⇔ మొత్తం ప్రాజెక్టులో 14 లిఫ్ట్‌లు, 227 స్ట్రక్చర్లు నిర్మించాలి. ఈ పథకం పూర్తయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, మండలాల్లో 114 చెరువులకు నీర నీరు అందించి 10,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం, అలాగే బీటీపీ ప్రాజెక్టు నుంచి గుమ్మఘట్ట మండలంలోని 12వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు కలిపి మొత్తం 22,300 ఎకరాలకు నీరు అందించాలని డీపీఆర్‌లో పొందుపరిచారు. రూ.150 కోట్ల దోపిడీ బీటీపీ ప్రాజెక్టులో రూ.150 కోట్ల దోపిడీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనులను రివైజ్ ఎస్టిమేషన్ వేస్తే రూ.150 కోట్లు ఆదా అవుతాయి. ప్రధాన కాలువ, ఉప కాలువలు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, వాటి ప్రవాహ సామర్థ్యం ఎంత అనేది బహిర్గతం చేయాలి. హంద్రీనీవా ప్రధాన కాలువ పనులే కిలోమీటరుకు లక్ష క్యూబిక్‌మీటర్లు వచ్చింది. మరి బీటీపీ కెనాల్‌ను ఈ స్థాయిలో నిర్మించనప్పుడు 1.19 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎలా వస్తుంది. 72 లక్షల క్యూబిక్‌మీటర్లే ఎక్కువ. ఇది బోగస్ సర్వే. తప్పుడు ప్రతిపాదనలతో టెండర్ వేసి, ఎన్నికల ముందు దోచుకునేందుకే ఈ పనులు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
'విశ్వ' రూపం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదంతో ఐఏబీ(సాగునీటి సలహా మండలి సమావేశం) సమావేశం రసాభాసగా మారింది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు కూడా హాజరుకాని పరిస్థితి. వచ్చిన వారి అభిప్రాయాలను కూడా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓపిగ్గా వినకపోవడం గమనార్హం. పక్ష ఎమ్మెల్యేలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెబుతుండగా మంత్రి జోక్యం చేసుకుని ‘ఓకే.. ఓకే.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. వీలైనంత త్వరలో నీళ్లిస్తాం’ అని అడ్డుపడ్డారు. స్వపక్షపార్టీ నేత కావడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికీ ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడేది పూర్తిగా వినాలని మంత్రికి చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్నా ఐఏబీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కనీసం పెదవి విప్పలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. చివరకు నీటి కేటాయింపుల గురించి కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటా 25.142 టీఎంసీలు తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత 164 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ధారించింది. ఇందులో దామాషా ప్రకారం 25.142 టీఎంసీలు హెచ్చెల్సీకి కేటాయించారు. ఇందులో తొలి ప్రాధాన్యతగా 10టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. తక్కిన 15.142 టీఎంసీలు సాగునీటికి కేటాయించారు. తుంగభద్ర మెయిన్ కెనాల్, జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్ కెనాల్), ఎంపీఆర్ దక్షిణ, ఉత్తర కాలువలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు కలిపి 6.808 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు 0.742 టీఎంసీలు, వైఎస్సార్‌జిల్లా మైలవరం బ్రాంచ్ కెనాల్‌కు 1.253, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు 1.378 టీఎంసీలు కేటాయించారు. మొదట పీఏబీఆర్, ఎంపీఆర్‌లో నీటిని నిల్వ చేసుకుని తర్వాత కోటా మేర కాలవలకు నీటి విడుదల ప్రారంభిస్తామన్నారు. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, జీబీసీకి ఈ నెల 6న నీటిని విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, విప్ యామినీబాల, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, హెచ్చెల్సీ ఎస్ఈ మక్బూల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జీబీసీకి రేపు నీటి విడుదల అసాధ్యం: జీబీసీకి రేపు నీటి విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అయితే కాలవ ఉన్న పరిస్థితుల్లో వెంటనే నీటి విడుదల సాధ్యం కాదని పనులు చూస్తే స్పష్టమవుతుంది. ఈ పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేస్తోంది. వీరికి నీటి విడుదల తేదీ 23 అని ప్రభుత్వం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలవలో మట్టి ఉంది. దీన్ని తొలగించాలంటే కనీసం 15–20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మంత్రి దేవినేని మాత్రం రేపు జీబీసీకి నీళ్లస్తామని ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి: ‘‘జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. కరువు మండలాలను ఏమైనా గుర్తించారా?’’ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. మంత్రి కాలవ: మీరు కరువు మండలాల గురించి మాట్లాడకూడదు. ఎమ్మెల్యే విశ్వ: ఏడాదికి ఒకసారి సమావేశం జరుగుతుంది. విపక్షపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉంటే కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఎలా? కాలవ: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే అనంతపురానికి, రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావు. చంద్రబాబే నీళ్లు తీసుకొచ్చారు. విశ్వ: చనిపోయిన వ్యక్తి పేరును ప్రస్తావించకూడదనే సంస్కారం కూడా లేదా. వైఎస్ హయాంలో హంద్రీనీవా 75శాతం పూర్తయితే ఇప్పటి వరకూ మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. 2012లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా? హంద్రీనీవా సామర్థ్యాన్ని 5టీఎంసీలకు తగ్గించి తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. 40టీఎంసీలతో వైఎస్ పనులు చేసి నీళ్లు తెచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 54వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచారు. అనంతపురం కరువు జిల్లా అని సొంత జిల్లా కేసీ కెనాల్‌కు వెళ్లే నీటిలో 10 టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా అనంతకు కేటాయిస్తూ వైఎస్ జీఓ ఇచ్చారు. ఆ నీళ్లే ఇప్పటికీ ‘అనంత’కు అందుతున్నాయి. పోలవరానికి రూ.5వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. కుడి కాలవను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్నా హంద్రీ–నీవా నీళ్లు జిల్లాకు వస్తుంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేక, ఒక్క ఎకరానూ తడపలేకపోయారు. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములైనా మీరు వైఎస్ గురించి మాట్లాడుతారా? .. విశ్వేశ్వరరెడ్డి నేరుగా సంధిం చిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాలవ సహనం కోల్పోయి సంబంధం లేని విషయాలను మాట్లాడారు. ఇంతలో మంత్రి దేవినేని ఉమాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. -
మంత్రుల గోబెల్స్ ప్రచారం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని.. బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిని నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని అన్నారు. బీసీలకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం లేకుండా చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌దేనని కృష్ణమూర్తి గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ ఏమైందంటూ ప్రశ్నించిన ఆయన దీనిపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బడ్జెట్ నిధులు, సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత, బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్ పోస్టులు ఎక్కడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే ఎందుకు నోరు మోదపడం లేదంటూ కాల్వ, యనమల తీరుపై విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్ పదవి యనమల వియ్యంకుడుకి ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ హయంలో బీసీలకు ఏం చేశారో చెప్పలేని మీరు.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఆశ..దోశ..అప్పడం..వడ
రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ మండలాల్లో 46 వేల ఎకరాలకు నీరిచ్చే విషయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పూటకోమాట మాట్లాడుతున్నారు. 50 రోజుల్లో మీ పొలాల్లో నీళ్లు పారిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ ఆడంబరంగా ప్రకటించారు. ఆ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో నీళ్లు వస్తాయని రైతులు ఎంతో ఆశగా క్యాలెండర్ తిరగేయడం మొదలెట్టారు. అయితే మార్చి 3వ తేదీ ఓ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 50 రోజుల్లో కచ్చితంగా నీళ్లు పారిస్తామన్నారు. మొదట చెప్పిన 50 రోజులా, ఇప్పటినుంచి 50 రోజులా అనేది రైతులకు అర్థం కాలేదు. ఏప్రిల్ మొదటివారంలో నీళ్లు రాకపోయేసరికి మార్చి 3వ తేదీ నుంచి 50 రోజులు అయి ఉంటుందనుకున్నారు. ఆ ప్రకారం ఏప్రిల్ నాలుగో వారంలో నీళ్లు వస్తాయని మళ్లీ క్యాలెండర్ చూడ్డం మొదలెట్టారు. నీళ్లు రాలేదుగానీ తాజాగా మంత్రి నుంచి శుక్రవారం మరో ప్రకటన వచ్చింది. అదేంటంటే ఆగస్టులో నీరు పారిస్తారంట. దీంతో రైతులు తీవ్ర నిరాశానిస్పృహలు వ్యక్తం చేస్తూ మంత్రి వైఖరి ‘ఆశ.. దోశ.. అప్పడం.. వడ’ అన్నట్లుగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కణేకల్లు:రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గంలో సభలు పెట్టిన ప్రతిసారీ ‘అదిగదిగో కృష్ణ జలా లు.. ఇక చూసుకోండి.. మీ పొలాలకు నీరి స్తాం... మీ కష్టాలు తీరుస్తాం’ అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారేగానీ ఆ దిశగా కనీ సం పనులను కూడా ప్రారంభించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ మండలాల్లో 46వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఆ దిశగా 36వ ప్యాకేజీలో మాల్యం బ్రాంచ్‌కెనాల్ పనులు చేపట్టేం దుకు టీడీపీ ప్రభుత్వం గత ఏడాది రూ.247 కోట్లు మంజూరు చేసింది. ఇం దులో ఉరవకొండ నియోజకవర్గ పరిధి లో పనులకు రూ.110 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో పనులకు రూ.137 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరి 14వ తేదీ బెలుగుప్ప మండలం దుద్దేకుంట వద్ద మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్సీ చీఫ్‌విప్ పయ్యావుల శ్రీనివాసులుతో కలిసి 36వ ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అదేరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజినీర్లతో కలిసి సొల్లాపురం వద్ద భూములను పరిశీలించారు. మంత్రి కాలవ మాల్యం బ్రాంచ్‌కెనాల్ స్కెచ్లను పాత్రికేయులకు చూపించి 50 రోజుల్లో కృష్ణాజలాలు పారిస్తామని చెప్పారు. తర్వాత మార్చి నెలలో మార్చి 3వ తేదీ సొల్లాపురంలో ఇంటిపట్టాల పంపిణీ సమయంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కచ్చితంగా 50రోజుల్లో కృష్ణాజలాలు అందిస్తామన్నారు. అయితే తాజాగా శుక్రవారం ఆయన జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డితో కలిసి సొల్లాపురం – పెనకలపాడు మధ్య మాల్యం బ్రాంచ్‌కెనాల్ పనులకు మళ్లీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టుకు ఆగస్టులో నీరిస్తామని చెప్పారు. 50 రోజుల్లో నీళ్లిస్తామన్న మంత్రి 72 రోజుల తర్వాత మళ్లీ అదేపనులకు భూమిపూజ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో నియోజకవర్గ ప్రజ లు, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే మంత్రి కాలవ ఇలా చేస్తూ వారిని మభ్యపెడుతున్నారని ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. -
సర్పంచ్ హక్కులను కాలరాశారు
గుమ్మఘట్ట: ‘ఈ నాలుగేళ్లు అనేక విషయాలలో సర్పంచుల హక్కులను కాలరాస్తూ నన్ను అడుగడుగునా అవమానించారు. ఇంతటి నీచమైన పాలన నా అనుభవంలో ఏనాడూ చూడలేదు. బాధ్యతగల పదవుల్లో ఉంటూ నీచ రాజకీయాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో వారే పునరాలోచించుకోవాలి’ అంటూ గుమ్మఘట్ట మండలం గొల్లపల్లి సర్పంచ్ విజేంద్ర రాష్ట్ర గ్రామీణ, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజులపై ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన స్థానికంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటికైనా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడంతోపాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రామప్రజలు సర్పంచ్‌గా తనను ఎన్నుకున్నప్పటికీ రాజ్యాంగేతర శక్తులుగా తయారైన జన్మభూమి కమిటీ సభ్యులే అన్నింటా ఆధిపత్యం చాటారని విచారం వ్యక్తం చేశారు. అధికారులు సైతం వారికి తొత్తులుగా మారి సర్పంచ్‌గా తనకు కనీస గౌరవమర్యాదలు కూడా ఇవ్వలేదని, అలాంటప్పుడు ఈ పదవి ఉండీ ఏం ప్రయోజనమని ఆవేదన చెందారు. మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మెన్ పూల నాగరాజులే ఈ నాలుగేళ్లూ గ్రామాభివృద్ధికి పూర్తిగా అడ్డుపడ్డారని సోదాహరణంగా వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ♦ 2016లో రూ.12 లక్షలతో నాలుగు సీసీ రోడ్లు, 2017లో రూ.10 లక్షలతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఆ పనులు చేపట్టకుండా మంత్రి, జెడ్పీ చైర్మన్లు అడ్డుపడ్డారు. పీఆర్ డీఈ రాజన్నను గట్టిగా నిలదీస్తే రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అప్పులు తెచ్చి రూ.22 లక్షలతో 6 రోడ్ల నిర్మాణానికి కంకర, ఇసుక, 1,600 బస్తాల సిమెంట్, ఇతర సామగ్రి సిద్ధం చేశాను. ఎర్త్ పనులు పూర్తి చేసి రోడ్డుపై కంకర పొడి కూడా చల్లి నిర్మాణం మొదలు పెట్టేటప్పుడు పీఆర్ డీఈ ఫోన్ చేసి మంత్రి, జెడ్పీ చైర్మన్ వద్దన్నారని, పనులు ఆపేయాలని చెప్పారు. ♦ రూ.10 లక్షలతో స్రీశక్తి భవన నిర్మాణానికి నన్ను బలవంతంగా ఒప్పించి నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పంప్‌హౌస్‌ను పగలగొట్టడంతోపాటు భక్తులు పూజించే భిల్వవృక్షాన్ని కూడా నాశనం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని అడ్డుకున్నా దౌర్జన్యంగా పనులు సాగిస్తున్నారు. ♦ నాకు సమాచారం ఇవ్వకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ఏపీఓ వెంకటేశ్‌నాయక్, గ్రామ కార్యదర్శి వెంకటరాముడు కాంట్రాక్టర్లతో కుమ్మకై చెత్తశుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టారు. ♦ జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో మంత్రి, జెడ్పీ చైర్మన్లను సన్మానించి గ్రామ సమస్యలు తీర్చాలని వేడుకున్నా వారు పట్టించుకోలేదు. గ్రామంలో నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని వేదికపై పట్టుబడితే తప్పక న్యాయం చేస్తామని చెప్పిన మంత్రి తర్వాత మాట తప్పారు. -
‘సుజనా, అశోక్ అందుకే రాలేదు’
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, అందుకే టీడీపీ పోరాటం చేస్తోందని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మంత్రులు, ఎంపీల వద్ద ప్రస్తావించారని సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యక్తిగత ఆరోపణలు చేశారని, వీటిని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి వేరే పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్లే పార్లమెంట్లో ఆవరణలో టీడీపీ ఎంపీలు నిర్వహించిన నిరసనలో పాల్గొనలేదని వెల్లడించారు. మంత్రుల గైర్హాజరుపై విభిన్న కథనాలు విన్పిస్తున్నాయి. తమ పదవులకు ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే టీడీపీ మంత్రులు తమ కార్యాలయాలకే పరిమితమైయారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతూ, అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న భయంతోనే ఇద్దరు మంత్రులు ధర్నాలో పాల్గొనలేదని ప్రచారం జరుగుతోంది. ధర్నాకు ఎందుకు రాలేదన్న దానిపై మంత్రులు నోరు విప్పలేదు. రాజ్‌నాథ్‌తో భేటీ తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఏడాదిలోగా అన్ని హామీలు అమలయ్యేలా చొరవ చూపాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఆహా.. ఓహో!
రాజులను ఎంత పొగిడితే అంత లబ్ధి చేకూరేది. ఈ సత్యం గ్రహించిన డీఎస్పీ కూడా.. మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా ఖాకీ డ్రెస్‌లో ఉండగానే. ఏందబ్బా.. ఈయన ఇంతలా పల్లకీ మోస్తున్నాడని ఆలోచిస్తే అసలు విషయం ఆలస్యంగా అవగతమైన ప్రజలు కూడా ఆయన తీరు పట్ల ఆహా.. ఓహో అంటూ నవ్వుకున్నారు. రాయదుర్గం: స్థానిక కేటీఎస్ డిగ్రీ కళాశాలలో హెరిటేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈజే నరేష్కుమార్(జయసుమన్) రచించిన రాయదుర్గం చరిత్ర–సంస్కృతి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటయింది. మంత్రి కాలవతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ రామక్రిష్ణారెడ్డి, డీఎస్పీ టీఎస్ వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలందరూ రాయదుర్గం చరిత్ర, రచయిత శైలిపై మాట్లాడితే.. డీఎస్పీ మాత్రం మంత్రి కాలవను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు అత్యధిక ఓట్లతో గెలుపొందడం ఓ చరిత్ర అంటూ ప్రారంభించారు. అనంతరం మంత్రి పదవి, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇదే నియోజకవర్గాన్ని వరించడం ఓ చరిత్ర అన్నారు. మంత్రి కాలవ శ్రీనివాసులు నీరు చెట్టు, వరుణయాగం, శ్రీనివాస కల్యాణం, జానపద జాతర, మెగాహెల్త్ క్యాంప్ తదితర కార్యక్రమాలను నిర్వహించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాయదుర్గం ప్రాంతాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలే కాలవ శ్రీనివాసులు రూపంలో రాయదుర్గం ప్రాంతానికి వచ్చారని కితాబిచ్చారు. డివిజనల్ స్థాయి అధికారి హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన తీరు సమావేశంలో చర్చనీయాంశమైంది. త్వరలో డీఎస్పీల బదిలీలు ఉండటంతోనే ఈ పల్లకీ మోతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. -
మండలానికి ఒక మోడల్ కాలనీ
అనంతపురం టౌన్: మండలానికి ఒక మోడల్ కాలనీ కట్టించడంపై దృష్టి సారించాలని.. అప్పుడే మనం ఏ ఇళ్లు కట్టించాం.. ఎన్ని కట్టించామనే లెక్క తేలుతుందని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం అనంతపురంలోని జెడ్పీ ఆవరణలో ఉన్న పంచాయతీ వనరుల కేంద్రం మీటింగ్ హాల్లో రాయలసీమ జిల్లాల హౌసింగ్ అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 15లోగా 2017–18, 2018–19కి సంబంధించి ఎన్టీఆర్ రూరల్ కింద మంజూరైన ఇళ్లకు పరిపాలన ఉత్తర్వులు తీసుకోవాలన్నారు. అధికారుల వైఖరితో తన పనితీరుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. సొంత జిల్లా అనంతపురం, ఇన్చార్జి మంత్రిగా ఉన్న కర్నూలులో ఇళ్ల నిర్మాణ ప్రగతి అధ్వానంగా ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ కారణాలుంటే తన దృష్టికి తేవాలన్నారు. జియో ట్యాగింగ్, బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు డబ్బు డిమాండ్ చేస్తే 1100 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం హౌసింగ్ ఎండీ కాంతిలాల్ దండేతో కలిసి జిల్లాల వారీగా సమీక్షించారు. సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ ఎస్ఈలు శ్రీరాములు, వెంకటరెడ్డి, మల్లికార్జునరావు, కలెక్టర్ వీరపాండియన్, జేసీ–2 ఖాజామొహిద్దీన్, సీమ జిల్లాల హౌసింగ్ పీడీలు సీవీ ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, ధనుంజయుడు, ఎస్వీఆర్ ప్రసాద్, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలకు రాయితీతో విత్తనాలు
అనంతపురం సిటీ: సకాలంలో కురవని వర్షాలతో రైతులు దిగాలు పడ్డారని, ఇక ప్రత్నామ్నాయ పంటలే దిక్కని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు రాయితీతో విత్తనాలు అందించేందుకు రూ.85.5 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. స్థానిక జాతీయ రహదారులు, భవనాల శాఖ అథితి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక జిల్లాలో వేరుశనగ విత్తనం విత్తేందుకు గడువు లేదని, ఖరీఫ్‌లో కూడా తుంగభద్ర ఎగువ కాలువలో నీళ్లు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఉలవలు 50 వేల క్వింటాళ్లు, అలసందలు 19 వేలు, కొర్ర 2500లు, పచ్చజొన్న 4500 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు అవసరం ఉందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పందించిన ముఖ్య మంత్రి అందుకు సరేనని చెప్పారు. రేపటి నుంచి ఈ విత్తనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. బయోమెట్రిక్ ద్వారా విత్తన పంపిణీ చేపట్టి ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. ఇక చంద్రన్న బీమా పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సహజ మరణం చెందిన కుటుంబాలకు పెద్దకర్మ రోజుకే రూ.30 వేలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులకు నంద్యాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
అనంతను అగ్రస్థానంలో నిలుపుదాం
స్వాతంత్ర్య దినోత్సవంలో మంత్రి కాలవ పరేడ్ గ్రౌండ్స్‌లో రెపరెపలాడిన తిరంగా జెండా అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అనంతపురం అర్బన్: త్రికరణ శుద్ధిగా అందరూ సమష్టిగా కృషి చేసి ‘అనంత’ను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలపుదామని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 71వ స్వాతంత్య్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలను పేదలందరికీ దక్కేలా జిల్లాలోని ప్రతి ఒక్కరూ యంత్రాగానికి సహకరించాలన్నారు. రైతన్నకు అండగా నిలుస్తాం ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. రుణ ఉపశమనం కింద రెండు విడుతల్లో రూ.2,728 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికి రూ.1,479 కోట్లను రైతులకు అందజేశామన్నారు. 6.50 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్లు వాతావరణ బీమాను జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో రక్షకతడులిచ్చి ఎండుతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు 5,897 రెయిన్గన్లు అందుబాటులో ఉంచామన్నారు. సగ్రమ ఉద్యాన అభివృద్ధి మిషన్, ఆర్కేవీవై పథకాల ద్వారా 25,439 మంది రైతుల లబ్ధిపొందేలా రూ.35.71 కోట్లు ఖర్చు చేశామన్నారు. 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని మంత్రి కాలవ తెలిపారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాలు అందించేందుకు రూ.1,171 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. పేరూరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.813 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే రూ.463.50 కోట్లతో తుంగభద్ర ఎగువ కాలువ వెడల్పు పునులు జరుగుతున్నాయన్నారు. రూ.519 కోట్లతో యాడికి కాలువ పనులు జరుగుతున్నాయనీ, రూ.509 కోట్లతో మిడ్‌పెన్నార్ దక్షిణ కాలువ పనులు త్వరలోనే చేపడతామన్నారు. డ్వాక్రా మహిళలకు చేయూత డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్నామని కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది 70,980 సంఘాలకు రూ.1,976 కోట్లు రుణాలు ఇప్పించామన్నారు. పుసుపు–కుంకుమ కింద 81,510 సంఘాలకు రూ.399 కోట్లు, వడ్డీ రాయితీ కింద 56,564 సంఘాలకు రూ.197 కోట్లు అందజేశామన్నారు. నిరుపేదలకు నీడ కల్పిస్తాం ఇల్లులేని నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి నీడ కల్పిస్తామని మంత్రి తెలిపారు. యూనిట్ విలువ రూ.1.50 లక్షల చొప్పున గత ఏడాది జిల్లాలో 17,400 గ్రామీణ గృహాలను కేటాయించామన్నారు. ఇందులో 4,202 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద రూ.2 లక్షలు యూనిట్ విలువతో 1,322 ఇళ్ల నిర్మాణానికి రూ.26.44 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. తాగునీరు, రహదారుల అభివృద్ధి చర్యలు తీసుకున్నామన్నారు. పారిశ్రాకంగా అభివృద్ధి చేస్తాం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.200 కోట్లతో ఎయిర్‌బస్, సొమందేపల్లి మండలం గుడిపల్లి, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద 2,143 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, పారిశ్రామిక వాడలు, బీకేఎస్ మండలం సిద్దరాంపురం వద్ద 151 ఎకరాల్లో నూనెగింజల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు భూములు సేకరించామన్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే భెల్, రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్, జేఎన్టీయూలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నామన్నారు. వేడుకల్లో కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, గోనగుంట్ల సూర్యనారాయణ, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూప, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడకల సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో డీఆర్డీఏ శాఖ ప్రదర్శించిన శకటానికి ప్రథమ బహుమతి, వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, డ్వామా శకటానికి తృతీయ బహుమతిని మంత్రి చేతుల మీదుగా ఆయా శాఖల అధికారులు అందుకున్నారు. మైదానంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. అదే విధంగా లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. -
స్వామి కార్యం.. స్వకార్యం
రాయదుర్గంలో నేడు శ్రీనివాస కల్యాణం • ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రచారం • మునిసిపల్, ఆర్అండ్బీ సిబ్బందితో పనులు • దగ్గరుండి పర్యవేక్షిస్తున్నఎమ్మెల్యే కాలవ రాయదుర్గం : రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీని వాస కల్యాణం నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్‌మూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలో ఎటు చూసినా ఇటువంటి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు నియోజకవర్గ ప్రజల బాగు కోసం తనే సొంతంగా కల్యాణోత్సవం జరుపుతున్నట్లు, డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ ఆ హ్వానించడం చర్చనీయాంశమైంది. ‘ఎవరో డబ్బు ఖర్చు చేస్తే.. డింగ్ డింగ్ యల్లమ్మ జాతర’ అన్న చం దంగా అయిందని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి.. రాయదుర్గం పట్టణంతో పాటు వివిధ మండలాల్లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు తీరికలేదు. ఎమ్మెల్యే అజమాయిషీతో.. ప్రైవేటు వ్యక్తి చేస్తున్న శ్రీనివాస కల్యాణోత్సవ ఏర్పాట్ల పనుల్లో ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ఆర్డీఓ రామారావు సైతం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తన సమయం వెచ్చించడం గమనార్హం. కృష్ణా పుష్కరాల పేరుతో రెండు వారాలపాటు అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు శ్రీనివాస కల్యాణోత్సవం పేరుతో మరో వారం రోజులు కష్టాలు తప్పలేదు. పాలకుల మెప్పు పొందడం కోసం అధికారులు తమ సిబ్బందిని పురమాయించి పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. -
వైఎస్ జగన్ ఏస్కూల్లో చదివారో తెలియదా?
-
వైఎస్ జగన్ ఏస్కూల్లో చదివారో తెలియదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష వాణి వినిపించకుండా చేసేందుకు అధికార పక్షం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బుధవారం శాసనసభలో వ్యక్తిగతాల జోలికి వెళ్లమంటూనే ....ప్రతిపక్ష సభ్యులు ...వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తన స్థాయిని మరిచి మరీ విమర్శలు చేసి..... వాస్తవాలు తెలుసుకోకుండా తన 'అ' మేధావి తనాన్ని బయటపెట్టుకున్నారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకున్న కాల్వ శ్రీనివాసులు.... తాము సంయమనం పాటిస్తున్నా వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారని, తన దగ్గర ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకోండంటూ సభాముఖంగా తమకు ఆఫర్ ఇచ్చిన మేథావి...' 1986-87లో శివశివానీ స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాలు దొంగలించాడట. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరూ అంటే వైఎస్ జగన్ అని తేలింది' అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారన్న విషయం కాల్వ శ్రీనివాసులకు తెలియకపోవటం శోచనీయం. -
'అనంత' కరువు జాతీయ విపత్తుగా ప్రకటించాలి
అనంతపురం: అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనంపురంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తన ప్రాతినిధ్యం వహించిన రాయదుర్గంలో ఏడారి ఇసుకమేటలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన చెందారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతపురాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువుపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇదే అంశంపై త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. -
కాలవకు అందలం
ప్రభుత్వ చీఫ్ విప్‌గా అవకాశం అనంతపురం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించిన అనంతపురం జిల్లాకు పదవులు కట్టబెట్టడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి, రాప్తాడు ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు ఇప్పటికే కేబినెట్లో చోటు కల్పించిన చంద్రబాబు... తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కూడా జిల్లాకే ఇచ్చారు. ఆ పదవికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేరును ప్రతిపాదించారు. కాలవ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. ఇదివరకు ఆయన మేనిఫెస్టో కమిటీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా...ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేసిన ఈయన బోయ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం సమీకరణల్లో భాగంగా 1999లో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ టికెట్ లభించింది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లోనూ పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్న పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఇద్దరూ హిందూపురం లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వారు. దీంతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మలివిడతలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులు లేదా పెనుకొండ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిలలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే.. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇస్తున్నారు. దీంతో రాష్ట్రస్థాయి పదవిపై ఆశలు పెట్టుకున్న బీకే పార్థసారథి అధినేత తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బీకే గతంలో పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. రొద్దం జెడ్పీటీసీగా ఉన్న ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఆ తరువాత 2004లో హిందూపురం లోక్‌సభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. 2009, 2014 ఎన్నికల్లో పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా విజయం సాధించారు. పార్టీలో సీనియర్ కావడంతో పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందారు. ఈ సమీకరణాలతో పాటు బీసీ కావడంతో బీకేకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే..లాభం లేకపోయింది. జిల్లా రూపురేఖలు మారేనా? కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కట్టబెట్టింది. శింగనమల ఎమ్మెల్యే యామినీ బాలను విప్‌గా ఎంపిక చేసింది. వీరందరూ కీలక బాధ్యతలు చేపట్టడంతో జిల్లా కరువు పరిస్థితులను రూపుమాపుతారా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే అన్ని రంగాల్లోనూ జిల్లా వెనకబడింది. జిల్లాకు పరిశ్రమలతో పాటు, ఐటీ పార్కులు తీసుకువస్తే అభివృద్ధి దిశగా నడిపించిన వారవుతారని ప్రజలు ఆశిస్తున్నారు. -
ఏపీ చీఫ్ విప్‌గా కాలువ శ్రీనివాసులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్‌గా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నియమితులయ్యారు. విప్‌లుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కూన రవి కుమార్, యామిని బాల, మేడ మల్లికార్జున రెడ్డిలను నియమించారు. కాల్వ శ్రీనివాసులుకు మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని గతంలో వార్తలు వినిపించినా అవకాశం రాలేదు. టీడీడీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీఫ్ విప్ పదవికి కాల్వ పేరును ఎంపిక చేశారు.