వైఎస్ జగన్ ఏస్కూల్లో చదివారో తెలియదా? | kalava srinivasulu allegations ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ఏస్కూల్లో చదివారో తెలియదా?

Published Wed, Mar 18 2015 12:42 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

వైఎస్ జగన్ ఏస్కూల్లో చదివారో తెలియదా? - Sakshi

వైఎస్ జగన్ ఏస్కూల్లో చదివారో తెలియదా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష వాణి వినిపించకుండా చేసేందుకు అధికార పక్షం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బుధవారం శాసనసభలో వ్యక్తిగతాల జోలికి వెళ్లమంటూనే ....ప్రతిపక్ష సభ్యులు ...వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తన స్థాయిని మరిచి మరీ విమర్శలు చేసి..... వాస్తవాలు తెలుసుకోకుండా తన 'అ' మేధావి తనాన్ని బయటపెట్టుకున్నారు.

అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకున్న కాల్వ శ్రీనివాసులు.... తాము సంయమనం పాటిస్తున్నా వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారని, తన దగ్గర ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకోండంటూ సభాముఖంగా తమకు ఆఫర్ ఇచ్చిన మేథావి...' 1986-87లో శివశివానీ స్కూల్కు చెందిన ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాలు దొంగలించాడట. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరూ అంటే వైఎస్ జగన్ అని తేలింది' అంటూ చెప్పుకొచ్చారు.

అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారన్న విషయం కాల్వ శ్రీనివాసులకు తెలియకపోవటం శోచనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement