'అనంత' కరువు జాతీయ విపత్తుగా ప్రకటించాలి
అనంతపురం: అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనంపురంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తన ప్రాతినిధ్యం వహించిన రాయదుర్గంలో ఏడారి ఇసుకమేటలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన చెందారు.
అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతపురాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువుపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇదే అంశంపై త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు.