National Calamity
-
జాతీయ విపత్తుగా ప్రకటించండి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని పరిశీలించడానికి స్వయంగా రాష్ట్రానికి రావాలని ఆహా్వనించారు. ఈ మేరకు ప్రధానిని కోరుతూ లేఖ రాయాలని సీఎస్‌ను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలపై సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రైల్వే లైన్లు కొట్టుకుపోవడం, పదుల సంఖ్యలో రోడ్లు, చెరువులకు గండ్లు పడడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, భారీ ఆస్తి నష్టాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధానిని రాష్ట్ర పర్యటనకు ఆహా్వనించాలని చెప్పారు. ఇళ్లు కూలినవారికి ఇందిరమ్మ ఇళ్లు వర్షాలు, వరదలతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు, పాడి పశువులకిచ్చే పరిహారాన్ని రూ.37,500 నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకిచ్చే పరిహారాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. (ఈ మేరకు పరిహారం పెంచుతూ విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది) తక్షణమే ఈ మేరకు పరిహారం అందించాలని ఆదేశించారు. ఇళ్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపండి ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. అయితే 4 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ అంచనాలను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలతో కేంద్రానికి సమగ్ర నివేదిక పంపించి కేంద్ర బృందాలను పరిశీలనకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. యువ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఎన్డీఆర్ఎఫ్ నుంచి తక్షణ సహాయం ఎందుకు అందడం లేదని సీఎం ప్రశ్నించగా, మన విజ్ఞప్తి ఆధారంగా వాళ్లు దగ్గరగా ఉన్న బలగాలను పంపుతారని, ఇందుకు సమయం పడుతుందని అధికారులు బదులిచ్చారు. భవిష్యత్తులో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లలోని యువ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి బృందాలను ఏర్పాటు చేసుకున్న ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని, అక్కడి వారితో శిక్షణ ఇప్పించాలని సూచించారు.కూలీలకు బియ్యం, పప్పులు ఇవ్వండి హైదరాబాద్ నగరంలో చిన్న అవాంఛనీయ సంఘటన జరగడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, తాగు నీటి సరఫరా, పారిశుధ్యం విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలొచి్చనా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. రోజూ కూలికి వెళ్లేవారు పనులు లేక ఇళ్ల దగ్గరే ఉండిపోతారని, అలాంటి వారిని గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయండి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడానికి కారణాలను సీఎం వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలొచ్చాయని, గతంలో ఐదేళ్లు, పదేళ్లకోసారి ఇలాంటి వర్షాలు వచ్చేవని, ఇటీవల తరచుగా కురుస్తున్నాయని, దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం సూచించారు. -
'అనంత' కరువు జాతీయ విపత్తుగా ప్రకటించాలి
అనంతపురం: అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనంపురంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తన ప్రాతినిధ్యం వహించిన రాయదుర్గంలో ఏడారి ఇసుకమేటలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన చెందారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతపురాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువుపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇదే అంశంపై త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. -
'హుదూద్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. తుపాను వల్ల స్టీల్ ప్లాంట్‌కు జరిగిన నష్టంపై ఆ సంస్థ ఉన్నతాధికారులను కారత్ అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాను ముంచుకోస్తుందని తెలిసిన అధికార్లు నిర్లక్ష్యం ఉందన్న వార్తలపై విచారణ జరిపించాలని కారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
హుదూద్ జాతీయ విపత్తే
విజయనగరం : తుపాన్ బాధితులకు కిరోసిన్, బియ్యంతోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు కూడా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు తెలిపారు. మంగళవారం హుదూద్ తుపాన్ నేపథ్యంలో సంభవించిన నష్టంపై రాష్ట్ర మంత్రి కె. మృణాళిని, జిల్లా అధికారులతో అశోక్‌గజపతి రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లాలో రూ. 250 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చెప్పారు. హుదూద్ తుపాన్ జాతీయ విపత్తే అని అశోక్ గజపతి రాజు అన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన 400 మంది ఇంజనీర్ల బృందంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. హుదూద్ తుపాన్‌తో విజయనగరం జిల్లాలో ప్రాధమిక అంచనా ప్రకారం రూ. 250 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రి మృణాళిని వెల్లడించారు. నష్టాన్ని ప్రత్యేక బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయని వెల్లడించారు. నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. -
హుదూద్ బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన జిల్లాలను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని ఆయన సోమవారమిక్కడ కోరారు. మంగళవారం విశాఖ వస్తున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా రూ.2వేల కోట్లు ప్రకటించాలన్నారు. తుఫాను ప్రళయంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడామని, ఆమె కూడా ప్రధానితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరతారన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రఘువీరా తెలిపారు. ప్రభుత్వ సిబ్బందికి పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరిస్తాయని ఆయన అన్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలంతా క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్నట్లు రఘువీరా తెలిపారు. -
'అనంతను కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
హైదరాబాద్: రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏర్పడిన కరువు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదర్భ, బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కాల్వ అన్నారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడం వలన జిల్లా ప్రజలు సమస్యల నుంచి గట్టేక్కుతారని కాల్వ శ్రీనివాసులు అన్నారు.